కేంద్రంలో చక్రం తిప్పే ‘చంద్రుడు’ ఎవరు..?

ఎన్నికల ఫలితాలు రానున్న మే 23వ తేదికి కౌంట్‌డౌన్ దగ్గరపడుతున్న కొద్దీ.. కేంద్రంలో కొత్త ప్రభుత్వంపై అంచనాలు పెరిగిపోతున్నాయి. గత ఎన్నికల్లో 282 సీట్లు సాధించిన బీజేపీ, ఈ సారి అంతకుమించి అనే డైలాగ్ కొడుతోంది. కానీ హిందీ బెల్ట్‌లో బీజేపీకి వ్యతిరేకత పెరిగిందనే వార్తలు వస్తున్నాయి. మోదీ మాత్రం సుస్థిర ప్రభుత్వం బీజేపీతోనే సాధ్యమని మరీ మరీ ధీమా వ్యక్తం చేస్తున్నారు.

ఇదిలా ఉంటే మోదీకి ఓ వైపు ఏపీ సీఎం చంద్రబాబు, మరోవైపు తెలంగాణ సీఎం కేసీఆర్ తమదైన శైలిలో సవాళ్లు విసురుతున్నారు. కాంగ్రెసేతర, బీజేపీయేతర పార్టీలతో ఫెడరల్ ఫ్రంట్‌ను ఏర్పాటు చేయాలన్న ప్రయత్నంలో ఉన్న కేసీఆర్ ఇప్పటికే నవీన్ పట్నాయక్, దేవెగౌడ, పినరయి విజయన్ వంటి నేతలను కలుసుకొని మరికొందరితో టచ్‌లో ఉన్నారు. కేంద్రంలో ఏర్పడే  కొత్త ప్రభుత్వంలో ప్రాంతీయ పార్టీలే కీలకపాత్ర పోషిస్తాయని కేసీఆర్‌తో భేటీ తరువాత కేరళ సీఎం విజయన్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీతో చేతులు కలిపిన చంద్రబాబు.. కేంద్రంలో కొత్త ప్రధాని అభ్యర్థి ఎవరన్న విషయమై ఇప్పుడే చెప్పబోమంటూ దాగుడుమూతలాడుతున్నారు.

కాగా భారీ విజయాల తరువాత అంతే దారుణంగా పరాభవాలు వస్తాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇందిరా గాంధీ 1971లో, రాజీవ్ గాంధీ 1984లో భారీ విజయాలు సాధించి ఆ తరువాత ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయారు. 2014లో 282 సీట్లు సాధించిన మోదీకి కూడా అలాంటి పరాజయం తప్పదని కొందరి అంచనా. హిందీ బెల్డ్‌లో నష్టమొస్తే ఈశాన్య రాష్ట్రాలు, బెంగాల్, ఒడిశాల్లో వాటిని భర్తీ చేయాలని బీజేపీ గట్టి పట్టుదలతో ఉంది. ఆ లెక్కన బీజేపీకి 180, ఆపైచిలుకు సీట్లు రావొచ్చని ఓ లెక్క. అప్పుడు బీజేపీతో కలిసి వచ్చేదెవరు అన్నది కీలకం. ఒకవేళ కాంగ్రెస్ హాట్‌సీట్లో కూర్చోవాలన్న కనీసం 140సీట్లు రావాలి. కానీ 100 వచ్చినా, 120 వచ్చినా ఇతరులకు మద్దతు ఇవ్వాల్సిందే. ఈ పరిస్థితుల్లో తమ ప్రాంతీయ పార్టీల తరపున చంద్రబాబు, కేసీఆర్ కీలక పాత్రలు పోషించే అవకాశం ఉంది. అయితే ఈ ఇద్దరు నాయకుల వెంట ఎన్ని పార్టీలు వస్తాయి..? డ్రైవర్ సీట్లో కూర్చొనేది బీజేపీనా, కాంగ్రెస్సా..? లేక ప్రాంతీయ పార్టీల కూటమా..? అన్న సందేహాలు పెరిగిపోతున్నాయి. మొత్తం మీద ప్రాంతీయ పార్టీల కూటమి అధికారంలోకి వస్తే సుస్థిర ప్రభుత్వం ఉండదన్న మోదీ విమర్శలకు ఈ పార్టీలు కౌంటర్ ఇవ్వగలుగుతాయా..? అన్నదే అసలు పాయింట్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *