Breaking News
  • దేశంలో కరోనా వైర‌స్ వీర‌విహారం చేస్తోంది. రోజురోజుకూ కేసులు సంఖ్య‌తో పాటు, మరణాల సంఖ్య కూడా ప్ర‌మాద‌క‌ర రీతిలో పెరుగుతోంది. కొత్తగా 24 వేల 850 మంది వైరస్​ సోకింది. మరో 613 మంది క‌రోనా కార‌ణంగా ప్రాణాలు విడిచారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజా వివ‌రాలు వెల్లడించింది. దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 6,73,165. ప్ర‌స్తుతం యాక్టీవ్ కేసులు2,44,814. వ్యాధి బారి నుంచి కోలుకున్న‌వారు 4,09,083. క‌రోనాతో మొత్తం ప్రాణాలు విడిచినవారి సంఖ్య 19,268.
  • కోవిడ్-19 వార్ రూమ్ ఏర్పాటు చేయనున్న ఢిల్లీ సర్కారు
  • మర్డర్ సినిమా దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పై కేసు నమోదు చేసిన మిర్యాలగూడ వన్టౌన్ పోలీసులు. వెంకటేశ్వరరావు డిఎస్పి మిర్యాలగూడ.
  • రేపటి నుండి తెరుచుకోనున్న హైదరాబాద్లోని పలు మార్కెట్లు. బేగంబజార్ ట్రూప్ బజార్,జనరల్ బజార్ మార్కెట్లు. కరోనా భయం తో స్వచ్చందంగా షాప్స్ మూసేసి షొప్స్ యజమానులు . 10 రోజుల తరువాత రెపటినుండి యధాతధంగా నడవనున్న మార్కెట్లు.
  • విశాఖ: డీజీపీ గౌతం సవాంగ్ కామెంట్స్ పోలీస్ రోడ్ పై నిలబడి సేవచేయాలంటే కుటుంబ సభ్యుల పాత్ర కూడా ఉంది కరోనా కష్టకాలంలో కుటుంబ సభ్యుల సహకారంతో పోలీసులు విధినిర్బహణలో ఉన్నారు లాక్ డౌన్ సమయంలో ఫారెన్ రిటర్నీస్ ను సమర్ధంగా కట్టడిచేయగలిగాం -కంటైన్మెంట్ స్ట్రాటజీ పక్కాగా అమలు చేయగలిగాం వైరస్ పై ఇంకా అవగాహన పెరగాలి.. అందరూ మాస్క్ ధరించాలని చెబుతున్నాం.. అవగాహన పెంచుతున్నాం
  • రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌తో ప్రధాని మోదీ భేటీ. లద్దాఖ్ పర్యటన నుంచి తిరిగొచ్చిన వెంటనే భేటీ. సరిహద్దు ఉద్రిక్తతలు, అంతర్జాతీయ మద్ధతు సహా పలు అంశాలపై చర్చ.

బిగ్‌బాస్‌-3 విన్నర్‌ను ప్రకటించబోయే.. ఆ స్టార్ హీరో ఎవరో తెలుసా..?

Who Is Going To Be The Guest For Bigg Boss 3 Grand Finale..?, బిగ్‌బాస్‌-3 విన్నర్‌ను ప్రకటించబోయే.. ఆ స్టార్ హీరో ఎవరో తెలుసా..?

తెలుగు టీవీ ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న బిగ్ బాస్ సీజన్ 3 రియాల్టీ షో.. ఇక చివరి దశకు చేరుకుంది. ఈ వారంతోనే దీనికి ఎండ్ కార్డ్ పడనుంది. దీంతో టైటిల్ ఎవరు కైవసం చేసుకుంటారో అనే దానిపై ప్రేక్షకుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. నిన్న జరిగిన ఎలిమినేషన్‌లో శివజ్యోతి ఎలిమినేట్ అయిన విషయం తెలిసిందే. అయితే శివజ్యోతి ఔట్ అవ్వడంతో అలి రెజా సేఫ్ అయ్యాడు. ఇక ప్రస్తుతం బిగ్‌బాస్ హౌస్‌లో అయిదుగురు ఉన్నారు. అయితే వీరిలో ఎవరు ఫైనల్ టైటిల్ అందుకుంటారో వేచిచూడాలి. అయితే ఈ సీజన్ విన్నర్‌ను ఎవరు ప్రకటించబోతున్నారన్న దానిపై వార్తలు లీకయ్యాయి. గత సీజన్‌లో కూడా ఫైనల్ టైటిల్ ప్రకటించేందుకు స్టార్ హీరోలను ఆహ్వానించిన సంగతి తెలిసిందే. సో ఈసారి కూడా ఇండస్ట్రీలోని అతి పెద్ద స్టార్ హీరోని ఈ గ్రాండ్ ఫినాలే కోసం చీఫ్ గెస్ట్‌గా ఆహ్వానించడానికి సిద్ధమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

Who Is Going To Be The Guest For Bigg Boss 3 Grand Finale..?, బిగ్‌బాస్‌-3 విన్నర్‌ను ప్రకటించబోయే.. ఆ స్టార్ హీరో ఎవరో తెలుసా..?

ఈ నేపథ్యంలోనే నాగార్జున రీసెంట్ గా మెగాస్టార్ చిరంజీవిని ఫైనల్ ఎపిసోడ్ కు హాజరుకావాలని కోరారట. నాగ్.. చిరూ.. ఇద్దరూ క్లోజ్ ఫ్రెండ్స్. దీంతో నాగ్ ఆహ్వానాన్ని చిరు మన్నించి.. వచ్చేందుకు ఒప్పుకున్నారట. సో.. ఈ సీజన్3 లో విజేతను స్టేజిపై చిరంజీవి ప్రకటిస్తారనమాట. గతంలో నాని యాంకర్ గా రాణిస్తున్న సమయంలో విన్నర్ నేమ్ విక్టరీ వెంకటేష్ ప్రకటించడం జరిగింది. ఆ సందర్భంలో కౌశల్ సీజన్ 2 కి విన్నర్ గా ఎంపికయ్యారు. ఇదిలా ఉండగా సీజన్ 3 కి టైటిల్ విన్నర్ ప్రకటించడానికి చీఫ్ గెస్ట్ గా చిరంజీవి వస్తున్నారన్న వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే అధికారికంగా ప్రకటన వెలువడితే దీనిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

Related Tags