హోంశాఖ ఫేస్‌బుక్‌ పేజిలో విస్కీ బాటిళ్లు, స్నాక్స్ ఫోటో.. అసలు కథేంటంటే?

కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఫేస్ బుక్ పేజీలో ఇటీవల దర్శనమిచ్చిన ఓ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. అంతేకాకుండా ఆ ఫోటో వల్ల కేంద్ర ప్రభుత్వాన్ని విపరీతంగా ట్రోల్ చేశారు. హోంశాఖలో పని చేసే ఓ జూనియర్ ఉద్యోగి పోస్ట్ చేసిన ఆ ఫోటో ఏంటని చూస్తే.. అందులో రెండు విస్కీ బాటిళ్లు, మిక్సర్ ప్లేట్ ఉన్నాయి. ఇక ఈ ఫొటోకు రాసిన క్యాప్షన్ చూస్తే మతిపోతుంది. ‘తుఫానుతో దెబ్బతిన్న బెంగాల్‌లో చేపట్టిన […]

హోంశాఖ ఫేస్‌బుక్‌ పేజిలో విస్కీ బాటిళ్లు, స్నాక్స్ ఫోటో.. అసలు కథేంటంటే?
Follow us

|

Updated on: May 29, 2020 | 2:52 PM

కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఫేస్ బుక్ పేజీలో ఇటీవల దర్శనమిచ్చిన ఓ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. అంతేకాకుండా ఆ ఫోటో వల్ల కేంద్ర ప్రభుత్వాన్ని విపరీతంగా ట్రోల్ చేశారు. హోంశాఖలో పని చేసే ఓ జూనియర్ ఉద్యోగి పోస్ట్ చేసిన ఆ ఫోటో ఏంటని చూస్తే.. అందులో రెండు విస్కీ బాటిళ్లు, మిక్సర్ ప్లేట్ ఉన్నాయి.

ఇక ఈ ఫొటోకు రాసిన క్యాప్షన్ చూస్తే మతిపోతుంది. ‘తుఫానుతో దెబ్బతిన్న బెంగాల్‌లో చేపట్టిన సహాయక చర్యలు’ అని పేర్కొన్నారు. దీనిపై నెటిజన్లు విపరీతమైన కామెంట్స్ చేయగా.. పోస్ట్ చేసిన 15 నిమిషాల తర్వాత హోం మంత్రిత్వశాఖ ఆ ఫోటోను డిలీట్ చేసింది. ఈ విషయంపై హోంశాఖ అధికారి ఒకరు మాట్లాడుతూ.. ‘ఇదంతా తెలియక జరిగిన తప్పిదం. ఇవాళ ఓ జూనియర్ ఉద్యోగి ఈ పేజీని ఆపరేట్ చేశాడు. అతను అనుకోకుండా తన ఫేస్ బుక్ ఖాతాలో పోస్ట్ చేయాల్సిన ఫొటోను పొరపాటున ఎమ్‌హెచ్‌ఏ అకౌంట్‌లో పోస్ట్‌ చేశాడు. ఈ విషయం మా దృష్టికి రావడంతో వెంటనే దాన్ని తొలగించాం. సదరు ఉద్యోగి రాతపూర్వకంగా క్షమాపణలు కూడా తెలియజేశాడని ఆయన అన్నారు.

Read This: లాక్ డౌన్ పొడిగించండి.. జిమ్స్, రెస్టారెంట్లు అనుమతివ్వండి…