జయ బయోపిక్‌లో.. ‘శోభన్ బాబు’ ఉంటారా..?

సినిమా గురించి ఏదో ఒక హాట్‌ టాపిక్ లేకపోతే జనాలు సినిమా చూడటానికి ఎందుకు వస్తారు అంతేకదా..! ప్రస్తుతం దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితపై రెండు బయోపిక్‌లు తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఒకటి.. కంగనా ప్రధాన పాత్రధారురాలిగా ఏఎల్ విజయ్ తెరకెక్కిస్తుండగా.. మరొకటి డైరెక్టర్ ప్రియదర్శి ‘ది ఐరన్ లేడీ’ పేరుతో బయోపిక్ రూపొందిస్తున్నారు. ఇందులో నిత్యామీనన్ అమ్మ జయలలిత పాత్ర పోషిస్తోంది. ‘ది ఐరన్ లేడీ’ సినిమాలో బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో […]

జయ బయోపిక్‌లో.. 'శోభన్ బాబు' ఉంటారా..?
Follow us

| Edited By:

Updated on: Nov 03, 2019 | 10:10 AM

సినిమా గురించి ఏదో ఒక హాట్‌ టాపిక్ లేకపోతే జనాలు సినిమా చూడటానికి ఎందుకు వస్తారు అంతేకదా..! ప్రస్తుతం దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితపై రెండు బయోపిక్‌లు తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఒకటి.. కంగనా ప్రధాన పాత్రధారురాలిగా ఏఎల్ విజయ్ తెరకెక్కిస్తుండగా.. మరొకటి డైరెక్టర్ ప్రియదర్శి ‘ది ఐరన్ లేడీ’ పేరుతో బయోపిక్ రూపొందిస్తున్నారు. ఇందులో నిత్యామీనన్ అమ్మ జయలలిత పాత్ర పోషిస్తోంది.

‘ది ఐరన్ లేడీ’ సినిమాలో బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో నటిస్తోంది. ఈ సినిమాకి ఏఎల్ విజయ్ దర్మకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమాలో.. శోభన్ బాబు పాత్ర గురించి చర్చ ప్రారంభమయ్యింది. అప్పట్లో.. శోభన్ బాబు, జయల మధ్య ప్రేమాయణం నడించదని టాక్ ఉంది. మరి అది నిజమో.. అబద్ధమో తెలీదు కానీ.. వారిద్దరి గురించి గతంలో కథలు కథలుగా వార్తలు వచ్చాయి. వారు కలిసి చేసింది ఒక్క సినిమా అయినా.. ఇద్దరూ ఎంతో దగ్గరయ్యారని టాక్. అంతేకాకుండా.. వారి మధ్య అనుబంధాన్ని తెలియజేస్తూ.. కొన్ని ఫొటోలు కూడా.. సోషల్‌ మీడియాలో హల్‌చల్ అవుతున్నాయి.

అయితే.. ఇప్పుడు.. డైరెక్టర్ ఏఎల్‌ విజయ్‌కి వచ్చిన చిక్కేంటంటే.. ‘శోభన్ బాబు పాత్రను’ సినిమాలో చూపిస్తారా..? లేదా..? అన్నది కీలకంగా మారింది. ఒకవేళ వీరి ప్రేమ కథ గురించి సినిమాలో చూపిస్తే… జయ లలిత అభిమానులు.. ఆగ్రహం వ్యక్తం చేసే అవకాశం ఉంది. పోనీ.. శోభన్ బాబు పాత్ర తీసేద్దామంటే.. కథలో వాస్తవికత దెబ్బతింటుంది. బయోపిక్‌ అంటే.. అన్ని ఉండాలి కదా. దీంతో.. డైరెక్టర్ ఏఎల్ విజయ్ తలపట్టుకున్నారట. అయితే.. జయ బయోపిక్‌లో శోభన్ బాబు పాత్రను.. ఓ అతిథి పాత్రలా చూపిద్దామని ప్లాన్ చేస్తున్నారట. అయితే.. ఆ అందాల నటుడు శోభన్ బాబు పాత్రలో ఎవరు నటించబోతున్నారనేది ఆసక్తిగా మారింది.