Breaking News
  • తెలుగు రాష్ట్రాలకు రూ.10లక్షలు విరాళం. మలికిపురం మండలం మట్టపర్రు సొంత గ్రామానికి తనవంతు సహాయంగా 5లక్షలు అందజేత.. తన కుటుంబ సభ్యుల ద్వారా తన గ్రామంలో రేషన్ కార్డులు ఉన్న ప్రతి ఒక్కరికీ వెయ్యి రూపాయల చొప్పున పంపిణీ.. కరోనా వైరస్ బారిన పడకుండా జాగ్రత్తగా ఉండాలని పిలుపు..
  • న్యూఢిల్లీ: కరోనా వైరస్ పై జరుగుతున్న యుద్ధంలో విజయం సాధించాలంటే ప్రజల సహకారం మరింత అవసరమని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి.
  • కాశ్మీర్ లోయలో ఒక్కరోజులోనే 7 కొత్త కరోనా కేసుల నమోదు. శ్రీనగర్‌లో విదేశాలకు వెళ్లొచ్చిన ముగ్గురికి, మతపరమైన ప్రార్థనలకు హాజరైన నలుగురికి కరోనా పాజిటివ్. పాజిటివ్ కేసుల కాంటాక్ట్ ట్రేసింగ్ మొదలు పెట్టిన అధికారులు.
  • విజయనగరం : టివి9 సమచారంతో స్పందించిన విశాఖ రీజియన్ డిఐజి కాళిదాసు రంగారావు ఏపి చెన్నై బోర్డర్ అధికారులతో పాటు చైన్నై కి చెందిన పోలీస్ ఉన్నతాధికారులతో మాట్లాడిన డిఐజి విజయనగరం జిల్లాకు చెందిన వారికి మౌలిక సదుపాయాలు కల్పించాలని విన్నపం బాధితులతో మాట్లాడిన రంగారావు.
  • సూర్యాపేట: మోతె మండలం రాఘవ పురం,నామవరం గ్రామాల్లో దళిత కాలనిలో ఇంటి ఇంటికి తిరిగి కూరగాయలు పంపిణీ చేసిన ఎంపీపీ మీ ఆశా శ్రీకాంత్ రెడ్డి. పంచిన ఎంపీపీ ఆశశ్రీకాంత్ రెడ్డి, పాల్గొన్న సర్పంచ్ లు,ఆశా వర్కర్లు, పోలీస్ సిబ్బంది.
  • కరోనా మహమ్మారి ప్రభావం వివిధ రంగాలపై తీవ్రంగా పడింది. దీని బారి నుంచి ప్రజలను కాపాడటానికి ఇప్పటికే హీరోల నుంచి సినీ నిర్మాతల నుంచి , దర్శకుల నుంచి విరాళాలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. ఈ సంక్షోభం నుంచి సినిమా రంగాన్ని బయటపడేయటానికి సినీ ప్రముఖులు కంకణం కట్టుకున్నారు.
  • తెలంగాణలో లాక్‌డౌన్‌ ఉన్నా కొంతమంది ఖాతరు చేయడం లేదు. అడ్డదారుల్లో రాష్ట్ర సరిహద్దులు దాటేందుకు ప్రయత్నిస్తున్నారు. కంటైనర్‌లో వందల మంది ఇతర రాష్ట్రాలకు వెళ్లే ప్రయత్నం చేయగా.. పోలీసులు అడ్డుకున్నారు.
  • కరోనా పిశాచి అంతకంతకూ కోరలు చాస్తూ విలయతాండవం చేస్తోంది.. అగ్రరాజ్యం అమెరికా సైతం కరోనా మహమ్మారికి అడ్డుకట్ట వేయలేకపోతోంది. అక్కడ ఒక్కరోజే 18 వేల కొత్త కేసులు నమోదయ్యాయి.

సంక్రాంతి పోరు.. విజయావకాశాలు ఎవరికి ఎక్కువంటే..!

Sankranthi Race: Who will win, సంక్రాంతి పోరు.. విజయావకాశాలు ఎవరికి ఎక్కువంటే..!

