ప్రపంచ పర్యాటక దినోత్సవం.. ఎప్పుడు ప్రారంభమైందంటే..?

ప్రపంచమంతా సెప్టెంబర్ 27న వరల్డ్ టూరిజం డే జరుపుకుంటారు. పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడానికి, స్థానిక సంఘాల నైపుణ్యాలు సాధించడంతో పాటుగా ఉపయోగాలు తెలియజేయడం కోసం 2014లో ప్రపంచ పర్యాటక దినోత్సవం థీమ్ ‘టూరిజం అండ్ కమ్యూనిటీ డెవెలప్‌మెంట్‌గా ఉండేది.  కాగా, ప్రపంచ మార్పు తీసుకురావాలనే ఉద్దేశంతో 2015లో యునైటెడ్ నేషన్స్ సస్టైనబుల్ డెవెలప్‌మెంట్‌ గోల్స్‌పై దృష్టి సారించింది. అంతేకాకుండా ఈ రోజున అనేక టూరిజం ఆర్గనైజేషన్స్ ప్రజలను ఆకర్షించేందుకు వివిధ రకాల కాంపిటీషన్స్‌ను నిర్వహిస్తారు. ఫ్రీ ఎంట్రీస్, […]

ప్రపంచ పర్యాటక దినోత్సవం.. ఎప్పుడు ప్రారంభమైందంటే..?
Follow us

| Edited By: seoteam.veegam

Updated on: Sep 27, 2019 | 3:53 PM

ప్రపంచమంతా సెప్టెంబర్ 27న వరల్డ్ టూరిజం డే జరుపుకుంటారు. పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడానికి, స్థానిక సంఘాల నైపుణ్యాలు సాధించడంతో పాటుగా ఉపయోగాలు తెలియజేయడం కోసం 2014లో ప్రపంచ పర్యాటక దినోత్సవం థీమ్ ‘టూరిజం అండ్ కమ్యూనిటీ డెవెలప్‌మెంట్‌గా ఉండేది.  కాగా, ప్రపంచ మార్పు తీసుకురావాలనే ఉద్దేశంతో 2015లో యునైటెడ్ నేషన్స్ సస్టైనబుల్ డెవెలప్‌మెంట్‌ గోల్స్‌పై దృష్టి సారించింది. అంతేకాకుండా ఈ రోజున అనేక టూరిజం ఆర్గనైజేషన్స్ ప్రజలను ఆకర్షించేందుకు వివిధ రకాల కాంపిటీషన్స్‌ను నిర్వహిస్తారు. ఫ్రీ ఎంట్రీస్, డిస్కౌంట్స్, స్పెషల్ ఆఫర్స్‌తో జనాలను పర్యాటక రంగం వైపు దృష్టి సారించేలా చేస్తారు.

ప్రపంచవ్యాప్తంగా పర్యాటక రంగం ఎంతో అభివృద్ధి చెందుతూ వస్తోంది. ఎన్నో అపురూపమైన, అందమైన డెస్టినేషన్ ప్లేస్స్ పర్యాటకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. అందువల్లే అభివృద్ధి చెందుతున్న దేశాలకు టూరిజం ఎక్కువ ఆదాయం తెచ్చిపెడుతోంది.

ప్రపంచ పర్యాటక దినోత్సవం గురించి…

ప్రతి ఏడాది సెప్టెంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా పర్యాటక దినోత్సవాన్ని జరుపుకుంటారు. పర్యాటక ప్రాముఖ్యత, సామాజిక, సాంస్కృతిక, రాజకీయ, ఆర్థిక విలువల గురించి అంతర్జాతీయంగా ప్రజలకు అవగాహన కల్పించే దిశగా ఈ  టూరిజం డే‌ను నిర్వహిస్తారు. యునైటెడ్ నేషన్స్ వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ వారు మొదటిసారిగా 1980లో ‘ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని’ సెప్టెంబర్ 27న నిర్వహించడం ప్రారంభించారు. అప్పట్నుంచీ – ఒక్కో సంవత్సరం ఒక్కో కాన్సప్ట్‌తో నిర్వహిస్తున్నారు. 1980లో – ‘టూరిజం కంట్రిబ్యూషన్ టు ది ప్రిజర్వేషన్ ఆఫ్ కల్చరల్ హెరిటేజ్ అండ్ టు పీస్ అండ్ మ్యూచువల్ అండర్‌స్టాండింగ్ అని పేరు పెట్టారు. ఇలా ప్రతి ఏడాది ఒక్కో అంశాన్ని తీసుకుని టూరిజం పట్ల పర్యాటకుల్లో ఆసక్తిని కలిగించడమే కాకుండా ఆయా చారిత్రక విషయాలను పదిలపరచుకోడానికి ఒక అవకాశంగా తీసుకుంటున్నారు.