వైడ్స్ తో వరల్డ్ రికార్డ్

సెయింట్‌ లూసియా: ఇంగ్లండ్‌-వెస్టిండీస్‌ జట్ల మధ్య బుధవారం ముగిసిన మూడో టెస్టులో ఓ చెత్త రికార్డు నమోదైంది. ఆ టెస్టు మ్యాచ్‌లో ఇరు జట్ల బౌలర్లు కలిపి మొత్తం 38 వైడ్లు విసిరారు. దాంతో దశాబ్దం క్రితం వెస్టిండీస్‌-ఆసిస్ నమోదు చేసిన అత్యధిక వైడ్ల చెత్త రికార్డు బద్ధలైంది. 2008 జూన్‌లో బ్రిడ్జిటౌన్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో విండిస్-ఆస్ట్రేలియన్ బౌలర్లు కలిపి మొత్తం 34 వైడ్లు విసిరారు. వైడ్ల రూపంలో ఎక్కువ ఎక్స్‌ట్రా పరుగులిచ్చిన రెండు టెస్టుల్లోనూ […]

వైడ్స్ తో వరల్డ్ రికార్డ్
Follow us

| Edited By: Ram Naramaneni

Updated on: Oct 18, 2020 | 11:00 PM

సెయింట్‌ లూసియా: ఇంగ్లండ్‌-వెస్టిండీస్‌ జట్ల మధ్య బుధవారం ముగిసిన మూడో టెస్టులో ఓ చెత్త రికార్డు నమోదైంది. ఆ టెస్టు మ్యాచ్‌లో ఇరు జట్ల బౌలర్లు కలిపి మొత్తం 38 వైడ్లు విసిరారు. దాంతో దశాబ్దం క్రితం వెస్టిండీస్‌-ఆసిస్ నమోదు చేసిన అత్యధిక వైడ్ల చెత్త రికార్డు బద్ధలైంది. 2008 జూన్‌లో బ్రిడ్జిటౌన్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో విండిస్-ఆస్ట్రేలియన్ బౌలర్లు కలిపి మొత్తం 34 వైడ్లు విసిరారు. వైడ్ల రూపంలో ఎక్కువ ఎక్స్‌ట్రా పరుగులిచ్చిన రెండు టెస్టుల్లోనూ వెస్టిండీస్ బౌలర్లు భాగం కావడం విశేషం.

తాజా మ్యాచ్‌లో భాగంగా నాల్గో రోజు ఆటలో వెస్టిండీస్‌ బౌలర్‌  కీమర్‌ రోచ్‌  ఐదో బంతిని వైడ్‌గా వేశాడు.  దాంతో గత వైడ్ల రికార్డు సమం అయ్యింది. ఆపై వెస్టిండీస్‌ రెండో ఇన్నింగ్స్‌ చేపట్టిన క్రమంలో ఇంగ్లండ్‌ బౌలర్‌ మార్క్‌ వుడ్‌ 14 ఓవర్‌లో వైడ్‌ వేశాడు. ఫలితంగా 35 వైడ్లతో చెత్త రికార్డును ఇరు జట్లు మూటగట్టుకున్నాయి. ఆ తర్వాత ఇంగ్లండ్‌ మరో మూడు వైడ్లు వేయడంతో మొత్తంగా 38 వైడ్లు పడ్డాయి. ఇక‍్కడ రెండు ఇన‍్నింగ్స్‌ల్లో కలిసి వెస్టిండీస్‌ 24 వైడ్లు వేయగా, ఇంగ్లండ్‌ 14 వైడ్‌ బాల్స్‌ సంధించింది.

కుజ, గురు మధ్య రాశి పరివర్తన.. ఆ రాశుల వారికి భాగ్యయోగం, రాజయోగం
కుజ, గురు మధ్య రాశి పరివర్తన.. ఆ రాశుల వారికి భాగ్యయోగం, రాజయోగం
ముంబైతో మ్యాచ్.. టాస్ గెలిచిన పంజాబ్..జట్టులోకి విధ్వంసకర బ్యాటర్
ముంబైతో మ్యాచ్.. టాస్ గెలిచిన పంజాబ్..జట్టులోకి విధ్వంసకర బ్యాటర్
కుంభ రాశిలో రెండు గ్రహాల కలయిక.. ఆ రాశుల వారికి ఉద్యోగ యోగం పక్కా
కుంభ రాశిలో రెండు గ్రహాల కలయిక.. ఆ రాశుల వారికి ఉద్యోగ యోగం పక్కా
99లకే మల్టీప్లెక్స్ మూవీ టికెట్.. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడంటే?
99లకే మల్టీప్లెక్స్ మూవీ టికెట్.. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడంటే?
రాయి తంత్రం ఎవరిది? కాపు మంత్రం ఫలిస్తుందా? ఏపీలో పొలిటికల్ హీట్
రాయి తంత్రం ఎవరిది? కాపు మంత్రం ఫలిస్తుందా? ఏపీలో పొలిటికల్ హీట్
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
యూరిన్ ఇన్ఫెక్షన్ మళ్ళీ మళ్లీ వస్తుందా.. రీజన్, లక్షణాల ఏమిటంటే
యూరిన్ ఇన్ఫెక్షన్ మళ్ళీ మళ్లీ వస్తుందా.. రీజన్, లక్షణాల ఏమిటంటే
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??