Breaking News
  • అసెంబ్లీ సాక్షిగా ఐదు కోట్ల ఆంధ్రులను మోసం చేశారు. న్యాయం చేయమని రోడ్డుపైకి వచ్చిన మహిళను అరెస్ట్ చేస్తున్నారు. మహిళలపై లాఠీచార్జ్‌ దారుణం-నారా లోకేష్‌. మండలిలో రేపు ఏం జరుగుతుందో ప్రజలే చూస్తారు-లోకేష్‌.
  • బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా జేపీ నడ్డా ఎన్నిక సంతోషకరం. తెలంగాణ తరపున అభినందనలు తెలిపాం. తెలంగాణపై దృష్టిపెట్టాలని కోరాం-టీఎస్‌ బీజేపీ చీఫ్‌ డా.లక్ష్మణ్‌. త్వరలో తెలంగాణలో జేపీ నడ్డా పర్యటిస్తారు. కాంగ్రెస్‌, టీఆర్‌ఎస్‌, మజ్లిస్‌ ఒక గూటి పక్షులే-డా.లక్ష్మణ్‌.
  • అమరావతి: పవన్‌తో పోలీసుల మంతనాలు. రాజధాని గ్రామాల పర్యటన వాయిదా వేసుకోవాలంటున్న పోలీసులు.
  • కరీంనగర్‌లో గంజాయి ముఠా గుట్టురట్టు. రూ.30 లక్షల విలువైన గంజాయి పట్టివేత. ముగ్గురు అరెస్ట్‌, ట్రక్‌ స్వాధీనం.
  • చెన్నై విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టివేత. అబుదాబి నుంచి చెన్నైకి తరలిస్తున్న 3.7 కేజీల బంగారం పట్టివేత. ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్న కస్టమ్స్ అధికారులు.

ఆ పార్టీలో వాళ్లిద్దరూ ఎందుకు సైలెంటయ్యారు?

Why Roja and Vasireddy Padma Silent Nowadays, ఆ పార్టీలో వాళ్లిద్దరూ ఎందుకు సైలెంటయ్యారు?

రోజా, వాసిరెడ్డి పద్మ… వీరిద్దరూ చాలాకాలం పార్టీకి ప్రధానమైన గొంతుకగా ఉన్నారు. వారు మీడియాతో మాట్లాడినా – టీవీ డిబేట్లలో పాల్గొన్నా రాష్ట్రమంతా వినేది. కానీ ఈ ఇద్దరి గొంతూ కొన్నాళ్లుగా వినిపించడం లేదు. ముఖ్యంగా ఏపీలో వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తరువాత కూడా ఈ ప్రధాన గళాలు నెమ్మదించడంతో పార్టీకి ఇబ్బందులు తప్పడం లేదు. వారిని ఎదుర్కోవడం ఇతర పార్టీల నాయకులకు కష్టంగా ఉండేది. కానీ ఇప్పుడు పార్టీ తరఫున ప్రస్తుతం డిబేట్లలో పాల్గొంటున్నవారు ఇతర పార్టీల నాయకులను సమర్థంగా ఎదుర్కోలేకపోతున్నారు.

రోజా మొన్నటి ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే జగన్ ఆమెకు మంత్రి పదవి ఇవ్వలేదు. దీంతో కొద్దిరోజులు ఆమె అసంతృప్తి చెందారన్న ప్రచారమూ జరిగింది. అయితే ఆమెకు ఏపీఐఐసీ పదవిని జగన్ కట్టబెట్టారు. అయినప్పటికీ ఆమె ఎందుకో మునుపటిలా యాక్టివ్ గా లేరు. పెద్దగా మీడియాతో మాట్లాడడం లేదు.

ఇక వాసిరెడ్డి పద్మకు ఇటీవలే మహిళా కమిషన్ చైర్మన్ పదవి ఇచ్చారు జగన్. ఆమె ఎమ్మెల్సీ పదవి ఆశించినప్పటికీ ఈ పదవితో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అయితే ఎమ్మెల్సీ పదవికి ముందే జగన్ కు కమిట్ మెంట్లు ఉండడం.. మంత్రివర్గంలోకి తీసుకున్న మోపిదేవి వంటివారికి ఇవ్వాల్సిన తప్పనిసరి పరిస్థితులు ఉండడంతో వాసిరెడ్డి పద్మ పరిస్థితులను అర్థం చేసుకున్నారనే చెబుతున్నారు. అయితే మహిళా కమిషన్ చైర్మన్ పదవిలోకి వచ్చిన తరువాత కూడా ఆమె యాక్టివ్ గా లేరు.

రోజా – పద్మలు యాక్టివేట్ అయితేనే వైసీపీ ప్రస్తుతం బాలారిస్టాలను కవర్ చేసుకునే అవకాశం ఉంటుంది. పార్టీ అధికార ప్రతినిధులు టీడీపీ నేతలను డిబేట్లలో ఎదుర్కోలేకపోతున్నారు. టీడీపీకి నాలెడ్జ్ సెంటర్ ఉండడంతో అక్కడి నుంచి ఎప్పటికప్పుడు వారికి కావాల్సిన సమాచారం అందుతుంటుంది. కానీ వైసీపీకి అలాంటి వ్యవస్థ లేదు. నాయకులే హోం వర్క్ చేసి సరైన సమాచారంతో తమ వాదనలు వినిపించాలి. అందరిలో ఈ సామర్థ్యం లేకపోవడంతో విఫలమవుతున్నారు. దీంతో ఈ పరిస్తితుల్లో వాసిరెడ్డి పద్మ – రోజాలు మళ్లీ తమ వాయిస్ వినిపిస్తేనే బెటరని పార్టీ వర్గాల నుంచి వినిపిస్తోంది.