Breaking News
 • ఆర్టీసీ కార్మికుల ఆత్మహత్యలపై కౌంటర్‌ దాఖలు చేసిన ప్రభుత్వం. నిరాధార ఆరోపణలతో ప్రభుత్వంపై నిందలు వేస్తున్నారు. ఆత్మహత్యలకు కారణాలను దర్యాప్తు సంస్థలు తేల్చాల్సి ఉంది. చట్టప్రకారం చర్యలు చేపట్టాలని కార్మికశాఖ కమిషనర్‌ను ఇప్పటికే హైకోర్టు ఆదేశించిందన్న సీఎస్‌. కార్మికుల జీతాలు సహా ఇతర డిమాండ్లపై కార్మికశాఖ కమిషనర్‌ తగిన చర్యలు తీసుకుంటారన్న సీఎస్‌.
 • ఏపీ బ్యాడ్మింటన్‌ అసోసియేషన్‌లో భారీగా నిధుల దుర్వినియోగం. మాజీ సెక్రటరీ చౌదరి సహా కొందరు సభ్యులపై కేసు నమోదు. నిధులు దుర్వినియోగం అయినట్టు రుజువుకావడంతో పున్నయ్య చౌదరిని అరెస్ట్‌చేసిన పోలీసులు.
 • విజయవాడ: సీఎం జగన్‌ పాలనతో సహకారం రంగం విరాజిల్లుతోంది. 2004లో స్వర్గీయ వైఎస్‌ఆర్‌ కోఆపరేటివ్‌ వ్యవస్థను బలోపేతం చేశారు. సహకారం రంగాన్ని టీడీపీ ప్రభుత్వం కుదేలు చేసింది. ఉద్యోగుల సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వం అండగా ఉంటుంది. రాజకీయ నాయకుల లాగా ఉద్యోగులు యూనియన్లు మారొద్దు-మంత్రి పేర్ని నాని. సహకార వ్యవస్థను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. రైతులకు అన్ని విధాలుగా సహకరించి రుణాలు అందించాలి-మంత్రి వెల్లంపల్లి
 • సిద్దిపేట: హుస్నాబాద్‌లో మోడల్‌ స్కూల్‌ను తనిఖీ చేసిన హరీష్‌రావు. చన్నీళ్లతో స్నానం చేస్తున్నామని మంత్రికి విన్నవించిన విద్యార్థులు. వాటర్‌ హీటర్‌ను వెంటనే రిపేర్‌ చేయించాలని ప్రిన్సిపాల్‌కు ఆదేశం. పిల్లలకు త్వరలో దుప్పట్లు పంపిణీ చేస్తానని హామీ.
 • తిరుపతి: కేరళ నుంచి సికింద్రాబాద్‌ వెళ్లే రైలులో నీటి కొరత. ఫిర్యాదు చేసినా పట్టించుకోని అధికారులు. నరక యాతన పడుతున్న అయ్యప్ప భక్తులు, ప్రయాణికులు. రైలును రేణిగుంట స్టేషన్‌లో ఆపేసిన ప్రయాణికులు.
 • మున్సిపల్‌ ఎన్నికలపై హైకోర్టులో కౌంటర్‌ దాఖలు చేసిన ప్రభుత్వం. పిటిషన్లన్నీ కొట్టివేయాలని సింగిల్‌ జడ్జిని కోరిన ప్రభుత్వం. పిటిషన్లపై ఇప్పటికే ధర్మాసనం విచారణ జరిపిందన్న ప్రభుత్వం. ప్రజా ప్రయోజన పిటిషన్లను ఇప్పటికే ధర్మాసనం కొట్టివేసిందన్న ప్రభుత్వం.
 • గుంటూరు: ఎస్పీ విజయరావుకు జనసేన ఫిర్యాదు. జనసేన కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతున్నారని ఫిర్యాదు. వాస్తవాలు పరిశీలించి న్యాయం చేయాలని విజ్ఞప్తి. ధర్మవరం ఘటనపై పూర్తి విచారణ చేపడతాం-ఎస్పీ విజయరావు. పోలీసులపై దాడి చేసిన వారిపైనే చర్యలు తీసుకుంటాం. అనవసర వివాదాలకు గ్రామస్తులు దూరంగా ఉండాలి-ఎస్పీ విజయరావు.
 • తూ.గో: అంతర్వేది బీచ్‌లో చోరీ. కారులో నుంచి బంగారు నగలు ఎత్తుకెళ్లిన దుండగులు. నగల విలువ రూ.3 లక్షలు ఉంటుందన్న బాధితులు. పీఎస్‌లో ఫిర్యాదు చేసిన బాధితుడు సూర్యనారాయణ.

