మహాబలిపురానికే చైనా నేత రాక.. ఎందుకు ?

ప్రధాని మోదీతో సమావేశమయ్యేందుకు చైనా అధ్యక్షుడు జీ జిన్ పింగ్ ఈ నెల 11 న తమిళనాడులోని మహాబలిపురానికి వస్తున్నారు. అక్కడ రెండు రోజులపాటు వీరి ఫార్మల్ సమ్మిట్ జరగనుంది. అయితే వీరి భేటీకి అసలు తమిళ వారసత్వానికి ప్రతిరూపమైన మహాబలిపురాన్నే ఎంచుకోవడానికి కారణం ? మన దేశంలోని వివిధ టూరిస్టు డెస్టినేషన్లు ఇతర దేశాల ప్రజలను ఎంతగానో ఆకర్షిస్తాయని, ఇలాంటి చోట్ల టాప్ గ్లోబల్ లీడర్లతో ముఖ్యమైన సమావేశాలు నిర్వహించడం వల్ల ఎంతో ప్రయోజనం ఉంటుందని […]

మహాబలిపురానికే చైనా నేత రాక.. ఎందుకు ?
Follow us

| Edited By: Srinu

Updated on: Oct 10, 2019 | 4:10 PM

ప్రధాని మోదీతో సమావేశమయ్యేందుకు చైనా అధ్యక్షుడు జీ జిన్ పింగ్ ఈ నెల 11 న తమిళనాడులోని మహాబలిపురానికి వస్తున్నారు. అక్కడ రెండు రోజులపాటు వీరి ఫార్మల్ సమ్మిట్ జరగనుంది. అయితే వీరి భేటీకి అసలు తమిళ వారసత్వానికి ప్రతిరూపమైన మహాబలిపురాన్నే ఎంచుకోవడానికి కారణం ? మన దేశంలోని వివిధ టూరిస్టు డెస్టినేషన్లు ఇతర దేశాల ప్రజలను ఎంతగానో ఆకర్షిస్తాయని, ఇలాంటి చోట్ల టాప్ గ్లోబల్ లీడర్లతో ముఖ్యమైన సమావేశాలు నిర్వహించడం వల్ల ఎంతో ప్రయోజనం ఉంటుందని మోదీ భావిస్తున్నారు. ఇతర దేశాలకు చెందిన అధ్యక్షులు, ప్రధానుల రాకతో ఈ పర్యాటక ప్రదేశాలు ఎంతో పాపులర్ అవుతాయన్నది ఆయన నమ్మకం. పైగా ఆయా దేశాల ప్రజల మధ్య స్నేహ, సౌభ్రాత్రాలకు కూడా ఈ విధమైన టూరిస్టు ప్రాంతాలు ఉపకరిస్తాయని ఆయన తరచూ అంటుంటారు. బహుశా ఈ కారణంగానే మోదీ.. 2017 ఏప్రిల్ లో.. కోల్ కతా లో బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా వాజెద్ తో సమావేశమయ్యారు. అదే ఏడాది గుజరాత్ లోని శబర్మతీ నదీ తీరంలో భారత-చైనా సమ్మిట్ జరిగింది. దేశంలో అత్యద్భుత శిల్ప కళకు, ఆలయాలకు మారుపేరైన మహాబలిపురంలో మోదీ-జీ జిన్ పింగ్ భేటీ వ్యూహం వెనుక ఓ బ్యాక్ డ్రాప్ కూడా ఉంది. క్రీ.శ. ఏడో శతాబ్దంలో పల్లవ వంశస్థుల రాచరిక పాలనలో మొదటి నరసింహవర్మన్ ఈ నగరాన్ని నిర్మించాడు. చెన్నైకి సుమారు యాభై కి.మీ. దూరంలోని ఈ సిటీ.. ఇతర దేశాలతో వ్యాపార లావాదేవీలకు అనువుగా ఉండేది. అందువల్లే ఆ పల్లవ రాజు ఇక్కడ రేవును కూడా నిర్మించాడు. నాడు పల్లవులు తమ రాయబారులను ముఖ్యంగా చైనాకు పంపేవారు. ఆ సమయంలో భారత-చైనా దేశాల మధ్య మంచి సాన్నిహిత్యం ఉంటూ వచ్చింది. అరబ్బులు, టిబెటన్ల విషయంలో చైనా పాలకులకు రెండో నరసింహవర్మన్ కూడా తోడ్పాటు నందిస్తూ వచ్చాడు. పైగా ఒకనాడు చైనా ట్రావెలర్ హ్యూన్ త్సాంగ్ ఈ ప్రాంతంలో పర్యటించాడు. అంటే దాదాపు రెండు వేల ఏళ్ళ నాటి నుంచే చైనా-భారత్ మధ్య లింకులున్నట్టు పురావస్తు ఆధారాలు కూడా లభించాయని చరిత్రకారులు అంటున్నారు. క్రీ.పూ. మొదటి, రెండో శతాబ్దంలో తమిళనాడు తీర ప్రాంతాల్లో సముద్ర జలాల ద్వారా చైనా-భారత దేశాల మధ్య వాణిజ్య లావాదేవీలు సాగేవట. అక్కడ నాడు లభించిన కుండలు, ఇతర మట్టి పాత్రలు ఈ విషయాన్నినిరూపించాయి. తమిళనాట నాడు చైనా నాణేలు దొరికాయని చెబుతున్నారు. ఇన్ని కారణాల వల్లే చైనా అధినేత జీ జిన్ పింగ్ కూడా ‘ సై ‘ అంటూ మహాబలిపురం విజిట్ కు ఓకె చెప్పినట్టు తెలుస్తోంది.

బూమ్ బూమ్ బుమ్రా.. ముంబై విజయం.. ప్లే ఆఫ్ అవకాశాలు సజీవం
బూమ్ బూమ్ బుమ్రా.. ముంబై విజయం.. ప్లే ఆఫ్ అవకాశాలు సజీవం
కోల్‌కతా మ్యాచ్‌కి గ్రీన్ జెర్సీతో బరిలోకి ఆర్సీబీ.. కారణమిదే
కోల్‌కతా మ్యాచ్‌కి గ్రీన్ జెర్సీతో బరిలోకి ఆర్సీబీ.. కారణమిదే
దివంగత కమెడియన్ వివేక్‌కు గుర్తుగా.. గొప్ప పని చేసిన హీరో వైభవ్
దివంగత కమెడియన్ వివేక్‌కు గుర్తుగా.. గొప్ప పని చేసిన హీరో వైభవ్
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
తొలిసారి మొబైల్ నెట్‌వర్క్‌.. గ్రామ ప్రజలతో పీఎం మోదీ మాటమంతీ
తొలిసారి మొబైల్ నెట్‌వర్క్‌.. గ్రామ ప్రజలతో పీఎం మోదీ మాటమంతీ
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
ఈ మొక్క ఆకులు రోజుకు రెండు నమిలితే చాలు.. షుగర్ ఖతం
ఈ మొక్క ఆకులు రోజుకు రెండు నమిలితే చాలు.. షుగర్ ఖతం
వాయిదా పడ్డ నవదీప్‌ సినిమా | సరికొత్త పాత్రలో కనిపించనున్న తమన్నా
వాయిదా పడ్డ నవదీప్‌ సినిమా | సరికొత్త పాత్రలో కనిపించనున్న తమన్నా
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా
ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!
ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!