పాము కాటు చావులు.. ఎక్కువ భారత్‌లోనే

వర్షాకాలం కొనసాగుతోంది. కొన్ని ప్రాంతాలు మినహాయిస్తే దేశమంతా వర్షాలు దంచికొడుతున్నాయి. దీంతో కొన్ని ప్రాంతాలు జలమయవ్వగా.. పలు చోట్ల భారీ ఆస్తి, ప్రాణ నష్టం జరిగింది. ఇదిలా ఉంటే వానకాల ఆరంభంతో పాముల బెడద పెరిగింది. గ్రామాల్లో పాముల సంచారం గణనీయంగా పెరగడంతో పాము కాటు బాధితుల సంఖ్య పెరిగింది. ఇక ప్రతి ఏడాది భారత్‌లో దాదాపు 50వేల మంది ఈ పాము కాటు వల్ల మరణిస్తున్నారని రిపోర్టు చెబుతున్నాయి. ముఖ్యంగా జూన్ నుంచి సెప్టెంబర్ మధ్య […]

  • Tv9 Telugu
  • Publish Date - 2:12 pm, Fri, 2 August 19

వర్షాకాలం కొనసాగుతోంది. కొన్ని ప్రాంతాలు మినహాయిస్తే దేశమంతా వర్షాలు దంచికొడుతున్నాయి. దీంతో కొన్ని ప్రాంతాలు జలమయవ్వగా.. పలు చోట్ల భారీ ఆస్తి, ప్రాణ నష్టం జరిగింది. ఇదిలా ఉంటే వానకాల ఆరంభంతో పాముల బెడద పెరిగింది. గ్రామాల్లో పాముల సంచారం గణనీయంగా పెరగడంతో పాము కాటు బాధితుల సంఖ్య పెరిగింది. ఇక ప్రతి ఏడాది భారత్‌లో దాదాపు 50వేల మంది ఈ పాము కాటు వల్ల మరణిస్తున్నారని రిపోర్టు చెబుతున్నాయి. ముఖ్యంగా జూన్ నుంచి సెప్టెంబర్ మధ్య కాలంలో పాము కాటు బాధితుల సంఖ్య పెరుగుతుందని ఆ రిపోర్టు వెల్లడించింది.

ఇక 2017 లెక్కల ప్రకారం.. పాము కాటు బాధితుల్లో మహారాష్ట్ర మొదటి స్థానంలో ఉందని.. ఆ తరువాత పశ్చిమ బెంగాల్, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, కర్ణాటక రాష్ట్రాలు ఉన్నాయని వారు పేర్కొన్నారు. అంతేకాదు పాము కాటుకు గురయ్యే దేశాల్లో భారత్ మొదటి స్థానంలో ఉందని.. ఒక సంవత్సరంలో 2.8మిలియన్ భారతీయుడు సర్ప రాజు కాటుకు బలౌతున్నారని వారు వెల్లడించారు. ఇక మారుమూల ప్రాంతాల్లో సమయానికి సరైన చికిత్స అందకపోవడం.. పాము కాటు వేసే వాక్సిన్ అధిక ధరకు ఉండటం వంటి కారణాలతో ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారని ఆ రిపోర్ట్ తేల్చింది.