Breaking News
  • హైదరాబాద్: జర్నలిస్టులందరికీ హెల్త్‌ కార్డులు అందించాలి, అన్ని ఆస్పత్రుల్లో సేవలు అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి, ఈనెల 20 నుంచి 25 వరకు రాష్ట్ర వ్యాప్తంగా మంత్రులు, ఎమ్మెల్యేలకు టీయూడబ్ల్యూజే వినతి పత్రాలు-టీయూడబ్ల్యూజే ప్రధాన కార్యదర్శి విరాహత్‌ అలీ.
  • ఆసియాలోనే లైఫ్‌ సైన్సెస్‌కు ప్రధాన కేంద్రంగా హైదరాబాద్‌ మారింది. ప్రపంచ వ్యాక్సిన్‌ ఉత్పత్తిలో మూడో వంతు హైదరాబాద్‌ సరఫరా చేస్తోంది. జాతీయ ఫార్మా ఉత్పత్తిలో హైదరాబాద్‌ వాటా 35శాతం-మంత్రి కేటీఆర్‌.
  • యాదాద్రి: గుండాల మండలం సుద్దాల దగ్గర ప్రమాదం, కారు, బైక్‌ ఢీకొని ఇద్దరు మృతి, ఒకరికి తీవ్రగాయాలు.
  • విజయవాడ: ఎమ్మార్వో వనజాక్షిపై టూటౌన్ పీఎస్‌లో ఫిర్యాదు, తమను కులం పేరుతో దూషించిందని ఫిర్యాదు చేసిన మహిళా రైతులు.
  • మహబూబాబాద్: పోడు భూముల ఆక్రమణదారులకు కలెక్టర్‌ హెచ్చరిక. 10 ఎకరాలకు మించి పోడు భూములు ఆక్రమించిన 119 మంది. ఆక్రమణదారుల్లో ప్రభుత్వ ఉద్యోగులు, నేతలు, కుల సంఘాల నేతలు. భూములు వెంటనే తిరిగి అప్పగించాలని కలెక్టర్ ఆదేశం. లేదంటే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరిక.
  • ప్రాణం తీసిన సెల్ఫీ. కృష్ణాజిల్లా: నూజివీడులో విషాదం. సూరంపల్లి కాలువ దగ్గర సెల్ఫీ దిగేందుకు యువకుడు యత్నం. ప్రమాదవశాత్తు కాలువలో పడి యువకుడు మృతి. బీటెక్‌ ఫైనల్‌ ఇయర్‌ చదువుతున్న పవన్‌.

కోడెల కుమారుడికి… కోటి రూపాయల పెనాల్టీ?

Why Kodela SivaRam Paid Rs. 1 Crore as Penalty, కోడెల కుమారుడికి… కోటి రూపాయల పెనాల్టీ?

కోడెల ఆత్మహత్యకు ఆయన సంతానమే కారణమని కొంతమంది తెలుగుదేశం నేతలు వ్యాఖ్యానించి ఆ కుటుంబాన్ని ఇరకాటంలో పెట్టేశారు. ఎందుకంటే అధికారంలో ఉన్నప్పుడు అడ్డగోలుగా వ్యవహరించి తండ్రి రాజకీయ ఇమేజ్ ను చాలా వరకూ డ్యామేజ్ చేశారనే పేరు తెచ్చుకున్నారు కోడెల శివరాం.  అయితే కోడెల ఆత్మహత్యను ప్రభుత్వంపై అస్త్రంగా వాడదామని చంద్రబాబు నాయుడు ప్రయత్నించి విఫలం అయ్యారు. కోడెల అప్పటికే ఒకసారి ఆత్మహత్యాయత్నం చేసినా చంద్రబాబు నాయుడు కనీసం పరామర్శించలేదు. ఈ నేపథ్యంలో ఆయన మృతి అనంతరం చంద్రబాబు నాయుడు రాజకీయం చేయాలని చూడటం వివాదంగా నిలిచింది. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు కూడా ఆ వ్యవహారాన్ని వదిలేశారు.

అయితే కోడెల శివరాం చేసిన అక్రమాలపై విచారణ మాత్రం సాగుతూ ఉంది. అందులో భాగంగా ఆయన బైకుల రిజిస్ట్రేషన్ వివాదం ఒకదాంట్లో చిక్కుకున్న సంగతి తెలిసిందే. ఆ వివాదం పై అధికారులు విచారణ జరిపించారు. రిజిస్ట్రేషన్ ఫీజులు చెల్లించకుండా బైకులను అమ్మి.. కోడెల శివరాం ప్రభుత్వానికి కొన్ని లక్షల రూపాయల నష్టాన్ని చేకూర్చినట్టుగా అధికారులు గుర్తించారు. సాక్షాలతో సహా ఆ విషయంలో పట్టుబడ్డారు. దీనిపై ఇటీవలే విచారణ జరిపి కోటి రూపాయల మేరకు ఫైన్ విధించారు. తాజాగా ఆ ఫైన్ ను కోడెల శివరాం కట్టినట్టుగా తెలుస్తోంది. బైకుల రిజిస్ట్రేషన్ స్కామ్ కు సంబంధించి ఆయన ఈ ఫైన్ చెల్లించాడని సోషల్ మీడియాలో నెటిజన్లు చర్చించుకుంటున్నారు.