Breaking News
  • సికింద్రాబాద్‌: మహంకాళి పీఎస్ ఎదురుగా ఉన్న జ్యువెలరీ షాప్‌లో చోరీ పెప్పర్‌ స్ప్రేతో దాడిచేసి రూ.30 లక్షలు దోచుకెళ్లిన దండగుడు మహంకాళి పీఎస్‌లో ఫిర్యాదు, కేసు నమోదు
  • ఆర్టీసీ సమ్మెపై నేడు హైకోర్టులో విచారణ పైవర్‌ కమిటీ ఏర్పాటుపై ప్రభుత్వ నిర్ణయాన్ని.. కోర్టుకు వెల్లడించనున్న అడ్వొకేట్‌ జనరల్
  • నేడు సుప్రీంకోర్టు మరో చారిత్రక తీర్పు సీజేఐని ఆర్టీఐ చట్టం పరిధిలోకి తేవడంపై తీర్పు చెప్పనున్న సుప్రీం 2010లో సీజేఐ ఆఫీస్‌ను ఆర్టీఐ పరిధిలోకి తెచ్చిన ఢిల్లీ హైకోర్టు తీర్పునులో సుప్రీంలో సవాల్‌చేసిన సుప్రీంకోర్టు సెక్రటరీ జనరల్
  • నేడు ఏపీ కేబినెట్‌ సమావేశం ఉదయం 11:30కి సమావేశం కానున్న మంత్రివర్గం ఇసుక కొరత, అక్రమ రవాణా, సంక్షేమ పథకాల అమలుపై చర్చ
  • నేటి నుంచి విధుల్లోకి రెవెన్యూ ఉద్యోగులు సమస్యల పరిష్కారంపై మంత్రి కేటీఆర్‌ భరోసా ఆందోళన విరమించిన రెవెన్యూ ఉద్యోగులు
  • నేటి నుంచి బ్రిక్స్‌ దేశాల సదస్సు ఎకనామిక్‌ గ్రోత్‌ ఫర్‌ యాన్ ఇన్నోవేటివ్ ఫ్యూచర్‌ అంశంపై చర్చ సదస్సులో పాల్గొననున్న భారత ప్రధాని నరేంద్ర మోదీ డిజిటల్‌ ఎకానమీ, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, ఉగ్రవాద నిరోధంపై.. బ్రిక్స్‌ సదస్సులో ప్రధానంగా చర్చించనున్న నరేంద్ర మోదీ

జగన్‌పై జేసీ యూటర్న్.. అయినా లాభం లేదా..!

నెల్లూరు పెద్దారెడ్డి అంటే ఎవరికీ తెలియకపోవచ్చు కానీ.. తాడిపత్రి పెద్దారెడ్డి అంటే ఇప్పుడు అందరికీ తెలుసు. ఆయన ప్రత్యర్థి జేసీ బ్రదర్స్‌ అంటే ఇంకా జనానికి ఎక్కువ తెలుసు. జగన్‌ అంటే రెండు కాళ్ల మీద లేచే జేసీ పెద్ద బ్రదర్‌ ఇప్పుడు మాత్రం గేర్‌ మార్చారు. తన రూటే సెపరేటు అంటూ యూటర్న్‌ బాట పట్టారు. ఇంతకీ జేసీ బ్రదర్‌ పొలిటికల్‌ బస్సు ఎందుకు రూటు మారింది.

తాడిపత్రి నుంచి ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన జేసీ దివాకర్ రెడ్డి.. ఒకసారి అనంతపురం ఎంపీగా పనిచేశారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు జగన్‌ మీద ఆయన సెటైర్ల మీద సెటైర్లు వేసేవారు. అంతేకాదు జగన్ అధికారంలోకి వచ్చే సీన్‌ లేదని ఎన్నికల ముందు ప్రకటనలు చేశారు. అయితే ఎన్నికల్లో బంపర్‌ మెజార్టీతో వైసీపీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి జేసీ ఒక్కసారిగా యూటర్న్‌ తీసుకున్నారు. జగన్ మా వాడే.. బాగా పరిపాలిస్తాడు అంటూ మాట్లాడటం మొదలెట్టారు. జగన్‌ పాలనకు జేసీ వందకు 150 మార్కులు వేస్తానంటూ కూడా అన్నారు.

కానీ ఇప్పుడు ఏపీ వ్యాప్తంగా ప్రైవేటు ట్రావెల్స్‌పై దాడులు ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో దివాకర్‌ ట్రావెల్స్‌కు చెందిన 31 బస్సులను సరైన రికార్డులు లేవనికేసులు నమోదు చేశారు. బస్సుల పర్మిట్లు సీజ్‌ చేశారు. అయితే ఇక్కడే జేసీ ఓ ప్రశ్న వేస్తున్నారు. రాష్ట్రంలో చాలా ట్రావెల్స్‌ బస్సులు ఉంటే…తమ బస్సులపైనే ఎందుకు ఫోకస్‌ పెట్టారని.. వాటినే ఎందుకు సీజ్‌ చేస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు జగన్‌ తమవాడేనని.. బస్సుల సీజ్‌పై న్యాయపరంగా తేల్చుకుంటామని అంటున్నారు. అయితే జేసీ దివాకర్‌ రెడ్డి నోటీ దురుసుతనం వల్లే ఈ సమస్యలు వచ్చి పడ్డాయని ఆయన అనుచరుల మాట. మరోవైపు తాడిపత్రిపై క్రమంగా పెద్దారెడ్డి ఆధిపత్యం పెరుగుతోంది. జేసీ బ్రదర్స్‌ పట్టు కోల్పోతున్నారు. ఇటు బస్సుల సీజ్‌తో రాజకీయంగా, ఆర్ధికంగా జేసీ బ్రదర్స్‌ చక్ర బంధంలో చిక్కుకున్నారని టాక్‌.