Breaking News
  • నేడు సీఎం జగన్‌ ఇంటి ముట్టడికి విద్యార్థి సంఘాల పిలుపు. కర్నూలులో రాజధాని, హైకోర్టు ఏర్పాటు చేయాలని డిమాండ్‌.
  • నేటి నుంచి భారత్‌, బంగ్లాదేశ్‌ చరిత్రాత్మక డేఅండ్‌ నైట్‌ టెస్టు. మధ్యాహ్నం ఒంటిగంట నుంచి మ్యాచ్‌ ప్రారంభం.
  • హైదరాబాద్‌: ఈఎస్‌ఐ డిస్పెన్సరీల్లో ఔషధాల కొరత. ఐఎంఎస్‌లో ఫిబ్రవరి నుంచి నిలిచిపోయిన కొనుగోళ్లు. ఐఎంఎస్‌ కుంభకోణం నేపథ్యంలో.. ఔషధాల కొనుగోళ్లకు ముందుకురాని అధికారులు. ఔషధాల కొనుగోలు బాధ్యతను.. క్షేత్రస్థాయి అధికారులకు అప్పగించాలనే యోచనలో ఐఎంఎస్‌.
  • హైదరాబాద్‌లో అమిటీ యూనివర్సిటీ. విద్యాశాఖకు దరఖాస్తు చేసిన అమిటీ గ్రూపు. ఇప్పటికే దేశంలోని 10 నగరాల్లో ఉన్న అమిటీ యూనివర్సిటీలు.
  • రజినీకాంత్‌ వ్యాఖ్యలకు పళనిస్వామి కౌంటర్‌. రాజకీయ పార్టీని ఏర్పాటు చేయకుండా.. రాజకీయాల్లో అద్భుతాలపై మాట్లాడడం సరికాదు. దేని ఆధారంగా 2021 ఎన్నికల్లో అద్భుతం జరుగుతుందని.. రజినీకాంత్‌ విశ్వసిస్తున్నారో అర్థం కావడంలేదు-పళనిస్వామి.
  • గంగానది ప్రక్షాళన ప్రక్రియ కొనసాగుతోంది. ప్రక్షాళన కోసం రూ.28,600 కోట్ల వ్యయంతో.. 305 ప్రాజెక్టులను మంజూరు చేశాం. దాదాపు 109 ప్రాజెక్టులను పూర్తయ్యాయి. ప్రస్తుతం గంగా నదిలో నీటి నాణ్యత పెరిగింది -కేంద్రమంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌.
  • 2020లో సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం. 23 సాధారణ సెలవులు, 17 ఐచ్ఛిక సెలవులు ఇవ్వాలని నిర్ణయం.
  • గుంటూరు: 104 సిబ్బంది మధ్య ఘర్షణ. రాడ్‌తో ఫార్మసిస్ట్‌పై దాడి చేసిన డ్రైవర్‌. ఫార్మసిస్ట్‌ పరిస్థితి విషమం, ఆస్పత్రికి తరలింపు. రాజుపాలెం మండలం కోట నెమలిపురి దగ్గర ఘటన.

బిగ్ బాస్: రవి ఎలిమినేషన్‌తో.. ఆ ముగ్గురిలో ఒకరికే టైటిల్.?

Bigg Boss 3 Telugu These Three Contestants Are In Line For Title, బిగ్ బాస్: రవి ఎలిమినేషన్‌తో.. ఆ ముగ్గురిలో ఒకరికే టైటిల్.?

ఎన్నో ఆసక్తికరమైన మలుపులతో బిగ్ బాస్ తెలుగు సీజన్ 3 చివరి దశకు చేరుకుంది. మరో నాలుగు వారాల్లో ఈ షో ముగియనుంది. నిన్న మొన్నటి వరకు సోసోగా సాగిన ఈ షో.. ఇప్పుడు అసలు సిసలైన మజాను ప్రేక్షకులకు అందిస్తూ మంచి టీఆర్పీ రేటింగ్స్‌తో దూసుకుపోతోంది. ఇక తాజాగా ఆదివారం జరిగిన ఎలిమినేషన్స్‌లో స్ట్రాంగ్ కంటెస్టెంట్లలో ఒకరైన రవికృష్ణ హౌస్ నుంచి బయటికి వచ్చేసిన సంగతి తెలిసిందే.

సీరియల్స్ ద్వారా పాపులర్ అయిన రవికృష్ణ.. వరుణ్ సందేశ్, శ్రీముఖి, బాబా భాస్కర్ తర్వాత హౌస్‌లో బలమైన పార్టిసిపెంట్‌గా ఉన్నారు. ఇక సోషల్ మీడియాలో రవి తరపున ఓట్లు వేయాలని ఓ వర్గం గ్రూపుల్లో క్యాంపెయిన్ కూడా జరిగింది. అయితే అనూహ్యంగా నిన్న ఆయన బిగ్ బాస్‌కు బై చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది. సీజన్‌లోనే పదో వారం టఫ్ ఎలిమినేషన్ జరగ్గా.. అందులో రవికృష్ణ ఎలిమినేట్ కావడంతో టైటిల్ విన్నర్ అయ్యే అర్హత ఆ ముగ్గురికి ఉందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. వరుణ్ సందేశ్, శ్రీముఖి, బాబా భాస్కర్‌ల ఒకరు ఖచ్చితంగా టైటిల్ గెలుస్తారని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.

ఇక మరో స్ట్రాంగ్ కంటెస్టెంట్ అలీ రెజా‌కు టైటిల్ గెలిచే ఛాన్సులు తక్కువే. దీనికి కారణం ఒకసారి బయటికి వెళ్లొచ్చిన అలీ రెజాను ప్రేక్షకులు మళ్ళీ తిరిగి గెలిపిస్తారని ఆశించలేం. అటు శ్రీముఖి, బాబా భాస్కర్, వరుణ్ సందేశ్ మధ్య టైటిల్ కోసం పోటీ ఉన్నా.. ఫైనల్‌లో వరుణ్- శ్రీముఖిల మధ్యే టగ్ ఆఫ్ వార్ నడుస్తుందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.