హరీష్ రావుకు ఆర్థిక శాఖ.. కేసీఆర్ ఆలోచన ఇదేనా..!

కేబినెట్ విస్తరణలో భాగంగా కుమారుడు కేటీఆర్, మేనల్లుడు హరీష్ రావును తన మంత్రివర్గంలోకి తీసుకున్నారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. మొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పుడూ ఈ ఇద్దరికి మంత్రి పదవులకు ఇచ్చిన ఆయన.. రెండో సారి అధికారంలోకి వచ్చాక మాత్రం కాస్త లేటుగా తన కేబినెట్‌లోకి తీసుకున్నారు. ఇక ఇందులో కేటీఆర్‌కు గతంలో కేటాయించిన పంచాయితీ రాజ్, మున్సిపల్, ఐటీ, పరిశ్రమల శాఖలనే ఈసారి కూడా ఇచ్చారు కేసీఆర్. అయితే హరీష్ రావుకు మాత్రం ఆర్థిక శాఖను ఇచ్చారు. […]

హరీష్ రావుకు ఆర్థిక శాఖ.. కేసీఆర్ ఆలోచన ఇదేనా..!
Follow us

| Edited By:

Updated on: Sep 09, 2019 | 8:32 PM

కేబినెట్ విస్తరణలో భాగంగా కుమారుడు కేటీఆర్, మేనల్లుడు హరీష్ రావును తన మంత్రివర్గంలోకి తీసుకున్నారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. మొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పుడూ ఈ ఇద్దరికి మంత్రి పదవులకు ఇచ్చిన ఆయన.. రెండో సారి అధికారంలోకి వచ్చాక మాత్రం కాస్త లేటుగా తన కేబినెట్‌లోకి తీసుకున్నారు. ఇక ఇందులో కేటీఆర్‌కు గతంలో కేటాయించిన పంచాయితీ రాజ్, మున్సిపల్, ఐటీ, పరిశ్రమల శాఖలనే ఈసారి కూడా ఇచ్చారు కేసీఆర్. అయితే హరీష్ రావుకు మాత్రం ఆర్థిక శాఖను ఇచ్చారు. ఈయన గతంలో వైఎస్ హయాంలో యువజన సర్వీసుల మంత్రిగా, 2014లో కేసీఆర్ హయాంలో నీటి పారుదల మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. దీంతో అన్ని వర్గాల నుంచి భిన్నాభిప్రాయాలు వెల్లువెత్తుతున్నాయి.

కాగా పార్టీని పక్కనబెడితే హరీష్ రావుకు ప్రజాభిమానం చాలా ఎక్కువ. అందరిలో గ్రేట్ లీడర్‌గా ఆయనకు పేరొంది. ఏదైనా మాటలతోనే కాదు.. చేతులతోనే చూపిస్తాడని చాలామంది తెలంగాణ ప్రజలు నమ్ముతున్నారు. ఇప్పటికీ తెలంగాణలో చాలా ప్రాజెక్ట్‌లు పూర్తి అవ్వడానికి హరీష్ రావునే కారణమని.. ప్రాజెక్ట్‌ల నిర్మాణంలో ఆయన కీలక పాత్ర పోషించారని అందరికీ తెలుసు. అలాంటి ఆయనను రెండోసారి అధికారంలోకి వచ్చాక కేసీఆర్ ప్రభుత్వం పట్టించుకోలేదని రాజకీయవర్గాల్లో చర్చసాగింది. హరీష్ రావుకు పేరు రాకుండా ఉండేందుకు.. కేసీఆర్ ఆలోచిస్తున్నారని.. అందుకే తగిన ప్రాధాన్యత ఇవ్వలేదని కొంతమంది బాహటంగానే తమ అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. దానికి తోడు కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రారంభోత్సవం రోజు హరీష్ రావు అక్కడ లేకపోవడంపై ఎన్నో విమర్శలు కూడా వెల్లువెత్తాయి. హరీష్ రావు, కేసీఆర్ కుటుంబం మధ్య సరైన సఖ్యత కూడా లేదని వార్తలు వినిపించాయి. అయితే వీటన్నింటిని ఖండిస్తూ కేటీఆర్, హరీష్ రావు ఎన్నోసార్లు కలిసి పలు కార్యక్రమాల్లో పాలుపంచుకున్నారు. కానీ ఆ వార్తలు ఆగలేదు.

