మలికిపురంలో డిగ్గీరాజా..ఎందుకొచ్చాడంటే..?

జాతీయ రాజకీయాల్లో బిజీబిజీగా అనే కాంగ్రెస్ సీనియర్ నేత, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్ (డిగ్గీ రాజా) సడన్ గా ఆంధ్ర ప్రదేశ్ లో ప్రత్యక్షమయ్యారు. అది కూడా తూర్పుగోదావరి జిల్లాలో తేలారు. ఎందుకా అన్న చర్చ ఇపుడు హాట్ హాట్ గా జరుగుతోంది. తూర్పు గోదావరి జిల్లా మలికిపురం చేరుకున్న డిగ్గీ రాజా అక్కడ్నించి ప్రకృతి రమణీయతకు మారుపేరైన దిండి రిసార్ట్స్ కు వెళ్లారు. శనివారం అక్కడే బస చేయనున్నారు డిగ్గీ రాజా. ఏపీలో […]

మలికిపురంలో డిగ్గీరాజా..ఎందుకొచ్చాడంటే..?
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Sep 28, 2019 | 5:31 PM

జాతీయ రాజకీయాల్లో బిజీబిజీగా అనే కాంగ్రెస్ సీనియర్ నేత, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్ (డిగ్గీ రాజా) సడన్ గా ఆంధ్ర ప్రదేశ్ లో ప్రత్యక్షమయ్యారు. అది కూడా తూర్పుగోదావరి జిల్లాలో తేలారు. ఎందుకా అన్న చర్చ ఇపుడు హాట్ హాట్ గా జరుగుతోంది.

తూర్పు గోదావరి జిల్లా మలికిపురం చేరుకున్న డిగ్గీ రాజా అక్కడ్నించి ప్రకృతి రమణీయతకు మారుపేరైన దిండి రిసార్ట్స్ కు వెళ్లారు. శనివారం అక్కడే బస చేయనున్నారు డిగ్గీ రాజా. ఏపీలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి దారుణంగా తయారైన సమయంలో అయన రాక పార్టీ కోసమే అని అందరు అనుకున్నారు కానీ. ఆయనొచ్చింది అందుకు కాదు అని తెల్సి అందరూ ఆశ్చ్యర్యపోయారు. కాంగ్రెస్ పెద్దల్లో ఒకరైన డిగ్గీ రాజా .. పార్టీ పనులతో సంబంధం లేకుండా ఏపీకి ఎందుకు వచ్చారు చెప్మా అని అందరు బుర్ర గోక్కుంటుంటే.. అసలు విషయం నెమ్మదిగా వెల్లడైంది. అదేంటంటే..

ఆదివారం నుంచి పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో అఖిల భారత క్షత్రియ సమాఖ్య సర్వ సభ్య సమావేశం జరుగనున్నది. క్షత్రియ సమాఖ్య ద్వారా జాతీయ స్థాయి నేతగా ఎదిగిన దిగ్విజయ్ సింగ్ అలియాస్ డిగ్గీ రాజా తనకు రాజకీయంగా ఒక గుర్తింపు రావడానికి కారణమైన క్షత్రియ సమాఖ్య సర్వ సభ్య సమావేశంలో పాల్గొనేందుకు.. తద్వారా కాంగ్రెస్ పార్టీకి కోల్పోతున్న ప్రభావాన్ని కొంతైనా సాధించి పెట్టేందుకు వచ్చారన్న క్లారిటీ వచ్చేసింది. విషయం తెల్సిన తర్వాత ఓహ్ ఇదా సంగతి అనుకున్నారు గోదావరి జిల్లాల జనం. అదన్న మాట సంగతి..

దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?