Breaking News
  • భారత్ లో కరోనా కల్లోలం. 9 లక్షల 68 వేల మార్క్ ని దాటినా కరోనా పాజిటివ్ కేస్ లు. దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు : 968876. దేశ వ్యాప్తంగా యాక్టీవ్ కేసులు: 331146. కరోనా నుంచి డిశ్చార్జ్ అయిన బాధితులు: 612815. దేశం మొత్తం కరోనా తో మృతుల సంఖ్య : 24915. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ.
  • వైద్య, ఆరోగ్యశాఖలో వివిధ కార్యక్రమాల అమలుకు నిధుల విడుదల. 330 కోట్లు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ. కేసీఆర్ కిట్ల పథకం కోసం 110.75 కోట్లు విడుదల.
  • కర్నూలు టీవీ9 ఎఫెక్ట్: వర్షపు నీరు వచ్చిన కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రిలోనీ కోవిడ్ వార్డును తనిఖీ చేసిన సూపరింటెండెంట్ డాక్టర్ నరేంద్రనాథ్ రెడ్డి. ఇంకోసారి ఇ వర్షపు నీరు రాకుండా చూస్తావని వార్డు లోని ఇతర సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామని హామీ.
  • ఇన్వెస్ట్ తెలంగాణ వెబ్ సైట్ ను ప్రారంభించిన మంత్రులు. తెలంగాణలోకి మరిన్ని పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంతో రూపొందించిన ఇన్వెస్ట్ తెలంగాణ వెబ్సైట్ ఈ రోజు ప్రారంభమైంది. ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు మంత్రులు జగదీశ్వర్ రెడ్డి కే తారకరామారావు సమక్షంలో ఇన్వెస్ట్ తెలంగాణ వెబ్సైట్ లాంచ్ చేశారు. మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రం లో జరిగిన ఈ కార్యక్రమంలో ఆర్థికమంత్రి హరీష్ రావు ఇన్వెస్ట్ తెలంగాణ వెబ్సైట్ ప్రారంభించారు. https://invest.telangana.gov.in/ లింక్ ద్వారా వెబ్ సైట్ ను సందర్శించవచ్చు.
  • విద్యాశాఖపై సమీక్ష నిర్వహిస్తున్న సీఎం కెసిఆర్ . విద్యాశాఖపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష. మంత్రి సబిత, అధికారులతో సీఎం సమావేశం. విద్యాసంవత్సరం, పరీక్షలు, ఇతర అంశాలపై చర్చ.
  • కరోనా పేషంట్ల ను రక్షించడానికి సిద్ధమైన కరోనా విజేతలు . తెలంగాణలో ఏర్పాటైన ప్లాస్మా డోనార్స్ ఆసోషియేషన్ . తెలంగాణ ప్లాస్మా డోనార్స్ అసోసియేషన్ లోగో ఆవిష్కరణ. కోవిడ్ నుండి బయటపడినవాళ్ళు ఇతరుల ప్రాణాలు కాపాడటానికి ప్లాస్మా దానం చేయాలని విజ్ఞప్తి. ప్లాస్మా తెరఫి కి సంబంధించి ఒక అధికారిని కేటాయించాలి . ఫ్లాస్మా దాతలకు రాష్ట్రంలో విధి విధానాలు రూపొందించాలంటూ విజ్ఞప్తి.
  • అమరావతి: అచ్చెన్నాయుడు బెయిల్ పిటిషన్ పై వాదనలు పూర్తి. విచారణ ను వాయిదా వేసిన ధర్మాసనం. ESI స్కామ్ లో అరెస్ట్ అయిన అచ్చెన్నాయుడు. కోర్టు ఆదేశాల మేరకు గుంటూరు రమేష్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అచ్చెన్నాయుడు.
  • ఫారెక్స్ ట్రేడింగ్ పేరుతో భారీ మోసం. ట్రేడింగ్ లో పెట్టుబడులు అంటూ వ్యాపారవేత్తను దగ్గర నుంచి కొట్టేసిన ముఠా . ఇద్దరిని అరెస్టు చేసిన సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు.

అక్కడొకరు..ఇక్కడొకరు..మరి శివరాం దారేది ?

kodela sivaram under dilemma, అక్కడొకరు..ఇక్కడొకరు..మరి శివరాం దారేది ?

కోడెల వారసుడు ఎవరు? ఆయన కుమారుడు వారసత్వం కొనసాగిస్తారా? అనే ప్రశ్నలు ఇప్పుడు గుంటూరు పొలిటికల్‌ స్కీన్‌పై హాల్‌చల్‌ చేస్తున్నాయి. సత్తెనపల్లికి ఆయన ఇంచార్జ్‌గా వస్తారా? లేకా కోడెల అడ్డా నరసరావుపేట వైపు వెళాతారా? అనేది ఆసక్తికరంగా మారింది.

కోడెల శివప్రసాదరావు. పల్నాటి రాజకీయాల్లో ప్రత్యేక ముద్ర ఉన్న నేత. నాలుగు దశాబ్దాల రాజకీయ ప్రస్థానంలో తనదైన మార్క్‌తో ఎదిగిన రాజకీయ నేత. ఆయన మృతితో పల్నాటి టీడీపీ రాజకీయాల్లో స్పేస్‌ ఏర్పడింది. అయితే ఈ ప్లేస్‌ను భర్తీ చేసేదెవరు? అనే చర్చ మొదలైంది.

kodela sivaram under dilemma, అక్కడొకరు..ఇక్కడొకరు..మరి శివరాం దారేది ?

పల్నాడు ఫ్యాక్షన్‌ రాజకీయాల్లో ప్రత్యర్థులను కోడెల ధీటుగా ఎదుర్కొన్నారు. కోడెలాలాగా పార్టీని నిలబెట్టే సమర్థ నాయకుడు టీడీపీలో ఎవరు ఉన్నారు? అని తెగ వెతుకుతున్నారు. అటు పార్టీ అధిష్టానం…ఇటు కార్యకర్తలు సమర్థవంతమైన నేత కోసం తెగ సెర్చ్‌ చేస్తున్నారు.

kodela sivaram under dilemma, అక్కడొకరు..ఇక్కడొకరు..మరి శివరాం దారేది ?సత్తెనపల్లిలో ఇప్పటికే టీడీపీ నేతలు రెండు వర్గాలు చీలిపోయారు. పార్టీ తరపున ఏ కార్యక్రమం జరిగినా కోడెల నివాసంలో ఓవర్గం…అటు పార్టీ కార్యాలయంలో మరోవర్గం సమావేశం అవుతున్నాయి. రాయపాటి రంగారావు కొంతకాలంగా ఇక్కడ ఫోకస్‌ పెట్టారు. పార్టీపై పట్టు పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. కోడెలకు వ్యతిరేకంగా వర్గాన్ని మెయిన్‌ టెయిన్‌ చేస్తున్నారు.

kodela sivaram under dilemma, అక్కడొకరు..ఇక్కడొకరు..మరి శివరాం దారేది ?

నరసరావుపేటలో కూడా చదలవాడ అరవిందబాబు యాక్టివ్‌ అయ్యారు. మొన్నటి ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత కూడా నియోజకవర్గంలోనే ఉంటున్నారు. కార్యకర్తలకు అండగా నిలుస్తున్నారు. సత్తెనపల్లిలో రంగారావు….నరసరావుపేటలో అరవిందబాబు క్రియాశీలకంగా తయారయ్యారు. ఇలాంటి పరిస్థితుల్లో కోడెల వారసుడిగా శివరాం ఎంట్రీ ఇస్తారా? ఆయన రాజకీయ వారసత్వాన్ని కొనసాగిస్తారా? అనే సందేహాలు మొదలయ్యాయి. ఒకవేళ శివరాంకు నియోజకవర్గ బాధ్యతలు అప్పగిస్తే కేడర్‌ ఎలా రియాక్ట్‌ అవుతుంది? అనే దానిపై పార్టీ అధిష్టానం తీవ్ర మల్లగుల్లాలు పడుతున్నట్లు తెలుస్తోంది.

kodela sivaram under dilemma, అక్కడొకరు..ఇక్కడొకరు..మరి శివరాం దారేది ?

నరసరావుపేటలో అరవిందబాబు యాక్టివ్‌గా ఉన్నారు. ఆయన పార్టీ ఆఫీసు కూడా సొంతగా పెట్టుకున్నారు.దీంతో అక్కడ శివరాంకు చాన్స్‌ లేదని కార్యకర్తల వాయిస్‌గా విన్పిస్తోంది. మరీ సత్తెనపల్లిపై పార్టీ ఎలా నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది, ఇలాంటి రాజకీయ పరిస్థితుల్లో కోడెల వారసుల రాజకీయ భవిష్యత్‌పై అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది వేచి చూడాలి.

Related Tags