కడపలో ‘ మీసం ‘ మెలేసే రాజకీయయోధుడెవరో..?

ఏపీ ఎన్నికల పోరులో ఎన్నో సందేహాలు..ఎన్నో మలుపులు..ఒక్కో జిల్లాలో ఒక్కోపొలిటికల్ హై డ్రామా ! రాయలసీమలో వైసీపీ అధినేత జగన్ కంచుకోట కడప జిల్లా విషయానికే వస్తే..ప్రధానంగా ముగ్గురు నేతల భవితవ్యాన్ని ఈ ఎన్నికలు తేల్చనున్నాయి.  జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి, బద్వేల్ ఎమ్మెల్యే జయరాములు, రాజంపేట నేత  మల్లికార్జునరెడ్డి లకు కంటి నిండా నిద్ర పట్టడంలేదు. వీరి  రాజకీయ భవిష్యత్ ఎలా ఉంటుందో ఈ నెల 23 న తేలిపోనుంది.  ప్రధాన పార్టీలు మారిన వీరిని ఓటర్లు కరుణిస్తారా .. అక్కున చేర్చుకుంటారా మరో వారంలో తెలిసిపోతుంది. ఓ సారి టీడీపీ, ఆ తరువాత వైసీపీ..లేదా బీజేపీ.. ఇలా..  పార్టీలు మారడం వీరికి కలిసి వస్తుందా ? ఓ పార్టీ గుర్తుపై గెలిచి.. ఆ తరువాత మరో పార్టీలో చేరిన ఈ నేతలు గెలుపు తమదంటే తమదని ధీమా వ్యక్తం చేసుకుంటూ విస్తృత ప్రచారం చేశారు. వీరి గెలుపోటములు జిల్లాలో ఆయా పార్టీల బలాబలాలను తేల్చనున్నాయి కూడా.. వీళ్ళలో  ఎవరు ‘ మీసం ‘ మెలేస్తారో మరి ?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *