Breaking News
  • ఆర్టీసీ కార్మికుల ఆత్మహత్యలపై కౌంటర్‌ దాఖలు చేసిన ప్రభుత్వం. నిరాధార ఆరోపణలతో ప్రభుత్వంపై నిందలు వేస్తున్నారు. ఆత్మహత్యలకు కారణాలను దర్యాప్తు సంస్థలు తేల్చాల్సి ఉంది. చట్టప్రకారం చర్యలు చేపట్టాలని కార్మికశాఖ కమిషనర్‌ను ఇప్పటికే హైకోర్టు ఆదేశించిందన్న సీఎస్‌. కార్మికుల జీతాలు సహా ఇతర డిమాండ్లపై కార్మికశాఖ కమిషనర్‌ తగిన చర్యలు తీసుకుంటారన్న సీఎస్‌.
  • ఏపీ బ్యాడ్మింటన్‌ అసోసియేషన్‌లో భారీగా నిధుల దుర్వినియోగం. మాజీ సెక్రటరీ చౌదరి సహా కొందరు సభ్యులపై కేసు నమోదు. నిధులు దుర్వినియోగం అయినట్టు రుజువుకావడంతో పున్నయ్య చౌదరిని అరెస్ట్‌చేసిన పోలీసులు.
  • విజయవాడ: సీఎం జగన్‌ పాలనతో సహకారం రంగం విరాజిల్లుతోంది. 2004లో స్వర్గీయ వైఎస్‌ఆర్‌ కోఆపరేటివ్‌ వ్యవస్థను బలోపేతం చేశారు. సహకారం రంగాన్ని టీడీపీ ప్రభుత్వం కుదేలు చేసింది. ఉద్యోగుల సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వం అండగా ఉంటుంది. రాజకీయ నాయకుల లాగా ఉద్యోగులు యూనియన్లు మారొద్దు-మంత్రి పేర్ని నాని. సహకార వ్యవస్థను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. రైతులకు అన్ని విధాలుగా సహకరించి రుణాలు అందించాలి-మంత్రి వెల్లంపల్లి
  • సిద్దిపేట: హుస్నాబాద్‌లో మోడల్‌ స్కూల్‌ను తనిఖీ చేసిన హరీష్‌రావు. చన్నీళ్లతో స్నానం చేస్తున్నామని మంత్రికి విన్నవించిన విద్యార్థులు. వాటర్‌ హీటర్‌ను వెంటనే రిపేర్‌ చేయించాలని ప్రిన్సిపాల్‌కు ఆదేశం. పిల్లలకు త్వరలో దుప్పట్లు పంపిణీ చేస్తానని హామీ.
  • తిరుపతి: కేరళ నుంచి సికింద్రాబాద్‌ వెళ్లే రైలులో నీటి కొరత. ఫిర్యాదు చేసినా పట్టించుకోని అధికారులు. నరక యాతన పడుతున్న అయ్యప్ప భక్తులు, ప్రయాణికులు. రైలును రేణిగుంట స్టేషన్‌లో ఆపేసిన ప్రయాణికులు.
  • మున్సిపల్‌ ఎన్నికలపై హైకోర్టులో కౌంటర్‌ దాఖలు చేసిన ప్రభుత్వం. పిటిషన్లన్నీ కొట్టివేయాలని సింగిల్‌ జడ్జిని కోరిన ప్రభుత్వం. పిటిషన్లపై ఇప్పటికే ధర్మాసనం విచారణ జరిపిందన్న ప్రభుత్వం. ప్రజా ప్రయోజన పిటిషన్లను ఇప్పటికే ధర్మాసనం కొట్టివేసిందన్న ప్రభుత్వం.
  • గుంటూరు: ఎస్పీ విజయరావుకు జనసేన ఫిర్యాదు. జనసేన కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతున్నారని ఫిర్యాదు. వాస్తవాలు పరిశీలించి న్యాయం చేయాలని విజ్ఞప్తి. ధర్మవరం ఘటనపై పూర్తి విచారణ చేపడతాం-ఎస్పీ విజయరావు. పోలీసులపై దాడి చేసిన వారిపైనే చర్యలు తీసుకుంటాం. అనవసర వివాదాలకు గ్రామస్తులు దూరంగా ఉండాలి-ఎస్పీ విజయరావు.
  • తూ.గో: అంతర్వేది బీచ్‌లో చోరీ. కారులో నుంచి బంగారు నగలు ఎత్తుకెళ్లిన దుండగులు. నగల విలువ రూ.3 లక్షలు ఉంటుందన్న బాధితులు. పీఎస్‌లో ఫిర్యాదు చేసిన బాధితుడు సూర్యనారాయణ.

ప్రగతిభవన్ లో కేకే… ఆర్టీసీ సమ్మె అంశం చర్చకు వచ్చిందా?

Why MP K Keshava Rao Spending much time in Pragathi Bhavan, ప్రగతిభవన్ లో కేకే… ఆర్టీసీ సమ్మె అంశం చర్చకు వచ్చిందా?

ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర మంత్రులు ఎవరూ మాట్లాడకుండా ఉండిపోవటం తెలిసిందే. అంతర్గత సంభాషణల్లో సమ్మెకు తమ మద్దతు ఉంటుందన్నా.. ఆ విషయాన్ని బయటకు వెల్లడించేందుకు ఏ మాత్రం ఇష్టపడటం లేదు. కాగా… అలాంటివేమీ బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇలాంటివేళ.. రాజ్యసభ సభ్యుడు.. టీఆర్ఎస్ జనరల్ సెక్రటరీగా వ్యవహరిస్తున్న కె. కేశవరావు మాత్రం భిన్నమైన స్వరాన్ని వినిపించారు.

ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలు ప్రభుత్వంతో చర్చలకు సిద్ధం కావాలన్నారు. దీంతో.. సమ్మె పరిష్కార దిశగా అడుగులు పడుతున్నట్లుగా భావించారు. ఉద్యోగ సంఘాల నేతలూ తాము చర్చలకు సిద్ధమన్నారు.అంతలోనే.. ప్రభుత్వం నుంచి తనకు ఎలాంటి ఆదేశాలు రాలేదంటూ కేకే మౌనం వహించారు. ముఖ్యమంత్రి అపాయింట్ మెంట్ కోసం తాను ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. కేకే వ్యాఖ్యలు సంచలనంగా మారటమే కాదు.. ఆయన మాటలపై పెద్ద ఎత్తున కథనాలు వచ్చాయి.

తిరుగుబాటుకు కేకే సిద్ధమయ్యారని కొందరు రాస్తే.. పార్టీ రాజ్యసభ సభ్యులంతా కలిసి బీజేపీలో విలీనం చేసే అవకాశం ఉందంటూ రకరకాలుగా రాశారు. దీంతో.. కేకే ఇరుకున పడే పరిస్థితి. మీడియా.. సోషల్ మీడియాలో వస్తున్న సమాచారంతో కేకే మీద ముఖ్యమంత్రి కేసీఆర్ గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది.

కేకే లాంటి నేత ముఖ్యమంత్రిని కలిసేందుకు అపాయింట్ మెంట్ కోరితే రాకపోవటమా? అన్న ప్రశ్నలు వెల్లువెత్తాయి. నచ్చిన వారికి నిమిషాల్లో అపాయింట్ మెంట్ ఇచ్చే కేసీఆర్.. నచ్చని వారి విషయంలో ఆయన కలిసేందుకు సైతం ఒప్పుకోకపోవటం తెలిసిందే. కేకే విషయంలోనూ అలానే జరిగిందన్న మాట వినిపించింది. ఇలాంటివేళ.. గురువారం ఆయనకు ప్రగతిభవన్ నుంచి పిలుపు వచ్చింది.

ప్రగతిభవన్ కు వెళ్లిన కేకే.. గంటల తరబడి అక్కడే ఉండిపోవటం ఆసక్తికరంగా మారింది. హుజూర్ నగర్ సభకు తనతో పాటు కేకేను కూడా తీసుకెళ్లాలని ముఖ్యమంత్రి భావించారని.. వర్షం కారణంగా సభ రద్దు కావటంతో ప్రగతిభవన్ లోనే ఉండిపోయారు. అయితే.. ప్రగతిభవన్ లో కేసీఆర్ కోసం వెయిట్ చేసేందుకే కేకే ఎక్కువ సమయాన్ని వెచ్చించాల్సి వచ్చిందన్న మాట వినిపిస్తోంది. తన ఇంటికి వచ్చిన వారు ఎవరైనా సరే.. భోజన వేళలో వారితో కలిసి  భోజనం చేసే అలవాటున్న ముఖ్యమంత్రి కేసీఆర్.. కేకేతో లంచ్ చేశారు. గంటల తరబడి ప్రగతిభవన్ లో ఉంచేయటం ద్వారా తనకున్న గుర్రు ఏ పాటితో చేతలో చూపించారన్న మాట బలంగా వినిపిస్తోంది. ఇద్దరు నేతల భేటీలో ఆర్టీసీ కార్మికుల సమ్మె అంశం చర్చకు రాలేదని తెలుస్తోంది.