ఎలక్ట్రిక్ విమానం వచ్చేసింది.. రూ.500లకే ప్రయాణం..!

ఎలక్ట్రిక్ కార్లు, బైక్‌లు వచ్చేశాయి. ఇప్పుడు విద్యుత్తుతో నడిచే విమానాలు సిద్దమవుతున్నాయి. కొన్ని రోజుల క్రితం పారిస్‌లో జరిగిన ఎయిర్‌షో లో తొలి ఎలక్ట్రిక్ విమానాన్ని ప్రదర్శించారు. ఇజ్రాయిల్‌కి చెందిన ఏవియేషన్ అనే సంస్థ ఈ ఎలక్ట్రిక్ ఎయిర్ క్రాఫ్ట్ తయారు చేసింది. గంటకు 440 కిలోమీటర్ల వేగంతో ఈ విమానం ప్రయాణిస్తుంది. రూ.500 ఛార్జింగ్ ఖర్చుతో 160 కిలోమీటర్లు ప్రయాణించవచ్చు. ఈ మొదటి ఎలక్ట్రిక్ ఎయిర్‌క్రాఫ్ట్‌‌లో 9 మంది ప్రయాణించవచ్చని, 10వేల అడుగుల ఎత్తు వరకు […]

ఎలక్ట్రిక్ విమానం వచ్చేసింది.. రూ.500లకే ప్రయాణం..!
Follow us

| Edited By:

Updated on: Jun 22, 2019 | 1:44 PM

ఎలక్ట్రిక్ కార్లు, బైక్‌లు వచ్చేశాయి. ఇప్పుడు విద్యుత్తుతో నడిచే విమానాలు సిద్దమవుతున్నాయి. కొన్ని రోజుల క్రితం పారిస్‌లో జరిగిన ఎయిర్‌షో లో తొలి ఎలక్ట్రిక్ విమానాన్ని ప్రదర్శించారు. ఇజ్రాయిల్‌కి చెందిన ఏవియేషన్ అనే సంస్థ ఈ ఎలక్ట్రిక్ ఎయిర్ క్రాఫ్ట్ తయారు చేసింది. గంటకు 440 కిలోమీటర్ల వేగంతో ఈ విమానం ప్రయాణిస్తుంది. రూ.500 ఛార్జింగ్ ఖర్చుతో 160 కిలోమీటర్లు ప్రయాణించవచ్చు. ఈ మొదటి ఎలక్ట్రిక్ ఎయిర్‌క్రాఫ్ట్‌‌లో 9 మంది ప్రయాణించవచ్చని, 10వేల అడుగుల ఎత్తు వరకు ఆలిస్ వెళ్లగలదని కంపెనీ తెలిపింది. 2022 సంవత్సరం నాటికి ఈ విమానం సేవలు పూర్తిగా అందుబాటులోకి వస్తాయని ఏవియేషన్ సంస్థ వెల్లడించింది. ఇక ఎలక్ట్రిక్ విమానం అమ్మకాల్లో ఏవియేషన్ సంస్థ ఇప్పటికే బోణి కొట్టింది. అమెరికాకు చెందిన కేప్ ఎయిర్ అనే సంస్థ కొన్ని విమామానాలను కొనేందుకు ఏవియేషన్ సంస్థతో ఒప్పందం చేసుకుంది.