ఇది ఆరోగ్యానికి పవర్‌ హౌజ్‌..

Avocado helps in increasing meal satisfaction in obese adults, ఇది ఆరోగ్యానికి పవర్‌ హౌజ్‌..

అవోకాడోస్‌ కడుపులో కొవ్వును దహించగలిగే అద్భుతమైన పండు. ఎందుకంటే వీటిల్లో ఒమేగా – 6 కొవ్వు ఆమ్లాల శాతం అధిక మోతాదులో ఉంటుంది. ఇది కొవ్వును శక్తిరూపంలోకి మార్చగలిగిన పండు. అంతే కాదు..ఈ పండు జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. తద్వారా చెడు కొవ్వుని దహించుటలో ప్రధానపాత్ర పోషిస్తుంది. అంతేకాదు.. అనేకఆరోగ్య సమస్యలకు చికిత్స చేయడానికి అవోకాడోస్ ని ఉపయోగిస్తారని తాజా అధ్యయనం వెల్లడించింది. ఈ మేరకు జర్నల్ ఆఫ్ న్యూట్రియంట్స్‌లో ప్రచురించిన అధ్యయనంలోభాగంగా, పరిశోధకుల బృందం అవోకాడోస్‌ని వండర్‌ ఫుడ్‌గా పరిగణించారు.
అవోకాడోస్‌…దాదాపు 20 సహజ విటమిన్లు మరియు ఖనిజాలు, ప్రోటీన్లు, ఫైబర్‌, ఇలా మనిషి శరీరానికి ఉపయోగపడే అనేక పదార్ధాలను కలిగి ఉంటాయి. ఆకలి నియంత్రణ,ఫ్యాట్‌ బర్నర్‌గా పనిచేసి, బరువు తగ్గించుకోవటానికి ఉపయోగపడతాయని అధ్యయనం ప్రధాన పరిశోధకుడు బ్రిట్ బర్టన్-ఫ్రీమాన్ చెప్పారు. అవోకాడోస్ గర్భాశయానికి ఉపయోగపడుతుంది. అవోకాడోస్ లైట్ బాల్  ఆకారం కూడా గర్భాశయంలాగానే  కనిపిస్తోంది. అవోకాడోస్ పునరుత్పాదక శక్తిని పెంచుతుంది. ఆరోగ్యాన్ని కూడా బలపరుస్తుంది. ఫోలిక్ఆమ్లం గని అవోకాడోస్ అంటారు. ఇంకా వీటి ప్రయోజనాలు పరిశీలించనట్లయితే..
– జ్ఞాపకశక్తి సాంద్రతలు, చిరాకు మరియు మగత తగ్గుతుంది
– తక్కువ కొలెస్ట్రాల్ కలిగి ఉంటుంది.
– ఎర్ర రక్త కణాల పునరుత్పత్తి, రక్తహీనతను నివారించగలుగుతుంది.
– అధిక రక్తపోటును నివారిస్తుంది.
– అవోకాడోస్ వాడకం ఒత్తిడితో పోరాడటానికి సహాయపడుతుంది, హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
– అవోకాడోలు గర్భిణీ స్త్రీలు తమ మెనూలో చేర్చడానికి ఉపయోగపడతాయి, ఎందుకంటే అవి మెదడు అభివృద్ధి మరియు పిండం పెరుగుదలను సానుకూలంగా ప్రభావితం చేస్తాయిమరియు పుట్టుకతో వచ్చే వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి.
– అవోకాడో జీర్ణక్రియపై ప్రయోజనకరమైన ప్రభావాన్ని కలిగి ఉంది, మలబద్ధకానికి సహాయపడుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *