టీడీఎల్పీ నేతగా చంద్రబాబా..? మరొకరా..?

సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత తొలిసారి టీడీఎల్పీ భేటీ అవుతోంది. చంద్రబాబు అధ్యక్షతన ఇవాళ జరుగుతున్న ఈ భేటీలో టీడీపీఎల్పీ నేత ఎవరు అనేది తేలనుంది. పార్టీ శాసనసభా పక్ష నేతగా చంద్రబాబును ఎన్నుకుంటారా..? లేక వేరే వారికి అవకాశం కల్పిస్తారా..? అనేది తేలిపోతుంది. అంతేకాకుండా ఎన్నికల్లో ఓటమికి గల కారణాలు ఏంటనేది ఈ సమావేశంలో కూలంకషంగా చర్చించనున్నారు. అయితే.. సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ పరాజయం చవిచూసింది. కేవలం 23 స్థానాల్లో మాత్రమే గెలిచింది. సాధారణంగా శాసనసభా పక్షనేతగా చంద్రబాబే కొనసాగుతారు. కానీ.. ఈసారి ఫలితాలు తేడాగా రావడంతో ఆయనను తిరిగి ఈ పదవిలో ఎన్నుకుంటారా..? లేక ఇతరులకు ఎవరికైనా అవకాశం ఇస్తారా..? అన్నది తేలాల్సి ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *