జగన్‌ను మోదీ ఎందుకు కల్వలేదంటే?

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో అపాయింట్‌మెంట్ కన్‌ఫర్మ్ అయ్యాకనే ఢిల్లీ వెళ్ళిన ఏపీ ముఖ్యమంత్రి చివరికి ప్రధానిని కల్వకుండానే తిరుగుముఖం పట్టారు. ఢిల్లీ పర్యటనను చివరి నిమిషం దాకా మీడియాకు తెలియకుండా జాగ్రత్తపడిన ముఖ్యమంత్రి.. తీరా ఢిల్లీ వెళ్ళి 24 గంటలు తిరక్కుండానే తిరిగొచ్చేశారు. ఇంతకీ మోదీని జగన్ ఎందుకు కల్వలేదు. ప్రాబ్లెం అటా? ఇటా? ఎటువైపు నుంచి? ఇదిప్పుడు ఏపీలో హాట్ చర్చకు తెరలేపింది. ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న రెండు ప్రధాన అంశాలకు ప్రధాని […]

జగన్‌ను మోదీ ఎందుకు కల్వలేదంటే?
Follow us

| Edited By: Srinu

Updated on: Dec 06, 2019 | 3:54 PM

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో అపాయింట్‌మెంట్ కన్‌ఫర్మ్ అయ్యాకనే ఢిల్లీ వెళ్ళిన ఏపీ ముఖ్యమంత్రి చివరికి ప్రధానిని కల్వకుండానే తిరుగుముఖం పట్టారు. ఢిల్లీ పర్యటనను చివరి నిమిషం దాకా మీడియాకు తెలియకుండా జాగ్రత్తపడిన ముఖ్యమంత్రి.. తీరా ఢిల్లీ వెళ్ళి 24 గంటలు తిరక్కుండానే తిరిగొచ్చేశారు. ఇంతకీ మోదీని జగన్ ఎందుకు కల్వలేదు. ప్రాబ్లెం అటా? ఇటా? ఎటువైపు నుంచి? ఇదిప్పుడు ఏపీలో హాట్ చర్చకు తెరలేపింది.

ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న రెండు ప్రధాన అంశాలకు ప్రధాని నరేంద్ర మోదీని ఆహ్వానించేందుకు ముఖ్యమంత్రి జగన్ డిల్లీ పర్యటనకు పూనుకున్నారు. డిసెంబర్ చివరి వారంలో నిర్వహించ తలపెట్టిన కడప ఉక్కు కర్మాగారానికి ప్రధాని చేతుల మీదుగా శంకుస్థాపన చేయించాలని ముఖ్యమంత్రి భావించారు. అందుకోసం డిసెంబర్ 24-26 తేదీల మధ్య ప్రధాని అపాయింట్‌మెంట్ కోరేందుకు అభ్యర్థనా పత్రంతో ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్ళారు. దానికి తోడు జగన్ అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ‘అమ్మ ఒడి’ పథకాన్ని కూడా ప్రధాని చేతుల మీదుగా లాంచ్ చేయాలని సీఎం తలపెట్టినట్లు ముఖ్యమంత్రి కార్యాలయ వర్గాలు చెబుతున్నాయి. ఇందుకోసం జనవరి 9న ముహూర్తం ఖరారు చేసుకున్న ముఖ్యమంత్రి.. ఆ కార్యక్రమానికి మోదీని ఆహ్వానించ తలపెట్టారు.

ఈ క్రమంలో ఈ రెండింటికి ప్రధాన మంత్రి సహకారాన్ని కోరడం ద్వారా ఆయన్ని ఆహ్వానించేందుకు ముఖ్యమంత్రి ఢిల్లీకి గురువారం రాత్రి చేరుకున్నారు. కానీ తెల్లారేసరికి సీన్ మారిపోయింది. తన వ్యక్తిగత సహాయకుడు నారాయణ ఆకస్మిక మరణంతో జగన్ ప్రధానిని కల్వకుండానే తిరుగుపయనమయ్యారు. ఢిల్లీ నుంచి నేరుగా కడపకు విమానంలో చేరుకుని నారాయణ కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్ళారు.

అయితే, ప్రధానిని జగన్ ఎందుకు కల్వలేదని మరోవైపు చర్చ మొదలైంది. మోదీ అపాయింట్‌మెంట్ ఇవ్వలేదని కొందరు చెబుతుండగా.. దానికి ఏపీ బిజెపి నేతలు బ్రేక్ వేశారని కూడా ప్రచారం మొదలైంది. కానీ, ఉల్లిధరలు, జిడిపి వంటి కీలకాంశాలపై బిజెపి థింక్ ట్యాంక్ భేటీ అత్యవసరంగా సమావేశం అవుతున్న నేపథ్యంలో మోదీ మరోసారి కలుద్దామన్న సంకేతాలను జగన్‌కు పంపించారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే జగన్ తిరుగుపయనమయ్యారని చెబుతున్నారు. సో.. త్వరలోనే జగన్ మరోసారి ఢిల్లీ వెళ్ళే ఛాన్స్ వుందని సీఎంవో వర్గాలంటున్నాయి.

చెర్రీ,తారక్, ప్రభాస్ లెక్క వేరు, నాలెక్క వేరంటున్న అల్లు అర్జున్
చెర్రీ,తారక్, ప్రభాస్ లెక్క వేరు, నాలెక్క వేరంటున్న అల్లు అర్జున్
ఆవకాయ పచ్చడి కష్టాలు తీర్చేందుకు తెలంగాణ ఆర్టీసీ అదిరిపోయే ఐడియా
ఆవకాయ పచ్చడి కష్టాలు తీర్చేందుకు తెలంగాణ ఆర్టీసీ అదిరిపోయే ఐడియా
జోమాటోకు మళ్లీ జీఎస్టీ డిమాండ్‌ నోటీసు.. ఎన్ని కోట్లో తెలుసా?
జోమాటోకు మళ్లీ జీఎస్టీ డిమాండ్‌ నోటీసు.. ఎన్ని కోట్లో తెలుసా?
70లో కూడా కంటి చూపు మెరుగ్గా ఉండాలంటే.. ఇప్పుడే ఈ పనులు చేయండి..
70లో కూడా కంటి చూపు మెరుగ్గా ఉండాలంటే.. ఇప్పుడే ఈ పనులు చేయండి..
వేసవిలో పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా.?
వేసవిలో పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా.?
9 బంతుల్లో 3 రికార్డులు బ్రేక్ చేసిన జార్ఖండ్ డైనమేట్..
9 బంతుల్లో 3 రికార్డులు బ్రేక్ చేసిన జార్ఖండ్ డైనమేట్..
రోడ్డుపై గాయాలతో అరుదైన జీవి.. దీని ప్రత్యేకత తెలిస్తే షాక్..
రోడ్డుపై గాయాలతో అరుదైన జీవి.. దీని ప్రత్యేకత తెలిస్తే షాక్..
టార్గెట్ 300.. ఢిల్లీలో టీ20 చరిత్రనే హైదరాబాదోళ్లు మార్చేస్తారు
టార్గెట్ 300.. ఢిల్లీలో టీ20 చరిత్రనే హైదరాబాదోళ్లు మార్చేస్తారు
ఆమె ఈమేనా.. ఏంటి ఇలా మారిపోయింది ఈ వయ్యారి.!
ఆమె ఈమేనా.. ఏంటి ఇలా మారిపోయింది ఈ వయ్యారి.!
10 మంది ఓటర్ల కోసం 18 కి.మీ అరణ్య బాట.. పోలింగ్ అధికారుల సాహసం..
10 మంది ఓటర్ల కోసం 18 కి.మీ అరణ్య బాట.. పోలింగ్ అధికారుల సాహసం..
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.