Breaking News
  • ఏపీ రాజధానిగా అమరావతిని గుర్తించిన సర్వే ఆఫ్‌ ఇండియా. జమ్ము-కశ్మీర్‌ విభజన తర్వాత విడుదల చేసిన కొత్త మ్యాప్‌లో ఏపీ రాజధానిగా ఏ నగరాన్ని చూపని సర్వే ఆఫ్‌ ఇండియా. తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన ఆంధ్రప్రదేశ్‌ ఎంపీలు. ఏపీ ప్రభుత్వం ఇచ్చిన పత్రాల ఆధారంగా అమరావతిని రాజధానిగా గుర్తిస్తూ కొత్తమ్యాప్‌ విడుదల చేసిన సర్వేఆఫ్‌ ఇండియా.
  • యాదాద్రి: బైక్‌ను ఢీకొన్న గూడ్స్‌ రైలు. భర్త రాంరెడ్డి మృతి, భార్య రాధకు తీవ్రగాయాలు. భువనగిరి మండలం రాయగిరి రైల్వేస్టేషన్‌ దగ్గర ఘటన.
  • పార్టీ మారతారన్న వార్తలపై స్పందించిన మంత్రి ఈటల. నేను పార్టీ మారను-మంత్రి ఈటల. గాలి వార్తలపై నేను స్పందించను. చెప్పే వాళ్లు ఎన్నైనా చెప్తారు-మంత్రి ఈటల.
  • సుజనాచౌదరి వ్యాఖ్యలకు మంత్రి మోపిదేవి కౌంటర్‌. గోడ దూకే ఎంపీలెవరూ వైసీపీలో లేరు. జగన్‌పై ఎంపీలు, ఎమ్మెల్యేలకు సంపూర్ణ విశ్వాసం ఉంది. తిరుమలను ఆర్ధిక వనరుగా భావించే ఆలోచన ప్రభుత్వానికి లేదు -మంత్రి మోపిదేవి వెంకటరమణ.
  • ఈ ప్రపంచంలో దేనికైనా రంగులు వేయొచ్చు కష్టానికి తప్ప. అమరావతిని అంతర్జాతీయ పటంలో పెట్టింది చంద్రబాబు. అమరావతిని చేర్చి సర్వే ఆఫ్‌ ఇండియా కొత్త మ్యాప్‌ విడుదల చేసేలా లోక్‌సభలో పోరాడిన గల్లా జయదేవ్‌కు అభినందనలు-ట్విట్టర్‌లో నారా లోకేష్‌

‘బ్యాన్’ అంటే.? కంట్రోలింగ్ పవర్ ఎవరిది.?

Is Ban A Fashion Word These Days?, ‘బ్యాన్’ అంటే.? కంట్రోలింగ్ పవర్ ఎవరిది.?

సినిమా, షార్ట్ ఫిల్మ్, వెబ్ సిరీస్, ప్రచార చిత్రం… ఇలా ఏదైనా విడుదలై.. అది కాస్తా ఎవరి మనోభావాలనైనా కించపరిస్తే చాలు.. వెంటనే అందరి నుంచి వచ్చే మొదటి మాట ‘బ్యాన్’. ఇదేదో ఫ్యాషన్ పదం అయిపోయినట్లు ప్రతి ఒక్కరూ కూడా బ్యాన్ చేయాలంటూ నినాదాలు, ట్విట్టర్‌లో హ్యాష్‌ట్యాగ్‌లను ట్రెండ్ చేస్తూ బీభత్సం సృష్టిస్తున్నారు.

మొన్నటికి మొన్న రెడ్ లేబెల్ టీ.. వినాయక చవితి సందర్భంగా ఓ యాడ్‌ను రూపొందిస్తే.. అది హిందూ మతాన్ని దెబ్బతీసేలా ఉందని.. వెంటనే దాని ప్రసారాన్ని నిలిపివేయాలని హంగామా చేశారు. అయితే ఇంతటితో ఆగకుండా #BanRedLabel అనే హ్యాష్‌ట్యాగ్‌ను ట్విట్టర్‌లో ట్రెండ్ చేశారు. ఇది ఒక్కటే కాదు.. బోలెడు ఉదాహరణలు ఉన్నాయి.