కల్కి భగవాన్ విష్ణుమూర్తి అవతారమా? ఆశ్రమంలో ఐటీ దాడులేంటీ?

who is Kalki Bhagwan a self styled godman, కల్కి భగవాన్ విష్ణుమూర్తి అవతారమా? ఆశ్రమంలో ఐటీ దాడులేంటీ?

విజయకుమార్‌నాయుడు.. ఆస్తులపై ఐటీ శాఖ దాడులు కొనసాగుతూనే ఉన్నాయి.. ఎవరీ విజయ్ కుమార్‌నాయుడు? బహుషా ఈ పేరు చెబితే ఎవరికీ తెలియకపోవచ్చు. కానీ కల్కి భగవాన్ అంటే మాత్రం ఠక్కున ఓ రూపం కళ్లముందు ప్రత్యక్షమవుతుంది. రెండు దశాబ్దాలుగా కల్కి భగవాన్ పేరుతో తనకు తాను దైవంతో పోల్చుకుని వేలకోట్ల సామ్రాజ్యానికి అధిపతిగా కొనసాగుతున్న వ్యక్తి కల్కి భగవాన్. భక్తి ముసుగులో సాగిస్తున్న అక్రమ వ్యాపారాల గుట్టు ఒక్కక్కటిగా వెలుగు చూస్తుంటే.. ఇంతకాలం తాము దైవంగా కొలిచిన వ్యక్తి చీకటి రహస్యాలు తెలిసి భక్తులు ముక్కున వేలేసుకుంటున్నారు. ఇప్పటికే ఈ భగవానుని పుత్రుడు, కోడల్ని సైతం అరెస్టు చేసి రహస్యంగా కూపీ లాగుతున్నారు.

who is Kalki Bhagwan a self styled godman, కల్కి భగవాన్ విష్ణుమూర్తి అవతారమా? ఆశ్రమంలో ఐటీ దాడులేంటీ?

ఎవరీ కల్కి భగవాన్ ?

విజయకుమార్ రెండు దశాబ్దాల క్రితం ఓ ఇన్యూరెన్స్ కంపెనీలో సాధారణ క్లర్క్‌గా జీవితాన్ని ప్రారంభించాడు. ఆ తర్వాత ఆ ఉద్యోగాన్ని వదిలేసి జీవాశ్రమం పేరుతో కుప్పం నియోజకవర్గంలోని రామకుప్పంలో ఓ కాన్వెంట్ స్కూల్ స్ధాపించాడు. అది కాస్తా దివాళా తీసింది. ఆ తర్వాత కొంతకాలం విజయ్ కుమార్ ఎవరికీ కనిపించలేదు. కొన్ని సంవత్సరాల తర్వాత తాను దైవాంశ సంభూతునిగా, విష్ణుమూర్తి ఆఖరి అవతారం కల్కి భగవానుడిగా ప్రకటించుకున్నాడు. ఇతనికి మరో స్నేహితుడు తోడై విజయ్ కుమార్‌కు సంబంధించిన భక్తి వ్యాపారాన్ని వృద్ధికి ఎంతో సేవ చేశాడు. ఈ ముఖ్య స్నేహితుడే విజయ్ కుమార్‌ను కల్కి భగవాన్ అవతారంగా తారాస్థాయిలో ప్రచారం కల్పించాడు. దీంతో ఇతనికి తిరుగులేకుండా పోయింది. ముఖ్యంగా వ్యాపారమే తమ కులవృత్తిగా కొనసాగించే ఒక సామాజిక వర్గాన్ని టార్గెట్ చేసుకుని కల్కిభగవాన్ చేసిన మాయలు, లీలలు అన్నీ ఇన్నీకావనే విమర్శ ఉంది.

who is Kalki Bhagwan a self styled godman, కల్కి భగవాన్ విష్ణుమూర్తి అవతారమా? ఆశ్రమంలో ఐటీ దాడులేంటీ?

కళ్లతో చూస్తే ఒక రేటు.. కాళ్లను తాకితే మరో రేటు..

కల్కి భగవాన్ ఆశ్రమం ఉన్న ప్రదేశం సత్యలోకం. ఇది గతంలో జీవాశ్రమం ఉన్న చోటే ఐదు ఎకరాల్లో నిర్మించాడు. ఇక్కడికి వెళ్లి భగవానుని దర్శనం చేసుకోవాలంటే అంత ఈజీ కాదు. స్వామి దర్శించుకోడానికి సాధారణ దర్శనానికి రూ. 5 వేలు, ప్రత్యేక దర్శనానికి రూ.25 వేలు చెల్లించాల్సిందే. ఇలా ఆయనను చూడాలంటే ఒక రేటు, కాళ్లను తాకాలంటే మరో రేటు వసూలు చేశారు. కల్కి ఆశ్రమాన్ని మొదట్లో గోల్డెన్ సిటీగా ఆ తర్వాత, ఏకం( వన్నెస్‌)గా పేరు మార్చారు. ఆశ్రమం వరదయ్యపాళెంలో ఉండగా.. కార్పొరేట్ ఆఫీస్ మాత్రం చెన్నైలో నిర్వహిస్తున్నారు. మొదట్లో కల్కి భగవాన్ ఒక తీరులో దర్శనమిచ్చేవారు. ఆ తర్వాత ఆయన తలపై ముసుగును తీసివేసి తన అసలు రూపంలో దర్శనమివ్వడం ప్రారంభించాడు. ఆమధ్య కొన్ని వివాదాలు చుట్టుముట్టడంతో తన భార్య పద్మావతిని కూడా రంగంలోకి దించాడు. ఆమె అమ్మా భగవాన్. వంటినిండా నగలతో దర్శనమిస్తుంది. కల్కి భగవాన్ కంటే అమ్మా భగవాన్ వెరీ పవర్‌ఫుల్ అనే మెసేజ్ భక్తులకు ఎక్కించారు. స్థానిక భక్తులతో పాటు కల్కి భగవాన్ పేరు ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలతో పాటు ఏకంగా విదేశాల్లో కూడా మారుమ్రోగిపోయింది. ఎక్కడ చూసినా కల్కి భగవాన్ పేరిట హోమాలు, యాగాలు, వీరిద్దరి ఫోటోలు పెట్టి ఊరేగింపులు సైతం నిర్వహించే భక్తజనం తయారయ్యారు. ఈ రకంగా కోట్లాది మంది భక్తులు.. వేల కోట్ల రూపాయల విరాళాలు కల్కి ఆశ్రమానికి వచ్చి పడ్డాయి. క్రల్కి భగవాన్ ఆశ్రమంలో కొంతమంది యువకులు, యువతులు అదృశ్యం కావడంపై కూడా ఎన్నో అనుమానాలున్నాయి.

who is Kalki Bhagwan a self styled godman, కల్కి భగవాన్ విష్ణుమూర్తి అవతారమా? ఆశ్రమంలో ఐటీ దాడులేంటీ?

విరాళాలతో వ్యాపారాలా? 

భక్తుల నుంచి సేకరించినవి, వసూలు చేసినవి కొన్ని వందల కోట్ల రూపాయలు. వీటితో అనేక వ్యాపారాలు నిర్వహిస్తున్నట్టు తేలింది. ఆశ్రమానికి సంబంధించిన నిధులను దారి మళ్లించి కల్కి భగవాన్ అలియాన్ విజయ్ కుమార్ కుమారుడు కృష్ణ నాయుడు, ఆయన భార్య ప్రీతి నాయుడు కలిసి అనేక సంస్ధల్లో పెట్టుబడులుపెట్టినట్టుగా ఐటీ అధికారుల విచారణలో తేలినట్టు సమాచారం. పెద్ద ఎత్తున విదేశీ కరెన్సీని కూడా స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం. ఇదిలా ఉంటే ఐటీ దాడుల నేపథ్యంలో కల్కి భగవాన్ ( విజయ్‌కుమార్), అమ్మా భగవాన్ ( పద్మావతి) ప్రస్తుతం పరారీలో ఉన్నట్టుగా తెలుస్తోంది.