‘మెగాస్టార్’ బయోపిక్‌: ఎవరా కరెక్ట్ హీరో..?

Who is Correct Person for Megastar Chiranjeevi Biopic, ‘మెగాస్టార్’ బయోపిక్‌: ఎవరా కరెక్ట్ హీరో..?

ప్రముఖ సినీనటి సావిత్రి బయోపిక్‌ ‘మహానటి’ రావడంతో.. టాలీవుడ్‌లో బయోపిక్‌ల పరంపర కొనసాగుతోంది. ‘మహానటి’ బయోపిక్ తరువాత ప్రముఖ నటుడు, దివంగత నేత, మాజీ సీఎం ఎన్టీఆర్ బయోపిక్‌ ప్రేక్షకులను అలరించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరో బయోపిక్‌ ఎవరిదంటే.. ‘మెగాస్టార్‌ చిరంజీవి’ది.

మెగాస్టార్‌ చిరంజీవి.. టాలీవుడ్‌లో దుమ్ములేపిన వ్యక్తి. అభిమానులందరూ.. చిరు.. మెగాస్టార్ అని ముద్దుగా పిలుస్తూంటారు. చిరు సినిమాలు వస్తున్నాయంటే.. థియేటర్ల ముందు అభిమానులు, ఫ్యాన్స్‌ సందడే వేరు. పాలాభిషేకాలు, కొబ్బరికాయులు కొట్టడం, పెద్ద పెద్ద కౌట్‌ అవుట్‌లు, పూల మాలలు వేయడం.. మామూలుగా కాదు.. నానా హంగామా చేసేవారు. కాగా.. చిరంజీవి సినీకెరీర్‌కి అరుదైన గౌరవం కూడా దక్కింది. ఒక తెలుగు నటుడికి ‘పద్శభూషణ్’ అవార్డు రావడం పెద్ద విశేషం. బాలీవుడ్‌లో బిగ్‌బీ రేంజ్‌కి ఎదిగిన వ్యక్తి. తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే ఎన్టీఆర్ తరువాత.. ఆ స్థాయిలో అభిమానించదగ్గ నటుడుగా గొప్ప గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తి.

1977లో సినీ ప్రపంచంలోకి అడుగుపెట్టిన చిరంజీవి.. మొదట కొన్ని కష్టాలను ఎదుర్కొన్నా.. ఆ తరువాత తిరిగి వెనక్కి చూసుకోలేని విధంగా ఆయన సినీ కెరీర్ సాగింది. మొదట చిన్న చిన్న సినిమాల్లో విలన్ పాత్రలు నటించినా.. ఏ కోదండరామి రెడ్డి డైరెక్షన్‌లో వచ్చిన ‘ఖైదీ’ సినిమాతో నిలదొక్కుకున్నాడు. అదే ఆరంభంతో.. ముందుకు చిరుతపులిలా దూసుకుపోయాడు. చిరంజీవి సినిమా వస్తుందంటే.. వేరే హీరోల సినిమాలు.. ఆగాల్సిందే. అంత ఫాలోయింగ్.. ఉంది చిరుకు. దీంతో.. చిరంజీవి కాస్తా.. మెగాస్టార్ చిరంజీవి అయిపోయాడు. 100 రోజులు, 200 రోజులు, సంవత్సరం మొత్తం థియేటర్లలో చిరు సినిమాలు ఆడేవి.

Who is Correct Person for Megastar Chiranjeevi Biopic, ‘మెగాస్టార్’ బయోపిక్‌: ఎవరా కరెక్ట్ హీరో..?

కాగా.. ప్రస్తుతం మెగాస్టార్ గురించి చర్చ ఎందుకొచ్చిందంటే.. ‘చిరంజీవి’ బయోపిక్‌ గురించి. ఏంటి షాక్‌ అయ్యారా..! అవును. తాజాగా.. ‘వాల్మీకీ’ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్లో భాగంగా.. వరుణ్ తేజ్‌.. చిరంజీవి బయోపిక్‌ గురించి ప్రస్తావన తేవడంతో.. ఇప్పుడు ఇదే హట్‌ టాపిక్‌గా నిలుస్తోంది. చిరంజీవి బయోపిక్‌‌ అయితే తీస్తారు కానీ.. అందులో నటించేది ఎవరు..? అదే డౌట్ ఇప్పుడు ఆయన ఫ్యాన్స్‌కి.. అంతుచిక్కడంలేదు.

చిరూకి 60 ఏళ్లు వచ్చినా.. ఆయన ఇంకా.. 16 ఏళ్ల కుర్రాడిలా స్టెప్పులేయడం ఆషామాషీ విషయం కాదు. చిరు స్టైల్‌కి.. స్మైల్‌కి.. డ్యాన్స్‌కి.. సరితూగేదెవరు..? ఆయనలా అన్ని యాంగిల్స్‌లో నటించి మెప్పించగలరా..? అది కుదిరే పనేనా..? అంటూ పలు ప్రశ్నలు ఎదురవుతున్నాయి. 1980, 1990లలో చిరు సినిమాలు ఓ ప్రభంజనం.. సృష్టించాయి. విలన్‌, కమేడియన్‌, హీరో, కీ రోల్స్‌ పాత్రల్లో చిరు నటన అసాధారణం. ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే.

కాగా.. ఇప్పుడు చిరు బయోపిక్‌ తీస్తే.. అందులో నటించేందుకు.. లిస్ట్‌లో ఉన్న పేర్లు.. రామ్‌చరణ్, అల్లు అర్జున్, సాయి ధరమ్ తేజ్. చెర్రీ, అల్లు అర్జున్‌ల కన్నా.. సాయిధరమ్‌ తేజ్‌లో మేనమామ పోలికలు ఎక్కువగా కనిపిస్తాయి. తేజ్‌లో.. స్టైల్, స్మైల్, డ్యాన్స్, నడిచే తీరు, మాటలు అన్నీ.. చిరంజీవిని, పవన్‌లను గుర్తుచేస్తాయి. ఇదంతా ఓకే.. కానీ.. చిరంజీవి బయోపిక్ విషయంపై మనసులో ఎవరున్నారో.. అసలు ఆయన కథను సిల్వర్ స్క్రీన్‌పై చూడటానికి ఇష్టపడతారో లేదో చూడాలి.

Who is Correct Person for Megastar Chiranjeevi Biopic, ‘మెగాస్టార్’ బయోపిక్‌: ఎవరా కరెక్ట్ హీరో..?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *