Breaking News
  • శ్రీకాకుళం: కచరాంలో తృప్తి రిసార్ట్‌ యాజమాన్యం నిర్వాకం. రోడ్లపై గుర్రపు స్వారీ నిర్వహించిన తృప్తి రిసార్ట్‌ యాజమాన్యం. బైక్‌పై వెళ్తున్న రాంబాబు, రమాదేవి దంపతులను గుద్దిన గుర్రం. ఆస్పత్రిలో రాంబాబు పరిస్థితి విషమం. పట్టించుకోని రిసార్ట్‌ యాజమాన్యం. రాసార్ట్‌ ఎదుట స్థానికుల ఆందోళన, పరిస్థితి ఉద్రిక్తం. భారీగా మోహరించిన పోలీసులు.
  • ప.గో: తణుకు మండలం దువ్వలో పిచ్చికుక్క స్వైర విహారం. పిచ్చికుక్క దాడిలో10 మందికి గాయాలు.
  • గుంటూరు: సత్తెనపల్లిలో మహిళ ఆత్మహత్యాయత్నం. చోరీ కేసు పెట్టారన్న మనస్థాపంతో నిద్రమాత్రలు మింగిన లక్ష్మీ. పరిస్థితి విషమం, ఆస్పత్రికి తరలింపు.
  • అనంతపురం: కదిరి మండలం నడిమిపల్లిలో దారుణం. యువకుడు సుధాకర్‌ గొంతు కోసిన దుండగులు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సుధాకర్‌. గతంలో రామాంజనేయులు భార్యను ఎత్తుకెళ్లి.. తిరిగి అప్పగించిన సుధాకర్‌. రామాంజనేయులుపై అనుమానం వ్యక్తం చేస్తున్న పోలీసులు.
  • అనంతపురం: హిందూపురంలో రెచ్చిపోయిన వీధికుక్కలు. ఇద్దరు చిన్నారులపై దాడి. వీధికుక్కల దాడిలో తీవ్రంగా గాయపడ్డ చిన్నారులు. ఆస్పత్రికి తరలింపు, పరిస్థితి విషమం.
  • విజయవాడ: వంశీ వ్యాఖ్యలపై అయ్యప్ప భక్త కమిటీ అభ్యంతరం. టీవీ9 డిబేట్‌లో వంశీ అనుచిత వ్యాఖ్యలు సరికాదు. అయ్యప్ప మాలలో ఉన్న భక్తులు రాగద్వేషాలకు అతీతంగా ఉండాలి. పరుష పదజాలంతో భక్తుల మనోభావాలు దెబ్బతీస్తున్నారు. అయ్యప్ప భక్తులకు వంశీ కళంకం తెచ్చారు. ఇప్పటికైనా నియమనిష్టలతో దీక్ష చేయాలి-వేణుగోపాలస్వామి.
  • హైదరాబాద్‌: అశ్వత్థామరెడ్డి నివాసానికి వెళ్లిన ఎంపీ కోమటిరెడ్డి. అశ్వత్థామరెడ్డిని పరామర్శించిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా అందరూ ముందుకు రావాలి. అశ్వత్థామరెడ్డికి ఏం జరిగినా సీఎం కేసీఆర్‌దే బాధ్యత. కార్మికుల సమస్యలు ప్రభుత్వం త్వరగా పరిష్కరించాలి. సడక్‌బంద్‌ను విజయవంతం చేయాలి-ఎంపీ కోమటిరెడ్డి.

హిట్ వచ్చినా.. స్టార్ హీరోలు పట్టించుకోవడం లేదా..!

సినిమా ఇండస్ట్రీలో అదృష్టం అందరికీ ఒకేలా ఉండదు. కొంతమంది ఫ్లాప్‌లతో తమ కెరీర్‌ను ప్రారంభించినా.. తరువాత తరువాత హిట్లు కొట్టి టాప్‌ లిస్ట్‌లో చేరిపోతుంటారు. మరికొందరికేమో మొదట్లో హిట్లు వచ్చినా.. తరువాత దాని నిలుపుకోలేక ఫేడౌట్ అవుతుంటారు. ఇంకొందరేమో అభినయం ఉన్నా.. ఆఫర్లు లేక అనతికాలంలోనే సినిమా ఇండస్ట్రీకి దూరమవుతుంటారు. మరి కొంతమంది చిన్న చిన్న ఆఫర్లతో సరిపెట్టుకుంటుంటారు. ఇప్పుడు యంగ్ బ్యూటీ నిధి అగర్వాల్ పరిస్థితి ఇలానే ఉంది.

సవ్యసాచి చిత్రంతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది నిధి. ఈ చిత్రం చేతిలో ఉండగానే.. వెంటనే మిస్టర్ మజ్నులో కూడా ఆఫర్ కొట్టేసింది. కానీ ఈ రెండు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలవ్వడంతో.. ఆమె గ్రాఫ్ అలానే ఉండిపోయింది. అయితే ఆ తరువాత రామ్ నటించిన ఇస్మార్ట్ శంకర్‌లో ఛాన్స్ కొట్టేసిన నిధికి.. ఆ మూవీ హిట్‌తో కాస్త బూస్టప్ వచ్చినట్లైంది. ఇక ఈ మూవీ హిట్‌తోనైనా తనకు ఆఫర్లు వస్తాయని భావించింది. మరోవైపు వరుసగా పేరు మోసిన హీరోల సరసన నటించినప్పటికీ.. మిగిలిన స్టార్ హీరోలెవ్వరూ ఆమెను పట్టించుకోకపోగా.. ఇప్పుడు డెబ్యూట్ హీరోతో రొమాన్స్ చేసేందుకు సిద్ధమైంది ఈ బ్యూటీ. గల్లా జయదేవ్ తనయుడు అశోక్ గల్లా హీరోగా శ్రీరామ్ ఆదిత్య తెరకెక్కిస్తోన్న చిత్రంలో ఆమె హీరోయిన్‌గా నటించనుంది. ఇక ఈ మూవీ మినహాయించి.. ఇప్పటివరకు ఆమెకు తెలుగులో మరో ఆఫర్ లేదు. అందాలు ఆరబోస్తున్నా.. ఆమె సైడ్ దర్శక నిర్మాతలు కూడాపెద్దగా చూడకపోవడం గమనర్హం(కొందరు హీరోయిన్లు అభినయం లేకపోయినా.. అందాలతో వరుస ఆఫర్లను కొట్టేస్తుంటారు). ఇదిలా ఉంటే ఈ బ్యూటీకి ఇప్పుడు తమిళ్‌లో ఓ ఆఫర్ వచ్చింది. జయం రవి హీరోగా తెరకెక్కుతోన్న భూమిలో నిథి నటిస్తోంది. మరి అక్కడైనా నిధి హిట్ కొట్టి స్టార్ హీరోల సరసన ఛాన్స్ కొట్టేస్తోందేమో చూడాలి. అలాగే భవిష్యత్‌లోనైనా నిధికి టాలీవుడ్‌లో మంచి ఆఫర్లు వస్తాయేమో చూడాలి.