యాడ్స్ విషయంలోనే కాదు సినిమాల గురించి ప్రస్తావించినా.. ఈ మధ్యకాలం వచ్చిన ఏ సినిమాను తీసుకున్నా ఎవరో ఒకరి మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయని.. మతాన్ని కించపరుస్తున్నారని వాదనలు వినిపించాయి. నాడు షాహిద్ కపూర్ హీరోగా నటించిన ‘హైదర్’ సినిమా విషయంలో కూడా వయోలెన్స్.. అక్రమ సంబంధం వంటి అంశాలను ఎక్కువగా ప్రేరేపించేలా ఉందని.. వెంటనే చిత్రాన్ని బ్యాన్ చేయాలని కొందరు వాదించారు.

షార్ట్‌ఫిల్మ్స్ విషయానికి వస్తే.. సోషల్ మీడియా స్టార్ దీప్తి సునైనా గత ఏడాది ‘సీత’ అనే షార్ట్ ఫిల్మ్ తీసింది. ఈ ఫిల్మ్‌పై ఎంత రచ్చ జరిగిందో అందరికి తెలిసిందే. అమ్మాయిల మీద అఘాయిత్యాల జరుగుతున్న దానిపై సృజనాత్మకంగా చూపించారు. అయితే ‘సీత’ అనే పేరు పెట్టి అవమానించారని.. వెంటనే ఈ ఫిల్మ్‌ను బ్యాన్ చేయాలని విప్లవకారులు కంకణం కట్టుకున్నారు. ఆఖరికి ఆ చిత్ర దర్శకుడిపై కూడా దాడికి దిగిన సంగతి తెలిసిందే.

సినిమా అనేది కళ. వివిధ అంశాలను ప్రస్తావిస్తూ ఆయా రంగాల్లోని ఇబ్బందులను చూపిస్తూ.. కొంతమంది దర్శకులు సొసైటీకి మంచి మెసేజ్ ఇవ్వాలని ప్రయత్నిస్తారు. కొన్నిసార్లు సెన్సిటివ్ పాయింట్స్‌ను టచ్ చేసేటప్పుడు మతాన్ని గానీ.. వ్యక్తిని గానీ ఆధారంగా తీసుకోవాల్సి వచ్చినప్పుడు.. దాన్ని చూసేవారికి తప్పుగా అనిపించవచ్చు. కానీ సినిమా అనేది కల్పితం.. వాస్తవ సంఘటనలను తీసుకున్నప్పటికి ఎవరిని కించపరిచి సినిమా లేదా వెబ్ సిరీస్‌లను తెరకెక్కించాలని అనుకోరు.

ఇది ఇలా ఉండగా తాజాగా ఆన్లైన్ స్ట్రీమింగ్ యాప్ నెట్‌ఫ్లిక్స్లో ‘లియాల’ అనే కొత్త వెబ్ సిరీస్ మొదలు కాబోతోంది. ఇందులో హిందువులను నీచంగా చూపించారని.. వాళ్ళను సంఘవిద్రోహులుగా చిత్రీకరించారని కొందరు #BanNetFlix అనే హ్యాష్‌ట్యాగ్‌ను ట్విట్టర్‌లో ట్రెండ్ చేశారు. ఒక్క ఈ వెబ్ సిరీస్ మాత్రమే కాదు నెట్‌ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతున్న పలు సిరీస్‌ల్లో సెన్సిటివ్ కంటెంట్ ఉంది. వాటిని రూపొందించిన దర్శక నిర్మాతల మీద కేసు వేసి ప్రసారాన్ని నిలిపేయాలని చెప్పాలి తప్ప.. ఏకంగా నెట్‌ఫ్లిక్స్‌ను బ్యాన్ చేయడం ఎంతవరకు సబబని కొందరు నెటిజన్లు మండిపడుతున్నారు.

ఆన్లైన్ స్ట్రీమింగ్ యాప్స్ ఉన్నవి కేవలం ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడం కోసమే.. అంతేకాకుండా అది బిజినెస్‌లో ఒక భాగమే. సినిమాలు, యాడ్స్, వెబ్ సిరీస్‌, షార్ట్ ఫిల్మ్స్ ను రూపొందించేవారు పంథాను మార్చుకుంటేనే తప్ప.. దీనికి ఫుల్‌స్టాప్ పడేలా కనిపించట్లేదు.