హిట్లు బోలెడు.. కానీ టాప్ లిస్ట్‌లో లేడేం..!

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన ‘గద్దలకొండ గణేష్’ బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. తమిళ్‌లో విజయం సాధించిన ‘జిగర్తాండ’ రీమేక్‌ను తెలుగు నేటివిటీకి తగ్గట్లుగా అద్భుతంగా తెరకెక్కించాడు హరీశ్ శంకర్. ఇక ఈ మూవీకి వరుణ్ తేజ్ యాక్టింగ్ మెయిన్ అస్సెట్. విలన్ పాత్రలో వరుణ్ అదరగొట్టేశాడు. ముఖ్యంగా కొన్ని సన్నివేశాల్లో ఈ పాత్రను అతడు తప్ప మరెవరు చేయలేరు అన్న విధంగా ఆకట్టుకున్నాడు వరుణ్. అలాగే ఈ చిత్రానికి మరో ప్లస్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్. ఇంతవరకు […]

హిట్లు బోలెడు.. కానీ టాప్ లిస్ట్‌లో లేడేం..!
Follow us

| Edited By:

Updated on: Sep 24, 2019 | 5:23 PM

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన ‘గద్దలకొండ గణేష్’ బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. తమిళ్‌లో విజయం సాధించిన ‘జిగర్తాండ’ రీమేక్‌ను తెలుగు నేటివిటీకి తగ్గట్లుగా అద్భుతంగా తెరకెక్కించాడు హరీశ్ శంకర్. ఇక ఈ మూవీకి వరుణ్ తేజ్ యాక్టింగ్ మెయిన్ అస్సెట్. విలన్ పాత్రలో వరుణ్ అదరగొట్టేశాడు. ముఖ్యంగా కొన్ని సన్నివేశాల్లో ఈ పాత్రను అతడు తప్ప మరెవరు చేయలేరు అన్న విధంగా ఆకట్టుకున్నాడు వరుణ్. అలాగే ఈ చిత్రానికి మరో ప్లస్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్. ఇంతవరకు డీసెంట్ సినిమాలకు మాత్రమే ఎక్కువగా సంగీతం అందిస్తూ వచ్చిన మిక్కీ జే మేయర్.. ‘గద్దలకొండ గణేష్‌’ వంటి కమర్షియల్ చిత్రానికి అదిరిపోయే మాస్ బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌ను ఇచ్చాడు. దీంతో విమర్శకుల ప్రశంసలు సంపాదించుకున్నాడు ఈ సంగీత దర్శకుడు.

ఇక గద్దలకొండ గణేష్ సక్సెస్‌తో ఈ ఏడాది రెండో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు మిక్కీ. కాగా ‘పోతే పోని’ అనే చిత్రంతో టాలీవుడ్‌కు పరిచయమైన మిక్కీ జే మేయర్.. ‘హ్యాపీ డేస్‌’ విజయంతో అందరి నోళ్లలో నానాడు. ఆ తరువాత ‘కొత్త బంగారు లోకం’, ‘లీడర్’, ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’, ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’, ‘అఆ’, ‘శతమానం భవితి’ వంటి సినిమాల సక్సెస్‌లను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక గతేడాది వచ్చిన ‘మహానటి’తో మొదటిసారి ఓ భారీ కమర్షియల్ హిట్‌ను సాధించాడు మిక్కీ. అంతేకాదు ఇప్పటి వరకు 31 సినిమాలకు మాత్రమే సంగీతం అందించిన ఈ టాలెంటెడ్ మ్యూజిక్ డైరక్టర్.. మూడు నంది అవార్డులు, రెండు ఫిలింఫేర్ అవార్డులతో మరికొన్ని అవార్డులను సొంతం చేసుకున్నాడు.

అయితే ఇన్ని విజయాలున్నా మిక్కీ జే మేయర్ మాత్రం టాలీవుడ్‌లో టాప్ మ్యూజిక్ డైరక్టర్ లిస్ట్‌లో లేకపోవడం గమనర్హం. టాప్ మ్యూజిక్‌ డైరక్టర్‌ల లిస్ట్‌లో మొదటి వరుసలో ఎవరున్నారు అంటే.. కీరవాణి, మణిశర్మ, దేవీ శ్రీ ప్రసాద్, థమన్‌ల పేర్లే ఎక్కువగా వినిపిస్తాయి. అందుకే భారీ బడ్జెట్ చిత్రాలను తీయాలనుకునే దర్శకనిర్మాతలు మొదట కీరవాణి, దేవీ, థమన్‌ల సంప్రదిస్తున్నారు. వీరి సంగీతంపై కొన్ని విమర్శలు ఉన్నా.. మాస్‌లో వీరికి క్రేజ్ ఉండటంతో.. టాప్ హీరోలు సైతం మొదట వీరినే రెఫర్ చేస్తున్నారు. ఇక మిక్కీ విషయానికి వస్తే.. ఇప్పటివరకు మహేష్‌బాబు, వెంకటేష్ మినహా ఏ టాప్ హీరో సినిమాకు ఆయన సంగీతాన్ని అందించలేదు. ఇక ఆయన చేసిన కథలన్నీ కూడా క్లాస్ టచ్‌తోనే ఉండగా.. మాస్ సబ్జెక్ట్‌లకు దూరంగా ఉంటారనేది ఫిలింనగర్ టాక్. ఈ క్రమంలోనే మిక్కీ జే మేయర్‌ను భారీ బడ్జెట్ చిత్రాల కోసం, టాప్ హీరోల కోసం తీసుకోలేదన్నది కొందరి అభిప్రాయం. అందుకే ఆయన టాప్ లిస్ట్‌లో లేడని కొందరు అంటున్నారు. ఇక ఇప్పుడు గద్దలకొండ గణేష్‌తో మాస్ హిట్ కొట్టాడు కాబట్టి.. భవిష్యత్‌లో మరిన్ని విజయాలు సొంతం చేసుకొని టాప్ లిస్ట్‌లో చేరుతాడేమో చూడాలి.