రాజగోపాల్ పార్టీ మారడంలో జాప్యం దేనికి.. అసలు కారణం ఇదేనా..?

కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీ మారడంపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. కాంగ్రెస్ పార్టీ నుంచి కమలం గూటికి చేరుతానంటూ ఇప్పటికే స్పష్టం చేశారాయన. అయితే అప్పుడు ఆశాడం అడ్డొచ్చిందేమో అనుకున్నారంతా. అయితే ఇప్పుడు శ్రావణ మాసం కూడా అయిపోతోంది.. అయినా ఇంకా పార్టీ మారలేదు రాజగోపాల్ రెడ్డి. అయితే ఇప్పుడు ఇదే అంశం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ప్రస్తుతం తెలంగాణ అసెంబ్లీలో బీజేపీకి ఒక్క సీటు మాత్రమే ఉంది. అయితే ఎట్టి […]

రాజగోపాల్ పార్టీ మారడంలో జాప్యం దేనికి.. అసలు కారణం ఇదేనా..?
Follow us

| Edited By:

Updated on: Aug 29, 2019 | 10:14 PM

కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీ మారడంపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. కాంగ్రెస్ పార్టీ నుంచి కమలం గూటికి చేరుతానంటూ ఇప్పటికే స్పష్టం చేశారాయన. అయితే అప్పుడు ఆశాడం అడ్డొచ్చిందేమో అనుకున్నారంతా. అయితే ఇప్పుడు శ్రావణ మాసం కూడా అయిపోతోంది.. అయినా ఇంకా పార్టీ మారలేదు రాజగోపాల్ రెడ్డి. అయితే ఇప్పుడు ఇదే అంశం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ప్రస్తుతం తెలంగాణ అసెంబ్లీలో బీజేపీకి ఒక్క సీటు మాత్రమే ఉంది. అయితే ఎట్టి పరిస్థితుల్లో బీజేపీ అసెంబ్లీలో తమ బలం పెంచుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. అంతేకాదు వచ్చే ఎన్నికల నాటికి తెలంగాణలో కమలం వికసించేలా ప్రయత్నాలు చేస్తోంది. అందుకు ఇప్పటి నుంచే గ్రైండ్ సెట్ చేసుకుంటూ వస్తోంది. ఇప్పటికే కీలకమైన టీడీపీ నేతలను పార్టీలో చేర్చుకోగా.. మరి కొందరిని కూడా ఆకర్షించే పనిలో పడింది. అయితే ఎప్పటి నుంచో మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి బీజేపీలోకి జంప్ చేయనున్న విషయం తెలిసిందే. అయితే ఎందుకు ఇంకా మారడం లేదన్న దానికి పలు కారణాలు ఉన్నాయి. అందులో మొదటిది అనర్హత వేటు. ఇప్పటికే పీసీసీ చీఫ్‌తో కోమటి రెడ్డి బ్రదర్స్‌కి మధ్య సంబంధాలు అంతంత మాత్రమే. ఈ సమయంలో ఒకవేళ పార్టీ మారితే వెంటనే అనర్హత వేసే అవకాశం ఉంది. దీంతో అతని ఎమ్మెల్యే పదవి కోల్పోయే అవకాశం ఉంది. అయితే ఇలా కాకుండా ఆచితూచి అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. టీఆర్ఎస్ పార్టీలో చేరిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అనర్హత వేటు పడకుండా సీఎల్పీనే టీఆర్ఎస్‌లో విలీనం చేసిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీకి కేవలం ఆరుగురు మాత్రమే ఉన్నారు. దీంతో వీరిలో రాజగోపాల్ రెడ్డితో పాటు మరో ముగ్గురిని బీజేపీలోకి తీసుకెళ్తే అటు బీజేపీ బలోపేతంతో పాటుగా.. అనర్హత వేటు పడకుండా ఉంటుంది. అయితే ఇప్పుడు ఇదే ప్లాన్‌తో రాజగోపాల్ రెడ్డి ముందుకు వెళ్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ విషయంలో నలుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో భేటీ అయినట్లు కూడా తెలుస్తోంది. టీఆర్ఎస్‌ను ఎదుర్కోవాలంటే బీజేపీతోనే సాధ్యమవుతుందని, పార్టీలోకి వస్తే మంచి భవిష్యత్తు ఉంటుందని వారికి చెబుతున్నట్లు తెలిసింది. మరి కొద్ది రోజులు వేచి చూస్తే రాజగోపాల్ రెడ్డి రాజకీయ ప్రస్థానం ఏలా ఉండబోతుందో తెలుస్తుంది.