Breaking News
  • ఏడు నెలల పాలనలో జగన్‌ విఫల నాయకుడిగా పేరుపొందారు. ప్రతిపక్ష నేతను అసెంబ్లీలోకి రాకుండా అడ్డుకోవడం ఎన్నడూ చూడలేదు. ఉద్యోగ సంఘాలు కూడా చంద్రబాబు మాటలను వక్రీకరించడం బాధాకరం. చౌకబారు రాజకీయాలు సరికాదు-నక్కా ఆనందబాబు.
  • ప్రకాశం: ఒంగోలులో సీపీఎస్‌ ఎంప్లాయిస్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో మనోవేదన నిరసన ర్యాలీ, పాల్గొన్న కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల ప్రభుత్వ ఉద్యోగులు.
  • కృష్ణాజిల్లా: కీసర టోల్‌ప్లాజా దగ్గర పనిచేయని ఫాస్టాగ్‌. ఇబ్బందులు పడుతున్న వాహనదారులు. రెండు క్యాష్‌ కౌంటర్ల ద్వారా టోల్‌ వసూలు చేస్తున్న సిబ్బంది.
  • చిత్తూరు టూటౌన్‌ పీఎస్‌ దగ్గర ఉద్రిక్తత. ఆత్మహత్య చేసుకున్న ఫాతిమా మృతదేహంతో తల్లిదండ్రుల ధర్నా. నిందితుడిని తప్పించేందుకు పోలీసులు యత్నిస్తున్నారని ఆరోపణ. పోలీస్‌స్టేషన్‌ ఎదుట ఫాతిమా మృతదేహంతో తల్లిదండ్రుల ఆందోళన.
  • చెన్నై వన్డేలో టాస్‌గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకున్న విండీస్‌. భారత్‌-విండీస్‌ మధ్య తొలివన్డే.
  • తిరుమల: ధనుర్మాసం సందర్భంగా ఈ నెల 17 నుంచి జనవరి 14 వరకు శ్రీవారి సుప్రభాత సేవ రద్దు.
  • విశాఖ: హుకుంపేట మండలం రంగశీలలో కాల్పులు. రైతుభరోసా నగదు కోసం అన్నదమ్ముల మధ్య వివాదం తనవాటా డబ్బులు అడిగిన తమ్ముడు జయరాం, భార్య కొండమ్మపై నాటు తుపాకీతో కాల్పులు జరిపిన అన్న కృష్ణ. తమ్ముడి భార్య కొండమ్మ చేతిలోకి దూసుకెళ్లిన బుల్లెట్. కొండమ్మను చికిత్స నిమిత్తం కేజీహెచ్‌కు తరలింపు. కాల్పులు జరిపి సమీప కొండల్లోకి పారిపోయిన కృష్ణ.

ఆర్థిక రంగాన్ని ఎవరు కాపాడతారు?: శతృఘ్న సిన్హా

స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగానికి గానూ ప్రధాని నరేంద్ర మోదీని ప్రశంసించి పది రోజులు గడవక ముందే కేంద్రంపై కాంగ్రెస్‌ నేత శతృఘ్న సిన్హా విమర్శల వర్షం కురిపించారు. దేశ ఆర్థిక పరిస్థితిపై ఆయన వరుస ట్వీట్లు చేశారు. ప్రస్తుతం ఏ ప్రసంగం విన్నా దేశ ఆర్థిక మందగమనం గురించే ఉందని అన్నారు.

‘సర్‌..ప్రస్తుతం ప్రతి ఒక్కరూ దేశ ఆర్థిక స్థితిపైనే మాట్లాడుతున్నారు. మనం దీని గురించి ఆలోచించలేమా? ఆర్థిక సంస్థలు, మార్కెట్లు ఊగిసలాడుతున్నాయి. ప్రైవేటు సెక్టార్ పరిస్థితి కూడా ఇలాగే ఉంది. ఇప్పుడు మీరు దీనిపై చర్యలు తీసుకోగలిగితే భవిష్యత్తులో ఈ తీవ్రత తగ్గుతుంది. లేకపోతే వ్యవసాయం నుంచి ఆటోమొబైల్స్‌ వరకు, సబ్బుల నుంచి షాంపూల వరకు, వస్త్రాల నుంచి బిస్కెట్ల వరకు అన్నింటిపైనా వీటి ప్రభావం ఉంటుంది. ఉత్పత్తి తగ్గిపోతుంది. పౌర విమానయానం, ఆటోమొబైల్‌, నాన్‌ బ్యాంకింగ్‌ సర్వీసులు, నిత్యావసరాల పరిశ్రమలు తీవ్రంగా నష్టపోతాయి’

‘ఈ స్థితి వల్ల 45ఏళ్లలో ఎప్పుడూ లేని విధంగా నిరుద్యోగిత 6% పెరుగుతుంది. ఫలితంగా 30 మిలియన్ల మంది నిరుద్యోగులవుతారు. మునుపెన్నడూ లేని విధంగా విమానయాన రంగం సంక్షోభంలో కొట్టు మిట్టాడుతోంది. ఈ పరిస్థితికి కారణం ఏమిటి? నోట్ల రద్దా? జీఎస్టీయా?విధానాలా?. ఆర్థిక రంగాన్ని ఎవరు కాపాడతారు?. మీరు ఈ అంశాల్లో సరైన సంస్కరణలు తీసుకొస్తే అందుకు మా సాయం ఎప్పుడూ ఉంటుంది’ అని ట్వీట్లు చేశారు.