అయితే వాటన్నింటిని మరోసారి పటాపంచలు చేస్తూ.. ఆయనకు ఇటీవల జరిగిన కేబినెట్ విస్తరణలో ఆర్థిక శాఖను కేటాయించారు కేసీఆర్. అంతేకాదు హరీష్‌తోనే మొదటిసారి ప్రమాణస్వీకారం చేయించిన కేసీఆర్.. ప్రమాణ స్వీకార కార్యక్రమంలో కూడా ఎంతో ప్రాముఖ్యతను ఇచ్చారు. కాగా హరీష్ రావుకు ఆర్థిక శాఖ అప్పగించడంపై ఆయన కొందరు అభిమానులు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఈ శాఖతో ఆయనకు పెద్దగా రాదని.. దీని వల్ల ప్రజల్లో పెద్దగా తిరిగే అవకాశం ఉండదని, ఫైళ్లపై సంతకాలు పెట్టే వరకు మాత్రమే ఆయన పరిమితం అవుతారని హరీష్ అభిమానులు కాస్త అసంతృప్తితో ఉన్నారు. దీనికి తోడు ఇవాళ కేసీఆర్ ఇచ్చిన బడ్జెట్ ప్రసంగంలో తెలంగాణ ఖజానా ఖాళీగా ఉన్నట్లు కూడా తేలింది. ఈ నేపథ్యంలో ఆయనకు కావాలనే ఆర్థిక శాఖ ఇచ్చారన్నది కొందరి వాదన.

అయితే ఏ మంత్రిత్వశాఖను ఇచ్చినా.. దాన్ని సమర్థవంతంగా నడపగల సామర్థ్యం హరీష్ రావుకు ఉంది. ఈ విషయం కేసీఆర్‌కు బాగా తెలుసు. దేశంలో ఉన్న ఆర్థిక మాంద్య పరిస్థితుల ప్రభావం రాష్ట్రం మీద పడింది. ఇలాంటి నేపథ్యంలో ఆర్థిక శాఖను హరీష్‌కు అప్పగిస్తేనే మేలని.. ఆయన మాత్రమే ఆ శాఖకు న్యాయం చేయగలరని భావించిన కేసీఆర్.. ఈ మేరకు హరీష్ రావుకు కీలక శాఖ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఏదేమైనా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆర్థిక మంత్రిగా హరీష్ రావు రాష్ట్రాన్ని ఎలా గట్టెంక్కించగలరో చూడాలి.

పుచ్చకాయ vs కర్జూజా.. వేసవిలో ఆరోగ్యానికి ఏది ఎక్కువ మేలు
పుచ్చకాయ vs కర్జూజా.. వేసవిలో ఆరోగ్యానికి ఏది ఎక్కువ మేలు
రామాయణంలో చిన్నప్పటి సీత పాత్రలో నటిస్తున్న చిన్నారి ఎవరో తెలుసా
రామాయణంలో చిన్నప్పటి సీత పాత్రలో నటిస్తున్న చిన్నారి ఎవరో తెలుసా
క్వీన్ ఆఫ్ మాస్ గా టాలీవుడ్ చందమామ. దిమ్మతిరిగెలా చేస్తున్న కాజల్
క్వీన్ ఆఫ్ మాస్ గా టాలీవుడ్ చందమామ. దిమ్మతిరిగెలా చేస్తున్న కాజల్
తక్కువ ధరకే సీజ్ చేసిన బంగారం.. తీరా చూస్తే షాక్..!
తక్కువ ధరకే సీజ్ చేసిన బంగారం.. తీరా చూస్తే షాక్..!
శూర్ఫణఖతో కళ్యాణం చేయలేను .. అనామికకు ఇచ్చిపడేసిన ఇందిరా దేవి..
శూర్ఫణఖతో కళ్యాణం చేయలేను .. అనామికకు ఇచ్చిపడేసిన ఇందిరా దేవి..
'జుచిని'తో ఇన్ని ప్రయోజనాలా? అవేంటో తెలిస్తే మైండ్‌ బ్లాంకే
'జుచిని'తో ఇన్ని ప్రయోజనాలా? అవేంటో తెలిస్తే మైండ్‌ బ్లాంకే
గాల్లో ఢీకొన్న రెండు హెలికాప్టర్లు.! వీడియో వైరల్.
గాల్లో ఢీకొన్న రెండు హెలికాప్టర్లు.! వీడియో వైరల్.
తెలంగాణ ఇంటర్‌ ఫలితాలు వచ్చేస్తున్నాయ్.. డైరెక్ట్ లింక్ ఇదే
తెలంగాణ ఇంటర్‌ ఫలితాలు వచ్చేస్తున్నాయ్.. డైరెక్ట్ లింక్ ఇదే
'పది' తర్వాత బంగారు భవిష్యత్తుకు బాటలు వేసే కోర్సులు..
'పది' తర్వాత బంగారు భవిష్యత్తుకు బాటలు వేసే కోర్సులు..
వామ్మో.. సచిన్ ఇలాంటోడా.. నిద్రలేని రాత్రులు గడిపిన గంగూలీ..
వామ్మో.. సచిన్ ఇలాంటోడా.. నిద్రలేని రాత్రులు గడిపిన గంగూలీ..