రేపు కుమారస్వామికి ‘ అగ్నిపరీక్ష ‘ ! ‘ సంకీర్ణం ‘ ఉండేనా ? ఊడేనా ?

కర్ణాటక సంక్షోభంపై సుప్రీంకోర్టు బుధవారం ఇచ్చిన తాత్కాలిక తీర్పు సీఎం కుమారస్వామి ప్రభుత్వానికి ‘ అగ్నిపరీక్షే ‘ ! రేపు (గురువారం) అసెంబ్లీలో ఆయన విశ్వాస పరీక్షను ఎదుర్కొనే సమయంలో సభకు తప్పనిసరిగా హాజరు కావాలని రెబెల్ ఎమ్మెల్యేలను తాము బలవంతంగా ఆదేశించజాలమని కోర్టు పేర్కొంది. దీంతో ప్రాక్టికల్ గా ‘ విప్ ‘ ఆదేశాల నుంచి వారికి ‘ రక్షణ ‘ లభించినట్టే.. వీరి రాజీనామాలపై స్పీకర్ దే తుది నిర్ణయమంటూ అత్యున్నత న్యాయస్థానం ఫ్రీ […]

రేపు కుమారస్వామికి ' అగ్నిపరీక్ష ' !  ' సంకీర్ణం ' ఉండేనా ? ఊడేనా ?
Follow us

|

Updated on: Jul 17, 2019 | 4:43 PM

కర్ణాటక సంక్షోభంపై సుప్రీంకోర్టు బుధవారం ఇచ్చిన తాత్కాలిక తీర్పు సీఎం కుమారస్వామి ప్రభుత్వానికి ‘ అగ్నిపరీక్షే ‘ ! రేపు (గురువారం) అసెంబ్లీలో ఆయన విశ్వాస పరీక్షను ఎదుర్కొనే సమయంలో సభకు తప్పనిసరిగా హాజరు కావాలని రెబెల్ ఎమ్మెల్యేలను తాము బలవంతంగా ఆదేశించజాలమని కోర్టు పేర్కొంది. దీంతో ప్రాక్టికల్ గా ‘ విప్ ‘ ఆదేశాల నుంచి వారికి ‘ రక్షణ ‘ లభించినట్టే.. వీరి రాజీనామాలపై స్పీకర్ దే తుది నిర్ణయమంటూ అత్యున్నత న్యాయస్థానం ఫ్రీ హ్యాండ్ ఇచ్చినప్పటికీ.. కాంగ్రెస్, జేడీ-ఎస్ పార్టీలు జారీ చేసిన విప్ నుంచి వీరికి రిలీఫ్ దొరికింది. అంటే విప్ ఆదేశాలను వారు ధిక్కరించవచ్ఛు. ఇక రాష్ట్ర అసెంబ్లీలో సభ్యుల సంఖ్యను పొలిటికల్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇద్దరు స్వతంత్ర ఎమ్మెల్యేలతో సహా మొత్తం 18 మంది ఎమ్మెల్యేలు రాజీనామాలు చేసిన నేపథ్యంలో.. వారు విశ్వాస తీర్మానానికి హాజరు కాకపోతే.. స్పీకర్ రమేష్ కుమార్ తో బాటు సభలో సభ్యుల సంఖ్య 207 కు తగ్గిపోతుంది. ట్రస్ట్ ఓట్ చేపట్టేంతవరకు ‘ ఈక్వేషన్ ‘ మారని పక్షంలో మెజారిటీ మార్క్ .. మినిమమ్.. 103 అవుతుంది. అప్పుడు కాంగ్రెస్, జేడీ-ఎస్ సంకీర్ణానికి వారి తరఫు నుంచి కేవలం 100 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉంటారు. సభలో బీజేపీ బలం 105. వీరికి ఇద్దరు ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలు మద్దతునిస్తే ఈ సంఖ్య 107 కు పెరుగుతుంది.

రెబల్ ఎమ్మెల్యేల రాజీనామాల విషయంలో స్పీకర్ తుది నిర్ణయం తీసుకోవాలని కోర్టు స్పష్టం చేసినా.. ‘ సరైన సమయంలో ‘ ఆయన వారి విషయంలో తప్పనిసరిగా నిర్ణయం తీసుకోవాలని మెలిక పెట్టింది. చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ ఆధ్వర్యాన గల ముగ్గురు సభ్యుల బెంచ్.. స్పీకర్ ను ఆదేశించాలని కాంగ్రెస్ సీనియర్ నేత, న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఆయన 27 ఏళ్ళ నాటి ఓ కేసును ప్రస్తావించారు. ఆ కేసులో… నాడు అయిదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం 1985 నాటి 52 వ రాజ్యాంగ సవరణను పరిశీలించిందని పేర్కొన్నారు. ఆ సవరణలో రాజ్యాంగంలోని 10 వ షెడ్యూల్ ని చేర్చారని, పార్టీ ఫిరాయింపులకు పాల్పడితే స్పీకర్ తగిన చర్యలు తీసుకోవాలని నిర్దేశించిందని అన్నారు. అదే ఆ తరువాత పార్టీ ఫిరాయింపుల నిషేధ చట్టంగా మారిందన్నారు. ఆ సవరణ సక్రమమేనని 5 గురు జడ్జీల ధర్మాసనం తీర్పునిచ్చిన విషయాన్ని సింఘ్వీ గుర్తు చేశారు. ఒక ఎమ్మెల్యే రాజీనామా పైనో, అనర్హత పైనో నిర్ణయం తీసుకునే అధికారం స్పీకర్ దేనని వారు తీర్పునిచ్చారని అన్నారు. 1992 నాటి ఆ ఉత్తర్వులకు అనుగుణంగానే ప్రస్తుతం సీజేఐ రంజన్ గొగోయ్, న్యాయమూర్తులు దీపక్ గుప్తా, అనిరుద్ బోస్ లతో కూడిన బెంచ్ వ్యవహరించినట్టు స్పష్టమవుతోందని ఎనలిస్టులు భావిస్తున్నారు.

అటు-రేపటి అసెంబ్లీకి తాము హాజరు కాబోమని 15 మంది రెబెల్ ఎమ్మెల్యేలు ప్రకటించడంతో కర్ణాటకలో కుమారస్వామి ప్రభుత్వం పడిపోవడం ఖాయమని అంటున్నారు. ఆయన ఇక గద్దె దిగడం వాస్తవమవుతుందని మాజీ సీఎం, బీజేపీ నేత ఎడ్యూరప్ప వ్యాఖ్యానించారు. సుప్రీంకోర్టు తీర్పు రెబెల్ ఎమ్మెల్యేలకు నైతిక విజయమని ఆయన పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. సీఎం కుమారస్వామి..సుప్రీం తీర్పుపై స్పందించలేదు. తన ప్రభుత్వానికి ఢోకా లేదని ఆయన నిన్నటివరకు గంభీరంగా..ధీమాగా ఉండగా. బుధవారం కోర్టు ఇచ్చిన తీర్పుతో హతాశులైనట్టు కనిపిస్తోంది.

పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!