అయోమయంలో నాగబాబు..బయటపడే దారేది..?

మెగా బ్రదర్ నాగబాబు పరిస్థితి ఇప్పుడు అగమ్యగోచరంగా తయారయ్యింది. ముగ్గురు బ్రదర్స్‌లో మధ్యవాడైన ఇతడి పరిస్థితి ముందు నుయ్యి..వెనక గొయ్యి అన్న చందంగా మారింది. గత ఎన్నికల్లో జనసేన నుంచి నర్సాపురం పార్లమెంట్‌కి పోటీ చేసి ఓడిపోయారు నాగబాబు. ఆ తర్వాత కొన్నాళ్లు జబర్ధస్త్ షో చేసుకుంటూ సైలెంట్‌గా ఉన్న ఆయన అడపా దడపా జనసేన పార్టీ కార్యక్రమాల్లో పాలుపంచుకున్నారు. అయితే నాగబాబుకు ఇప్పుడు ఊహించని చిక్కొచ్చిపడింది. ఒకవైపు తమ్మడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్..వైసీపీపై, జగన్ […]

అయోమయంలో నాగబాబు..బయటపడే దారేది..?
Follow us

|

Updated on: Dec 22, 2019 | 7:31 PM

మెగా బ్రదర్ నాగబాబు పరిస్థితి ఇప్పుడు అగమ్యగోచరంగా తయారయ్యింది. ముగ్గురు బ్రదర్స్‌లో మధ్యవాడైన ఇతడి పరిస్థితి ముందు నుయ్యి..వెనక గొయ్యి అన్న చందంగా మారింది. గత ఎన్నికల్లో జనసేన నుంచి నర్సాపురం పార్లమెంట్‌కి పోటీ చేసి ఓడిపోయారు నాగబాబు. ఆ తర్వాత కొన్నాళ్లు జబర్ధస్త్ షో చేసుకుంటూ సైలెంట్‌గా ఉన్న ఆయన అడపా దడపా జనసేన పార్టీ కార్యక్రమాల్లో పాలుపంచుకున్నారు.

అయితే నాగబాబుకు ఇప్పుడు ఊహించని చిక్కొచ్చిపడింది. ఒకవైపు తమ్మడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్..వైసీపీపై, జగన్ ప్రభుత్వంపై దుమ్మెత్తి పోస్తుంటే, మరోవైపు అన్న చిరంజీవి జగన్ నిర్ణయాలను సమర్థిస్తూ వస్తున్నారు. అంతేనా ఇటీవల సైరా చిత్రం విడుదల సందర్భంగా సినిమా చూడాల్సిందిగా జగన్ ఇంటికి వెళ్లి మరీ కోరారు చిరంజీవి. ఏది ఏమైనా గత కొంతకాలంగా చిరంజీవిలో ప్రో వైసీపీ భావజాలం కనిపిస్తోంది.

నాగబాబుకి..ఇద్దరు బ్రదర్స్ అంటే అమితమైన అభిమానం. అందుకే ఆయన ఇప్పుడు ఎవరికి సపోర్ట్ చెయ్యాలా అన్న మీమాంసలో పడిపోయారు. జగన్ తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయం భేష్ అంటూ ప్రకటన విడుదల చేశారు మెగాస్టార్. ఇది ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారిపోయింది. అందుకే ఎవ్వరిని నొప్పించకుండా ఇండస్ట్రీ సిద్దాంతాన్ని ఫాలో అవుతున్నారు నాగబాబు. గత ప్రభుత్వ హాయంలో స్కాం జరిగినా, కొద్దిమంది కోసం రైతులను ఇబ్బంది పెట్టడం సరికాదంటూ కొత్త పాట అందుకున్నారు. మరోవైపు అభివ‌ృద్ది రాష్ట్రవ్యాప్తంగా జరిగితే స్వాగతిస్తామంటున్నారు. ఏది ఏమైనా నాగాబాబు ఇప్పడు కన్‌ఫ్యూజన్ జోన్‌లో ఉన్నారంటున్నారు రాజకీయ నిపుణులు.

ఎన్‌పీఎస్‌ లేదా మ్యూచువల్ ఫండ్ రిటైర్‌మెంట్‌కు ఏది బెటర్?
ఎన్‌పీఎస్‌ లేదా మ్యూచువల్ ఫండ్ రిటైర్‌మెంట్‌కు ఏది బెటర్?
అనపర్తి టీడీపీలో అసంతృప్తి జ్వాలలు.. నల్లమిల్లి న్యాయ పోరాటం
అనపర్తి టీడీపీలో అసంతృప్తి జ్వాలలు.. నల్లమిల్లి న్యాయ పోరాటం
గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..?
గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..?
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..