Breaking News
  • విశాఖ: బ్లూఫ్రాగ్‌ టెక్నాలజీస్‌పై కొనసాగుతున్న సీఐడీ విచారణ. 8 సర్వర్లకు చెందిన డేటాను సేకరించిన అధికారులు. డేటాను విశ్లేషిస్తున్న సీఐడీ అధికారులు. ప్రభుత్వ ఇసుక పోర్టల్‌ను హ్యాక్‌ చేసి.. కృత్రిమ కొరత సృష్టించినట్టు బ్లూఫ్రాగ్‌పై అభియోగాలు.
  • హైదరాబాద్‌: అధికారులతో రైల్వే సేఫ్టీ కమిషనర్‌ భేటీ. కాచిగూడ రైలు ప్రమాదంపై చర్చ. ప్రకాశం జిల్లా: ఒంగోలులో మనబడి నాడు-నేడు కార్యక్రమం ప్రారంభం. కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం జగన్. వివిధ శాఖలు ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించిన జగన్‌.
  • ప.గో: యలమంచిలి మండలం కాజ గ్రామంలో రోడ్డుప్రమాదం. అదుపుతప్పి పంట కాలువలోకి దూసుకెళ్లిన కారు. దంపతులకు తీవ్రగాయాలు, ఆస్పత్రికి తరలింపు.
  • అనంతపురం: కల్యాణదుర్గంలో కాలువలోకి దూసుకెళ్లిన కాలేజ్‌ బస్సు. ప్రమాద సమయంలో బస్సులో 48 మంది విద్యార్థులు. విద్యార్థులకు తృటిలో తప్పిన ముప్పు. డ్రైవర్‌ నిర్లక్ష్యమే కారణమంటున్న విద్యార్థుల తల్లిదండ్రులు.
  • భూపాలపల్లిలో కొనసాగుతున్న బంద్‌. ఆర్టీసీ డ్రైవర్‌ నరేష్‌ ఆత్మహత్యకు నిరసనగా బంద్‌. డిపోల్లోనే నిలిచిపోయిన ఆర్టీసీ బస్సులు.
  • అమరావతి: మంగళగిరి జనసేన కార్యాలయంలో బాలల దినోత్సవం. పాల్గొన్న జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌. పిల్లలకు పుస్తకాలను పంపిణీ చేసిన పవన్‌కల్యాణ్‌.
  • హైదరాబాద్‌: కూకట్‌పల్లిలో నియోజకవర్గంలో మంత్రి కేటీఆర్‌ పర్యటన. పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన కేటీఆర్‌. కూకట్‌పల్లిలో ఇండోర్‌ స్టేడియం ప్రారంభం. మల్టీపర్పస్‌ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌ను.. పిల్లలతో కలిసి ప్రారంభించిన మంత్రి కేటీఆర్‌. డబుల్ బెడ్‌రూమ్ కాంప్లెక్స్‌ను ప్రారంభించిన కేటీఆర్. అధికారిక కార్యక్రమాల్లో ఫ్లెక్సీలపై కేటీఆర్‌ వార్నింగ్‌. ఫ్లెక్సీలు తొలగిస్తేనే కార్యక్రమానికి వస్తానన్న కేటీఆర్‌. కేటీఆర్‌ ఫ్లెక్సీలు తొలగించిన సిబ్బంది.

కూల్ డ్రింక్స్ కంటే వైట్ రైస్ ప్రమాదకరమట.. ఎందుకంటే.?

ఏంటీ టైటిల్ చూసి కంగారు పడుతున్నారా.? ఒకసారి ఈ వార్త చదవండీ.. మీ డౌట్స్ అన్ని క్లారిఫై అవుతాయి. మన భారతదేశంలో ప్రదేశాలు ఎన్నైనా.. అందరూ ప్రధానంగా తీసుకునే ఆహారం అన్నం. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఇదే ప్రధాన వంటకం అని తెలిసిందే. అయితే పోలిష్ చేయని అన్నాన్ని తీసుకుంటే ఏం కాదు కానీ… పోలిష్ చేసిన అన్నం తింటే మాత్రం ప్రమాదకరమని నిపుణులు అంటున్నారు. ఇక ఇప్పుడు దొరికే బియ్యం మొత్తం పోలిష్ చేసినవే. ఆ బియ్యాన్నే మనం తింటున్నాం.

మరోవైపు పాలిష్ చేసిన బియ్యాన్ని తౌడు అంటారని డాక్టర్లు చెబుతున్నారు. ఆ తౌడునే మనం రోజూ తింటున్నాం. బియ్యం మెరవడానికి మిల్లుల్లో వాటిని బాగా పోలిష్ చేస్తారు. అలా చేయడం వల్ల బియ్యం పోషక పదార్ధాలను కోల్పోతుంది. ఇక ఆ ఉత్త బియ్యం తినడం వల్ల పలు ఆరోగ్య సమస్యలు దరికి చేరుతాయి. ఉత్త బియ్యంలో అధిక శాతంలో చక్కెర ఉంటుంది. అది మన బాడీలోకి గ్లూ‌కోజ్‌గా చేరి.. షుగర్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.

ఇక ఈ వైట్ రైస్‌కు కూల్ డ్రింక్‌కు మధ్య సంబంధం ఏంటని ఆలోచిస్తున్నారా..? ఒక చిన్న కూల్ డ్రింక్‌‌లో ఉండే చక్కెర కంటెంట్ కన్నా ఒక్క గిన్నెడు అన్నంలో ఉండే చక్కెర స్థాయి ఎక్కువ. అందుకే కూల్ డ్రింక్‌ కంటే తెల్ల అన్నం మరింత ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుచేత వైట్ రైస్ కంటే.. బ్రౌన్ రైస్ లేదా దొడ్డు బియ్యం తినడం మంచిదని వారు సూచన. అంతేకాకుండా ఆరోగ్యంగా ఉండడానికి,  స్థూలకాయం తగ్గడం కోసం డాక్టర్లు ఎక్కువగా బ్రౌన్ రైస్ తినమని సలహా ఇస్తుంటారు.