తెలుగు ‘బిగ్ బాస్’లో… హయ్యెస్ట్ రెమ్యునరేషన్ అందుకున్న ఆ ముగ్గురెవరు?

Highest Remunerations In Bigg Boss Telugu, తెలుగు ‘బిగ్ బాస్’లో… హయ్యెస్ట్ రెమ్యునరేషన్ అందుకున్న ఆ ముగ్గురెవరు?

‘బిగ్ బాస్’.. వివాదాలు ఎన్ని ఉన్నా ఈ షోకి ప్రేక్షకాదరణ మాత్రం అంతకంతకూ పెరుగుతూనే ఉంది. 2006వ సంవత్సరంలో హిందీలో ఆరంభమైన ఈ రియాలిటీ షో ఫ్రాంచైజీ.. 2018కి కన్నడ, మలయాళీ, తెలుగు, తమిళ, మరాఠీ, బెంగాలీ భాషల్లో కూడా ఫేమస్ కావడం విశేషం. ఇకపోతే తెలుగులో జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్‌గా జూలై 17 2017లో ‘బిగ్ బాస్’ మొదటి సీజన్ మొదలవగా.. వారాలు గడుస్తున్న కొద్దీ ప్రేక్షకాదరణ పొందుతూ హైయెస్ట్ టీఆర్పీ రేటింగ్స్‌తో దూసుకుపోయింది. ఆ తర్వాత నాని హోస్ట్‌గా సాగిన రెండో సీజన్ కూడా మంచి వ్యూస్ రాబట్టుకుంది. మరోవైపు ఈ సీజన్‌లో కంటెస్టెంట్ కౌశల్ మందా గెలవడానికి ‘కౌశల్ ఆర్మీ’ బిగ్ బాస్ ఓటింగ్ సిస్టంను శాసించిందని చెప్పవచ్చు.

ఇది ఇలా ఉండగా తాజాగా అక్కినేని నాగార్జున పర్యవేక్షణలో మూడో సీజన్ ప్రారంభమైంది. రెండో సీజన్‌లో జరిగిన తప్పిదాలు పునరావృతం కాకుండా షో నిర్వాహకులు జాగ్రత్త పడగా.. ప్రస్తుతం మంచి టీఆర్పీ రేటింగ్స్‌తో ప్రేక్షకులకు వినోదం పంచుతోంది. కాగా ఈ తెలుగు బిగ్ బాస్ చరిత్రలో ముగ్గురు కంటెస్టెంట్లు భారీ పారితోషికం అందుకున్నట్లు తెలుస్తోంది. సీజన్ 1‌లో పాల్గొన్న నటుడు సమీర్ వారానికి 10 లక్షలు అందుకోగా.. సీజన్ 3లో హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చి మొదటి వారంలోనే ఎగ్జిట్ అయిన నటి హేమ వారానికి 9.7 లక్షలు అందుకున్నట్లు సమాచారం. వీరితో పాటు ప్రస్తుతం హౌస్‌లో ఉన్న యాంకర్ శ్రీముఖి 100 రోజులకు 3 కోట్లు పారితోషికం పుచ్చుకుందని తెలుస్తోంది. ఇప్పటివరకు తెలుగు బిగ్ బాస్‌లో వీరికే అత్యధిక పారితోషికం అందినట్లు ఇన్‌‌సైడ్ టాక్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *