Breaking News
  • భారత్-చైనా సరిహద్దుల్లోని డోక్లాంలో మళ్లీ అలజడి. 2 శక్తివంతమైన సర్వైలెన్స్ కెమేరాలను ఏర్పాటు చేసిన చైనా. వివాదాస్పద స్థలానికి దారితీసే రోడ్డు రిపేర్. 2017లో 73 రోజుల పాటు కొనసాగిన ఉద్రిక్తతలు. లద్దాఖ్ ఉద్రిక్తతల మళ్లీ కుట్రలు పన్నుతున్న చైనా.
  • రాజస్థాన్ సీఎం నివాసం సా. గం. 5.00కు సీఎల్పీ సమావేశం. రేపటి నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాలు. అసెంబ్లీ నేపథ్యంలో భేటీ అవుతున్న సీఎల్పీ. సచిన్ పైలట్ వర్గంతో సయోధ్య అనంతరం తొలిసారి భేటీ.
  • విజయవాడ: జూనియర్ డాక్టర్ల స్టైఫండ్ మొత్తాన్ని పెంచుతూ ap ప్రభిత్వం ఉత్తర్వులు. హౌస్ సర్జన్, పిజి డిగ్రీ, డిప్లొమా, డెంటల్, సూపర్ స్పెషలిటీ విద్యార్థులకు పెంపు. ఎంబీబీఎస్ విద్యార్థులకు 19,589. పిజి డిగ్రీ విద్యార్థులకు 1 ఇయర్ 44,075, 2 ఇయర్ 46,524, 3 ఇయర్ 48, 973 కు పెంపు.
  • అమరావతి : నేడు ఎమ్మెల్సీ స్థానానికి నామినేషన్ దాఖలు చేయనున్న పెన్మత్స సరేష్‌బాబు. మోపిదేవి వెంకటరమణ రాజీనామాతో ఉపఎన్నిక . దివంగత సీనియర్‌ నాయకులు, విజయనగరం జిల్లాకు చెందిన పెన్మత్స సాంబశివరాజు తనయుడు సురేష్‌బాబు.
  • సంగారెడ్డిలోని అమీన్పూర్ అనాధాశ్రమం లో దారుణం. పద్నాలుగేళ్ల మైనర్ అమ్మాయి పై ఆశ్రమ నిర్వాహకులు అత్యాచారం. అమ్మాయికి మత్తు మందు ఇచ్చి పలుమార్లు అత్యాచారం పాల్పడ్డ నిర్వాహకుడు. నిర్వాహకుడి గదిలోకి ప్రతిరోజు పంపించిన వార్డెన్. అత్యాచార విషయాన్ని బయటకు చెబితే చంపేస్తానని బెదిరింపు. తీవ్ర అనారోగ్యంతో బోయిన్పల్లిలోని బంధువుల ఇంటికి వచ్చిన బాలిక. బాలికను ఆసుపత్రికి వెళ్ళితే బయత్పడ్డ అత్యాచార విషయం. అమీన్పూర్ ఆశ్రమ నిర్వాహకులపై కేసు నమోదు చేసిన పోలీసులు . ఆస్పత్రిలో చికిత్స పొందిన మైనర్ బాలిక మృతి. మైనర్ బాలికపై అత్యాచారం పాల్పడ్డ నిర్వాహకులతో పాటు వార్డెన్ అరెస్ట్ చేసిన పోలీసులు.
  • రాజస్థాన్: కాంగ్రెస్ తిరుగుబాటు ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ ఎత్తివేత. ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర అభియోగాలపై సస్పెండైన భన్వర్ లాల్ శర్మ, విశ్వేంద్ర సింగ్. పైలట్ వర్గంతో సయోధ్య నేపథ్యంలో సస్పెన్షన్ ఎత్తివేత.
  • విశాఖ: వెదర్ అప్ డేట్స్... వాయవ్య బంగాళాఖాతంలో నేడు ఏర్పడనున్న అల్పపీడనం. ఇది రెండు మూడు రోజుల పాటు కొనసాగుతూ ఉత్తర బంగాళాఖాతం మీద కేంద్రీకృతం అవుతుందని వాతావరణ శాఖ అంచనా. ఉత్తరాంధ్ర తీరం నుంచి ఒడిసా, బెంగాల్ వరకూ ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. వీటన్నిటి ప్రభావంతో కోస్తాంధ్ర తెలంగాణల్లో కురవనున్న ఉరుములతో కూడిన వర్షాలు . ఉత్తరాంధ్రలో చాలా చోట్ల విస్తారంగా వర్షాలు....ఒకటి రెండు చోట్ల భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం. కోస్తాంధ్రలో గంటకు 45-55 కిలో మీటర్ల వేగంతో వీస్తోన్న బలమైన గాలులు . మత్స్యకారులు వేటకు వెళ్లరాదని హెచ్చరికలు జారీ.

హైదరాబాద్ దాటి.. నార్త్ లో ఒవైసీ వ్యూహం.. విస్తరిస్తున్న ఎంఐఎం

why mim chief owaisi focussing on hindi belt, హైదరాబాద్ దాటి.. నార్త్ లో ఒవైసీ వ్యూహం.. విస్తరిస్తున్న ఎంఐఎం

19 వ లోక్ సభలో కేవలం ఇద్దరు ఎంపీలతో ‘ అతిపెద్ద పార్టీ ‘ గా అవతరించిన ఎంఐఎం (మజ్లిస్ పార్టీ) మెల్లగా హిందీ బెల్ట్ లో విస్తరిస్తోంది. ఈ పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ హైదారాబాద్ ‘ పాతబస్తీ ‘ నుంచి తన పార్టీని క్రమంగా దేశవ్యాప్తం చేసేందుకు వ్యూహాలు పన్నుతున్నారు. తమ పార్టీకి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు తక్కువమంది ఉన్నా సరే.. దేశ రాజకీయాల్లో పరోక్షంగా చక్రం తిప్పుతున్నారు. ప్రధాన పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ వంటివాటికి ‘ నిద్ర పట్టకుండా ‘ చేస్తున్నారు. ఇటీవలి మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఐఎం తన ఉనికి చాటుకుంది. ఆ రాష్ట్రంలోని పలు ప్రాంతాలు సాంస్కృతికంగా హైదరాబాద్ తో లింకు కలిగి ఉండడం ఒవైసీకి కలిసొచ్చింది. మహారాష్ట్రలోని మాలెగావ్ సెంట్రల్, ధూలే సిటీ స్థానాలు ఈ పార్టీ వశమయ్యాయి. రెండు సీట్లలో ఎంఐఎం గెలిచినప్పటికీ.. కనీసం 9 స్థానాల్లో కాంగ్రెస్-ఎన్సీపీ అభ్యర్థులను ఓడించగలిగింది. ఛండీవలి నియోజకవర్గంలో మాజీ మంత్రి, నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆరిఫ్ నసీం ఖాన్ ని ఎంఐఎం అభ్యర్థి మహమ్మద్ ఇమ్రాన్ కేవలం 409 ఓట్ల తేడాతో ఓడించారు. భివాండీ వెస్ట్ స్థానంలో పోటీ చేసిన ముగ్గురు అభ్యర్థుల్లో.. ముస్లిం ఓట్లు చీలిన కారణంగా బీజేపీ అభ్యర్థి ప్రభాకర్ చౌగ్లే గెలుపొందారు. అలాగే ఔరంగాబాద్ సెంట్రల్ లో శివసేన క్యాండిడేట్ ప్రదీప్ జైస్వాల్ విజయం సాధించారు. ఎంఐఎం అభ్యర్థి నసీరుద్దీన్ సిద్దిఖీ.. ఎన్సీపీ క్యాండిడేట్ అబ్దుల్ ఖాదర్ కి పడాల్సిన మైనారిటీ ఓట్లను చీల్చగలిగారు. అంటే.. అటు కాంగ్రెస్, ఎన్సీపీలకు పడాల్సిన ఓట్లు చీలి.. ఒకవిధంగా బీజేపీ లాభపడింది. (మహారాష్ట్రలో బీజేపీ-శివసేన పొత్తు పెట్టుకున్న సంగతి తెలిసిందే).

ఇక బీహార్ విషయానికి వస్తే.. ఆ రాష్ట్రంలోని కిషన్ గంజ్ నియోజకవర్గానికి జరిగిన ఉపఎన్నికలో ఎంఐఎం అభ్యర్థి కమ్రుల్ హుదా గెలుపొందారు. హైదరాబాద్ కు సుమారు 2 వేల కిలోమీటర్ల దూరంలో గల కిషన్ గంజ్ లోని ముస్లిముల ఓట్లను ఒవైసీ తనకు అనుకూలంగా మలచుకోగలిగారు. ఇక్కడి మైనారిటీలకు తాము అండగా ఉంటామన్న ఆయన హామీ ఎంఐఎం ని విజయం వరించేలా చేసింది. దేశంలోని ప్రతి రాష్ట్ర అసెంబ్లీలో తమ పార్టీ ఎమ్మెల్యే ఒక్కరైనా ఉండాలన్నదే ఒవైసీ ఆశయమట. మహారాష్ట్రలోని నాందేడ్ వంటి ప్రాంతాల్లో ఆయన చేసిన ప్రసంగాలు ముస్లిములను బాగా ఆకట్టుకున్నాయి. ఈ దేశానికి బీజేపీ ఏం చేసిందని ప్రశ్నిస్తూనే ఆయన.. సంఘ పరివార్, వీ హెచ్ పీ వంటి హిందూ సంస్థల విధానాలను విమర్శించారు. ఇక తెలంగాణాలో అధికార టీఆర్ఎస్, మజ్లిస్ పార్టీల దోస్తీ కొత్తేమీ కాదు.

Related Tags