97 ఏళ్ల లేడీ సూపర్ స్టార్.. ఎలా చనిపోయింది?

హాలీవుడ్ ప్రపంచం ఇప్పుడు తీవ్ర దిగ్భ్రాంతిలో నిండిపోయింది. ఒకప్పటి వెండితెర మహారాణి.. సిల్వర్ స్క్రీన్ ఐకాన్ డోరిస్ డే.. కన్నుమూసింది. గ్లామర్ ప్రపంచానికి తూరుపుముక్క అంటూ పేరు తెచ్చుకున్న ఈవిడ 97 ఏళ్ళు బతికి.. సెలబ్రిటీ వరల్డ్ లో ‘నేనంటే నేనే’ అని చాటిచెప్పుకుంది. సినిమా వాళ్ళకు అవీఇవీ అన్ని అలవాట్లూ ఉంటాయి.. తొందరగా పోతారు అనే నానుడిని అబద్ధం చేస్తూ డోరిస్ డే.. ఈవిధంగా చరిత్రకెక్కింది. కానీ.. మరో మూడేళ్లు బతికుంటే సెంచరీ కొట్టేదన్న వెలితి మాత్రమే మిగిలిపోయిందక్కడ.

న్యుమోనియా వ్యాధి సోకి.. ఎంతకీ నయం కాకపోవడంతో ఆమె తుది శ్వాస విడిచినట్లు.. ఆమె నడుపుతున్న ‘డోరిస్ డే ఎనిమల్ ఫౌండేషన్’ స్వచ్ఛంద సంస్థ ప్రకటించింది. దీంతో.. హాలీవుడ్ సెలబ్రిటీల నుంచి నివాళి సందేశాల పరంపర షురూ అయింది. నాలుసార్లు పెళ్లి చేసుకున్నా.. ఆమెకు ఒకే ఒక్క కొడుకు కలిగాడు. టెర్రీ ముల్చర్ అనే అతడు కూడా 2004లో మరణించాడు. ఇప్పుడామెకు ఒక వారసుడంటూ లేకపోయాడు. మనవడు ర్యాన్ మాత్రమే నిన్నటిదాకా ఆమెతో ఉన్నాడు. 1950, 1960 కాలంలో హాలీవుడ్ లో డోరిస్ డే హవా విపరీతంగా నడిచింది. పిల్లో టాక్, లవ్ మీ ఆర్ లీవ్ మీ, రొమాన్స్ ఆన్ ది హై సీస్, కలామిటి జేన్ లాంటి క్లాసికల్ ఫిలిమ్స్ ఆమె క్రేజ్ ని ఎక్కడికో తీసుకెళ్ళాయి. ఏదేమైనా.. సంపూర్ణ జీవితం గడిపిన అందాల రాశిగా డోరిస్ డే పేరు చరిత్రలో నిలిచిపోవడం ఖాయం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *