ల్యాండర్ కాంటాక్ట్‌లో లోపం… చంద్రయాన్ 1 డైరెక్టర్ విశ్లేషణ!

ఇది ఇస్రో శాస్త్రవేత్తలు ఊపిరి పీల్చుకోతగ్గ వార్త. చందమామకు 2.1 కిలోమీటర్ల ఎత్తు నుంచీ చంద్రుడి ఉపరితలంపై పడిన విక్రమ్ ల్యాండర్… ముక్కలైపోలేదనీ, అది ఒకే సింగిల్ పీస్‌గా ఉందని ఇస్రో ప్రకటించింది. నిజానికి అంత ఎత్తు నుంచీ అంత పెద్ద ల్యాండర్ (ల్యాండర్ బరువు ప్రజ్ఞాన్ రోవర్‌తో కలిపి 1,471 కేజీలు. అందులోని ప్రజ్ఞాన్ రోవర్ బరువు 27కేజీలు) పడితే… పగిలిపోయే అవకాశాలు ఎక్కువ. కానీ… చందమామపై ఆకర్షణ శక్తి తక్కువగా ఉంటుంది కాబట్టి… అది […]

ల్యాండర్ కాంటాక్ట్‌లో లోపం... చంద్రయాన్ 1 డైరెక్టర్ విశ్లేషణ!
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Sep 09, 2019 | 4:37 PM

ఇది ఇస్రో శాస్త్రవేత్తలు ఊపిరి పీల్చుకోతగ్గ వార్త. చందమామకు 2.1 కిలోమీటర్ల ఎత్తు నుంచీ చంద్రుడి ఉపరితలంపై పడిన విక్రమ్ ల్యాండర్… ముక్కలైపోలేదనీ, అది ఒకే సింగిల్ పీస్‌గా ఉందని ఇస్రో ప్రకటించింది. నిజానికి అంత ఎత్తు నుంచీ అంత పెద్ద ల్యాండర్ (ల్యాండర్ బరువు ప్రజ్ఞాన్ రోవర్‌తో కలిపి 1,471 కేజీలు. అందులోని ప్రజ్ఞాన్ రోవర్ బరువు 27కేజీలు) పడితే… పగిలిపోయే అవకాశాలు ఎక్కువ. కానీ… చందమామపై ఆకర్షణ శక్తి తక్కువగా ఉంటుంది కాబట్టి… అది పగిలిపోకుండా… ఉన్నది ఉన్నట్లుగా ఉందని తెలుస్తోంది. ఇస్రో మరో శుభవార్త కూడా చెప్పింది. అంత ఎత్తు నుంచీ పడే ల్యాండర్… అటో ఇటో ఎటోకటు దొర్లుతూ వెళ్లిపోయే పరిస్థితి ఉంటుంది. కానీ… విక్రమ్ ల్యాండర్ బుద్ధిగా ఎక్కడైతే పడింతో… అక్కడే అలాగే ఉందని వివరించారు.

ఇస్రోకి చెందిన ఓ అధికారి. పాటిజివ్ అంశాలు ఉండటం వల్ల ల్యాండర్‌ నుంచీ సిగ్నల్స్ రప్పించేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఆయన వివరించారు. ఒక్కసారి ఆ సిగ్నల్స్ అందితే ఇక దాన్ని కావాల్సిన విధంగా సెట్ చేసుకోవడానికి వీలవుతుంది. దాన్లోంచీ రోవర్‌ను బయటకు తెప్పించేందుకు కూడా వీలవుతుంది. అందువల్ల ఏం చేసైనా… ల్యాండర్‌ నుంచీ సిగ్నల్స్ వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు ఇస్రో శాస్త్రవేత్తలు. ఇస్రో గ్రౌండ్ స్టేషన్ నుంచి నిరంతరాయంగా శాస్త్రవేత్తలు కొన్ని వందల సంఖ్యలో సంకేతాలను ల్యాండర్ కు పంపించారు. ఆ సంకేతాలకు ల్యాండర్ నుంచి ఎలాంటి ప్రతిస్పందన రావట్లేదని తెలుస్తోంది. నిరాశ చెందని శాస్త్రవేత్తలు నిరంతరాయంగా వివిధ సాంకేతిక రూపాల్లో సంకేతాలను పంపిస్తూనే ఉన్నారు. వచ్చే రెండు వారాల్లోగా తాము విక్రమ్ ల్యాండర్ తో అనుసంధానమౌతామని ఇస్రో ఛైర్మన్ శివన్ ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.

కాగా… ఇస్రో గ్రౌండ్ స్టేషన్ నుంచి పంపిస్తోన్న సంకేతాలకు విక్రమ్ ల్యాండర్ స్పందించకపోవడానికి చంద్రుడిపై ఉన్న వాతావరణ పరిస్థితులే కారణమై ఉంటాయని ఇస్రో శాస్త్రవేత్త మైలాస్వామి అన్నాదురై అభిప్రాయపడ్డారు. చంద్రుడి ఉపరితలం మీద ల్యాండర్ హార్డ్ ల్యాండింగ్ కూడా ఇందుకు ఓ కారణం అయ్యుంటుందని ఆయన అంచనా వేశారు. మైలాస్వామి అన్నాదురై.. చంద్రయాన్-1 ప్రాజెక్టుకు డైరెక్టర్ గా పనిచేశారు. ల్యాండర్ చంద్రుడి ఉపరితలం మీద దిగే సమయంలో సంభవించిన పరిణామాల వల్లే దానితో సంబంధాలు తెగిపోయి ఉంటాయని అన్నారు. ల్యాండర్ ప్రస్తుతం చంద్రుడి ఉపరితలం మీదే దిగిందనడానికి సహేతుకమైన, శాస్త్రీయబద్ధమైన రుజువు ఇదేనని చెప్పారు. చంద్రుడి మీద దిగిన తరువాత తలెత్తిన కొన్ని అడ్డంకుల వల్ల ఇస్రో శాస్త్రవేత్తలు పంపించే సంకేతాలను ల్యాండర్ లోని సిగ్నల్ రిసీవర్లు అందుకోవట్లేదని చెప్పారు.

చంద్రయాన్-1 మిషన్ లో కూడా దాదాపు ఇలాంటి పరిస్థితులే తలెత్తిన విషయాన్ని మైలాస్వామి అన్నాదురై ఈ సందర్భంగా గుర్తు చేశారు. చంద్రయాన్-1కు చెందిన ఆర్బిటర్ నుంచి వెలువడిన సంకేతాలు ల్యాండర్ కు చేరుకున్నాయని అన్నారు. విక్రమ్ ల్యాండర్ విషయంలో పరిస్థితి భిన్నంగా ఉందని చెప్పారు. ఇస్రో పంపిస్తున్న సంకేతాలకు ఇక ముందైనా ల్యాండర్ స్పందిస్తుందా? లేదా? అనే అంశం మీదే ఈ ప్రాజెక్టు విజయం ఆధారపడి ఉందని చెప్పారు.  ప్రస్తుతం ఎదురైన క్లిష్ట పరిస్థితులను మన శాస్త్రవేత్తలు అధిగమించగలరనే తాను ఆశిస్తున్నానని తెలిపారు.