“రామయణ్” బీబీసీకి అందుకే ఇవ్వలేదు..! దర్శకుడి కొడుకు చెప్పిన నిజాలు

లాక్‌డౌన్ సమయంలో ఎంటర్‌‌టైన్‌ చేసేందుకు దూర‌దర్శన్‌ టెలికాస్ట్‌ చేసిన రామానంద్‌ సాగర్‌‌ రామాయణం రికార్డుల మోత మోగించింది. 33 సంత్సరాలైనా ప్రజల నుంచి షోకు ఉన్న ఆదరణ తగ్గలేదని నిరూపించింది. ప్రపంచంలోనే ఎక్కువ మంది చూసిన ఎంటర్‌‌టైన్మెంట్‌ షోలో ఒకటిగా నిలిచింది. దూర్‌‌దర్శన్‌లో రీ టెలికాస్ట్‌ చేసిన రామాయణ షోను ఏప్రిల్‌ 16న ప్రపంచ వ్యాప్తంగా 7.7 కోట్ల మంది చూశారు. లాక్‌డౌన్‌ కారణంగా ఇంట్లోఉండే ప్రజలకు బోర్‌‌ కొట్టకుండా డీడీ ఛానల్‌ పాత సీరియళ్లు, షో […]

రామయణ్ బీబీసీకి అందుకే ఇవ్వలేదు..! దర్శకుడి కొడుకు చెప్పిన నిజాలు
Follow us

| Edited By:

Updated on: May 19, 2020 | 11:06 AM

లాక్‌డౌన్ సమయంలో ఎంటర్‌‌టైన్‌ చేసేందుకు దూర‌దర్శన్‌ టెలికాస్ట్‌ చేసిన రామానంద్‌ సాగర్‌‌ రామాయణం రికార్డుల మోత మోగించింది. 33 సంత్సరాలైనా ప్రజల నుంచి షోకు ఉన్న ఆదరణ తగ్గలేదని నిరూపించింది. ప్రపంచంలోనే ఎక్కువ మంది చూసిన ఎంటర్‌‌టైన్మెంట్‌ షోలో ఒకటిగా నిలిచింది. దూర్‌‌దర్శన్‌లో రీ టెలికాస్ట్‌ చేసిన రామాయణ షోను ఏప్రిల్‌ 16న ప్రపంచ వ్యాప్తంగా 7.7 కోట్ల మంది చూశారు. లాక్‌డౌన్‌ కారణంగా ఇంట్లోఉండే ప్రజలకు బోర్‌‌ కొట్టకుండా డీడీ ఛానల్‌ పాత సీరియళ్లు, షో లను రీ టెలికాస్ట్‌ చేసింది. జూన్ 2003 నాటికి ఇది లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో ప్రపంచంలో అత్యధికంగా వీక్షించిన పౌరాణిక సీరియల్‌గా రికార్డ్‌లకెక్కింది. ఇక ఇప్పుడు మరో రికార్డును తన కథలో వేసుకుంది రామాయణం.

డీడీలో రావటానికి ఓ పెద్ద కారణముందని రామయణ్ దర్శకుడు రామానంద్ సాగర్ కుమారుడు ప్రేమ్ సాగర్ అన్నారు. ప్రముఖ దర్శకుడు రామానంద్‌ సాగర్‌ తెరకెక్కించిన ‘ రామాయణం’ ధారావాహికను ప్రసారం చేసేందుకు ప్రముఖ ఛానెల్‌ బీబీసీ ముందుకు వచ్చిందని అన్నారు. అయితే బీబీసీకి ఆ ప్రసార హక్కులను అప్పగించేందుకు తన తండ్రి రామానంద్‌ ఒప్పుకోలేదన్నారు. కాగా ఈ సీరియల్‌కు సంబంధించిన ఈ ఆసక్తికర విషయాన్ని ప్రేమ్‌ సాగర్‌  వెల్లడిచారు. అప్పుడూ.. ఇప్పుడూ.. విదేశీ ఛానల్స్ కు రామాయణ్ అనేది కాస్ట్యూమ్ డ్రామాగా చూస్తారని అన్నారు.