2020 సంక్రాంతి పోరుకు టాలీవుడ్ హీరోలు సిద్ధమయ్యారు. ఇప్పటికే టాప్ హీరోలైన మహేష్ బాబు, అల్లు అర్జున్‌లు సంక్రాంతి బెర్త్‌ను ఖరారు చేసుకోగా.. లైన్‌లో వెంకటేష్-నాగ చైతన్య, కల్యాణ్‌రామ్‌లు కూడా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో మహేష్ బాబు నటిస్తోన్న సరిలేరు నీకెవ్వరు జనవరి 12న విడుదల కానుండగా.. అదే రోజున త్రివిక్రమ్ దర్శకత్వంలో బన్నీ నటిస్తోన్న అల వైకుంఠపురంలో కూడా రానుంది. ఇక సతీష్ వేగెష్న దర్శకత్వంలో కల్యాణ్ రామ్‌ నటించిన ఎంత మంచి వాడవురా కూడా జనవరి 12నే రాబోతున్నట్లు తెలుస్తోంది. వీరితో పాటు రియల్ మేనమామ అల్లుళ్లు అయిన వెంకటేష్- నాగచైతన్యలు కలిసి నటిస్తున్న వెంకీ మామ కూడా జనవరి 11న లేదా 14న వచ్చే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. దీన్ని బట్టి చూస్తుంటే ఈ సారి కూడా సంక్రాంతికి బాక్సాఫీస్ వద్ద పోరు గట్టిగా ఉండబోతున్నట్లు అర్థమవుతోంది. అయితే ఇప్పుడు ఏయే సినిమాకు విజయావకాశాలు ఎక్కువున్నాయో ఓ సారి చూసుకుంటే..

సరిలేరు నీకెవ్వరు: మహేష్ బాబుకు జనవరి సెంటిమెంట్ చాలా ఎక్కువ. ఆయన నటించిన ‘టక్కరి దొంగ’, ‘ఒక్కడు’, ‘బిజినెస్ మ్యాన్’, ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’, ‘నేనొక్కడినే’ చిత్రాలు సంక్రాంతి సీజన్‌లోనే విడుదలయ్యాయి. ఇందులో ‘టక్కరి దొంగ’, ‘నేనొక్కడినే'(కేవలం క్రిటిక్స్ హిట్.. కమర్షియల్ హిట్ కాదు) మినహా మిగిలిన చిత్రాలన్నీ బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందించాయి. మరోవైపు ఈ మూవీ నిర్మాతల్లో ఒకరైన దిల్ రాజుకు సంక్రాంతి సెంటిమెంట్ చాలా ఎక్కువ. ఆయన నిర్మించిన ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’, ‘ఎఫ్ 2’, ‘శతమానం భవతి’, ‘ఎవడు’ చిత్రాలు సంక్రాంతికే విడుదలయ్యాయి. ఈ చిత్రాలన్నీ ఆయనకు సక్సెస్‌ను ఇచ్చాయి. ఇక దర్శకుడు అనిల్ రావిపూడి(ఎఫ్ 2 మూవీ) కూడా ఈ ఏడాది సంక్రాంతికి విన్నర్‌గా నిలిచాడు. ఈ లెక్కన వీరందరికీ సంక్రాంతికి అచ్చి రాగా.. ఇప్పుడు సరిలేరు నీకెవ్వరు కూడా విజయం సాధిస్తుందని వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

అల వైకుంఠపురంలో: అల్లు అర్జున్ ఇప్పటి వరకు సంక్రాంతి బరిలో పోటీ పడిన సందర్భాలు చాలా తక్కువ. ఆయన నటించిన ‘దేశ ముదురు’, ‘ఎవడు'(అతిథి పాత్ర అయినప్పటికీ) మాత్రమే సంక్రాంతి సీజన్‌లో విడుదలయ్యాయి. ఈ రెండు పెద్ద విజయాన్ని సాధించాయి. ఇక త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కించిన చిత్రాల్లో ‘అఙ్ఞ్యాతవాసి’ మాత్రమే సంక్రాంతికి విడుదల కాగా.. ఇది పెద్ద పరాజయంగా నిలిచింది. కానీ త్రివిక్రమ్, అల్లు అర్జున్ కాంబినేషన్‌కు ఓ సెంటిమెంట్ ఉంది. వీరిద్దరి కాంబోలో ఇది వరకు తెరకెక్కిన రెండు సినిమాలు(జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి) హిట్ అయ్యాయి. ఈ క్రమంలో సంక్రాంతికి వస్తోన్న ‘అల వైకుంఠపురంలో’ మూవీ హిట్‌‌కు అవకాశాలు బాగానే కనిపిస్తున్నాయి.

వెంకీ మామ: ‘వెంకీ మామ’ విడుదల అధికారికంగా ప్రకటించనప్పటికీ.. ఒకవేళ సంక్రాంతి బరిలో ఉన్నట్లైతే ఈ మూవీకి వెంకటేష్ సెంటిమెంట్ కలిసి రావొచ్చని కొందరు భావిస్తున్నారు. ఎందుకంటే వెంకటేష్ నటించిన ‘రక్త తిలకం’, ‘ప్రేమ’, ‘చంటి’, ‘పోకిరి రాజా'(యావరేజ్), ‘ధర్మ చక్రం’, ‘కలిసుందాం రా’, ‘దేవీ పుత్రుడు'(ఫ్లాప్), ‘లక్ష్మీ’, ‘నమో వేంకటేశ’, ‘బాడీ గార్డ్’, ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’, ‘గోపాల గోపాల’, ‘ఎఫ్ 2’ చిత్రాలు సంక్రాంతి సీజన్‌లో విడుదలయ్యాయి. ఇందులో రెండు, మూడు మినహా మిగిలినవన్నీ పెద్ద విజయాలుగా నిలిచాయి. అంతేకాదు వెంకీ నటించిన మల్టీస్టారర్ చిత్రాలు(సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, గోపాల గోపాల, ఎఫ్ 2) చిత్రాలు కూడా సంక్రాంతికి వచ్చి విజయాన్ని సాధించినవే. దీంతో ఇప్పుడు వెంకీ మామ కూడా సెంటిమెంట్లు కలిసొచ్చి హిట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే నాగ చైతన్య మాత్రం ఇంతవరకు సంక్రాంతి సీజన్‌లో రాకపోవడం గమనర్హం.

ఎంత మంచివాడవురా: సతీష్ వేగెష్న దర్శకత్వంలో కల్యాణ్ రామ్ నటించిన ఎంత మంచివాడవురా కూడా సంక్రాంతికి విడుదలయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే కల్యాణ్ రామ్ ఇంతవరకు నటించిన ఏ చిత్రం సంక్రాంతి బరిలో నిలవకపోగా.. సతీష్ వేగెష్నకు మాత్రం ఆ పండుగ సెంటిమెంట్ ఉంది. ఆయన దర్శకత్వంలో మొదట తెరకెక్కిన ‘శతమానం భవతి’ 2016 సంక్రాంతి విన్నర్‌గా నిలవడంతో పాటు జాతీయ అవార్డును కూడా సొంతం చేసుకుంది. ఇప్పుడు అదే సెంటిమెంట్‌తో ఆయన సంక్రాంతి బరిలోకి దిగబోతున్నట్లు అర్థమవుతోంది. ఇక మొత్తానికి చూసుకుంటే వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో దిగుతున్న ప్రతి ఒక్కరికి ఏదో రకంగా హిట్ సెంటిమెంట్ ఉంది. దీంతో అన్ని మూవీల విజయాలు ఖాయంగా కనిపిస్తున్నాయి. ఇక సెంటిమెంట్లను పక్కనపెడితే ఇప్పుడు టాలీవుడ్ ప్రేక్షకులు మారిపోయారు. మూస కథలపై పెద్దగా ఆసక్తి చూపడం లేదు. చూడాలి మరి వచ్చే ఏడాది సంక్రాంతికి  ఎవరు ప్రేక్షకులను మెప్పించి విన్నర్‌గా నిలుస్తారో.

Related Tags