Breaking News
  • ఏడు నెలల పాలనలో జగన్‌ విఫల నాయకుడిగా పేరుపొందారు. ప్రతిపక్ష నేతను అసెంబ్లీలోకి రాకుండా అడ్డుకోవడం ఎన్నడూ చూడలేదు. ఉద్యోగ సంఘాలు కూడా చంద్రబాబు మాటలను వక్రీకరించడం బాధాకరం. చౌకబారు రాజకీయాలు సరికాదు-నక్కా ఆనందబాబు.
  • ప్రకాశం: ఒంగోలులో సీపీఎస్‌ ఎంప్లాయిస్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో మనోవేదన నిరసన ర్యాలీ, పాల్గొన్న కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల ప్రభుత్వ ఉద్యోగులు.
  • కృష్ణాజిల్లా: కీసర టోల్‌ప్లాజా దగ్గర పనిచేయని ఫాస్టాగ్‌. ఇబ్బందులు పడుతున్న వాహనదారులు. రెండు క్యాష్‌ కౌంటర్ల ద్వారా టోల్‌ వసూలు చేస్తున్న సిబ్బంది.
  • చిత్తూరు టూటౌన్‌ పీఎస్‌ దగ్గర ఉద్రిక్తత. ఆత్మహత్య చేసుకున్న ఫాతిమా మృతదేహంతో తల్లిదండ్రుల ధర్నా. నిందితుడిని తప్పించేందుకు పోలీసులు యత్నిస్తున్నారని ఆరోపణ. పోలీస్‌స్టేషన్‌ ఎదుట ఫాతిమా మృతదేహంతో తల్లిదండ్రుల ఆందోళన.
  • చెన్నై వన్డేలో టాస్‌గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకున్న విండీస్‌. భారత్‌-విండీస్‌ మధ్య తొలివన్డే.
  • తిరుమల: ధనుర్మాసం సందర్భంగా ఈ నెల 17 నుంచి జనవరి 14 వరకు శ్రీవారి సుప్రభాత సేవ రద్దు.
  • విశాఖ: హుకుంపేట మండలం రంగశీలలో కాల్పులు. రైతుభరోసా నగదు కోసం అన్నదమ్ముల మధ్య వివాదం తనవాటా డబ్బులు అడిగిన తమ్ముడు జయరాం, భార్య కొండమ్మపై నాటు తుపాకీతో కాల్పులు జరిపిన అన్న కృష్ణ. తమ్ముడి భార్య కొండమ్మ చేతిలోకి దూసుకెళ్లిన బుల్లెట్. కొండమ్మను చికిత్స నిమిత్తం కేజీహెచ్‌కు తరలింపు. కాల్పులు జరిపి సమీప కొండల్లోకి పారిపోయిన కృష్ణ.

పండగ లోకలే కానీ.. సదర్‌కు హర్యానా ఫ్లేవర్ ఎందుకు..?

Why Haryana Buffaloes are dominating local Buffaloes?, పండగ లోకలే కానీ.. సదర్‌కు హర్యానా ఫ్లేవర్ ఎందుకు..?

దీపావళి పండుగ సందర్భంగా.. హైదరాబాద్‌లో సదర్ ఉత్సవాలు జరుగుతాయి. సదర్ పండుగ హైదరాబాద్‌ మహానగరంలో జరిగే ప్రధాన ఉత్సవాల్లో ఒకటి. అంతేకాకుండా.. కేవలం హైదరాబాద్‌లోనే సదర్ పండుగను నిర్వహిస్తారు. దీనిని దున్నపోతుల ఉత్సవంగా కూడా వ్యవహరిస్తారు. యాదవ సంఘాల ఆధ్వర్యంలో ఈ ఉత్సవాలను నిర్వహించి.. దున్నపోతులను ఊరేగిస్తారు. ఇందులో భాగంగా వారం రోజులుగా దున్నపోతులకు తర్ఫీదును ఇవ్వడంతో పాటు సుందరంగా అలంకరించే పనిలో నిమగ్నమవుతారు. ప్రధానంగా దున్నపోతులకు చర్మం మీద వెంట్రుకలను తొలగించి చర్మానికి నూనె రాసి నిగనిగలాడేలా తయారు చేస్తారు. అలంకరించిన దున్నపోతులతో విన్యాసాలు చేయించడం ఈ ఉత్సవం యొక్క ప్రత్యేకత.

Why Haryana Buffaloes are dominating local Buffaloes?, పండగ లోకలే కానీ.. సదర్‌కు హర్యానా ఫ్లేవర్ ఎందుకు..?

కాగా.. ఈ సదర్ ఉత్సవాల్లో.. ఒకటి గమనిస్తే.. హర్యానాకు చెందిన దున్నపోతులే ఎక్కువగా దర్శనమిస్తాయి. మనవారు కూడా వాటిని కొనడానికే ఆసక్తిని కనబరుస్తారు కూడా. కోట్లకు కోట్లు రూపాయలు వెచ్చించి మరీ హర్యానా దున్నపోతులనే ఎందుకు కొనుగోలు చేస్తున్నారు? మరి హర్యానాకు చెందిన దున్నపోతులనే కొనుగోలు చేయడానికి కారణాలేంటి..? మన లోకల్ దున్నపోతుల సామర్థ్యాన్ని అవి డామినేట్ ఎందుకు చేస్తున్నాయి..? కారణాలు ఇవే..!

హైలెట్స్:

1. హర్యానా దున్నపోతులు ఎత్తులో కానీ.. బరువులో కానీ.. మనవాటి కంటే.. చాలా ధృఢంగా ఉంటాయి.

2. అలాగే.. సమరంలో.. బలంగా ఉన్న హర్యానా దున్నపోతులు ఎక్కువ సేపు పాల్గొంటాయి.

3. అవి దాదాపు 6.5 అడుగులకు పైగానే ఎత్తు ఉంటాయి.

4. ఇవి రోజుకు దాదాపు 30 లీటర్లకు పైగానే పాలు తాగుతాయి. వీటి బరువు 2000 నుంచి 1800 కిలోల బరువుంటాయి.

5. సజ్జలు, రాగులు, సేపు, బాదం, పిస్తా, కాజు, యాపిల్స్ వంటి బలమైన ఆహార పదార్థాలను వీటికి పెడతారు.

6. ఇలా చాలా మేలు జాతి రకాల దున్నపోతులు. ఇవి చాలా అరుదైనవి.