భార్య శాంపిల్స్‌ని పనిమనిషి పేరు మీద పంపిన డాక్టర్‌

కరోనా లక్షణాలతో బాధపడుతున్న తన భార్య శాంపిల్స్‌ను పనిమనిషి పేరు మీద పంపి బుక్కయ్యాడు ఓ డాక్టర్‌. దీంతో ఆ డాక్టర్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకుంది.

భార్య శాంపిల్స్‌ని పనిమనిషి పేరు మీద పంపిన డాక్టర్‌
Follow us

| Edited By:

Updated on: Jul 12, 2020 | 12:47 PM

కరోనా లక్షణాలతో బాధపడుతున్న తన భార్య శాంపిల్స్‌ను పనిమనిషి పేరు మీద పంపి బుక్కయ్యాడు ఓ డాక్టర్‌. దీంతో ఆ డాక్టర్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. సింగ్రౌలి ప్రాంతంలో పనిచేస్తున్న ప్రభుత్వ వైద్యుడు తన కుటుంబంతో కలిసి ఇటీవల ఉత్తరప్రదేశ్‌లోని ఓ పెళ్లికి హాజరయ్యాడు. పై అధికారులు సెలవులు ఇవ్వకపోయినప్పటికీ డాక్టర్ కుటుంబం యూపీకి వెళ్లింది. జూన్‌ 23న వివాహానికి హాజరై.. జూలై 1న తిరిగి ఇంటికి వచ్చింది.

ఇక నిబంధనల ప్రకారం హోం క్వారంటైన్‌లో ఉండకుండా ఆ డాక్టర్‌ విధులకు హాజరయ్యాడు. ఆ తరువాత ఆయన భార్యలో కరోనా లక్షణాలు కనిపించాయి. అయితే ఆమెకు నిర్ధారణ పరీక్షలు చేయిస్తే.. తాను ఉత్తరప్రదేశ్‌కి వెళ్లి వచ్చిన విషయం బయటపడుతుందని భావించిన ఆ డాక్టర్.. భార్య శాంపిల్స్‌ని ఇంట్లో పని మనిషి పేరిట పంపాడు. ఇక ఆ పరీక్షల్లో పాజిటివ్‌గా నిర్ధారణ అవ్వడంతో, అధికారులు పనిమనిషి ఇంటికి చేరుకున్నారు. దీంతో వైద్యుడి భాగోతం బయటపడింది. ఇక ఆ తరువాత డాక్టర్ కుటుంబ సభ్యులకు పరీక్షలు నిర్వహించగా.. అతడితో పాటు ఇంట్లోని మరో ఇద్దరికి పాజిటివ్‌గా తేలింది. ఈ క్రమంలో క్వారంటైన్ నిబంధనలు ఉల్లంఘించినందుకు, ఇతరుల పేరుతో శాంపిల్స్‌ని పంపినందుకు ఆ డాక్టర్‌పై ఎపిడమిక్ చట్టం కింద కేసు నమోదు చేశారు. కోలుకొని ఆసుపత్రి నుంచి వచ్చిన తరువాత డాక్టర్‌పై చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. ఇక వైద్యుడికి పాజిటివ్‌గా తేలడంతో అతడి కార్యాలయంలో పనిచేసే 33 మంది సిబ్బంది ఐసోలేషన్‌లోకి వెళ్లాల్సి వచ్చింది.

దా‘రుణ’సమస్యలు వేధిస్తున్నాయా? ఈ టిప్స్‌తో రుణ చెల్లింపు ఈజీ
దా‘రుణ’సమస్యలు వేధిస్తున్నాయా? ఈ టిప్స్‌తో రుణ చెల్లింపు ఈజీ
దద్దరిల్లిపోతున్న యూట్యూబ్...
దద్దరిల్లిపోతున్న యూట్యూబ్...
గూగుల్‌ నుంచి అదిరిపోయే ఫీచర్‌.. టోల్‌ ట్యాక్స్‌ ఆదా చేసుకోవచ్చు!
గూగుల్‌ నుంచి అదిరిపోయే ఫీచర్‌.. టోల్‌ ట్యాక్స్‌ ఆదా చేసుకోవచ్చు!
సమంతకు అనుపమ సపోర్ట్.. నేను కూడా అలా చేస్తానంటూ..
సమంతకు అనుపమ సపోర్ట్.. నేను కూడా అలా చేస్తానంటూ..
కాక రేపుతున్న ఉత్తరాంధ్ర రాజకీయాలు.. సీఎం రమేష్ వర్సెస్ వైవీ
కాక రేపుతున్న ఉత్తరాంధ్ర రాజకీయాలు.. సీఎం రమేష్ వర్సెస్ వైవీ
ఎల్‌టీఏ మినహాయింపు కావాలా? రెండు రోజుల్లో ఆ పని చేయడం మస్ట్
ఎల్‌టీఏ మినహాయింపు కావాలా? రెండు రోజుల్లో ఆ పని చేయడం మస్ట్
విరూపాక్ష డైరక్టర్‌‌తో అక్కినేని యంగ్ హీరో..
విరూపాక్ష డైరక్టర్‌‌తో అక్కినేని యంగ్ హీరో..
హార్దిక్‌కు మద్దతుగా సోనూసూద్.. ట్రోలర్స్‌కు హిత బోధ..ఏమన్నాడంటే?
హార్దిక్‌కు మద్దతుగా సోనూసూద్.. ట్రోలర్స్‌కు హిత బోధ..ఏమన్నాడంటే?
యూట్యూబ్‌ భారీ షాక్‌.. 9 మిలియన్లకు పైగా వీడియోల తొలగింపు.. కారణం
యూట్యూబ్‌ భారీ షాక్‌.. 9 మిలియన్లకు పైగా వీడియోల తొలగింపు.. కారణం
51ఏళ్ల వయసులో క్రికెట్‌తో అదరగొట్టిన కేంద్ర మంత్రి ఆరోగ్య మంత్రి.
51ఏళ్ల వయసులో క్రికెట్‌తో అదరగొట్టిన కేంద్ర మంత్రి ఆరోగ్య మంత్రి.