అసలు ఆంధ్రప్రదేశ్‌కి ‘రాజధాని’ ఎక్కడ..?

2019 అసెంబ్లీ ఎన్నికల్లో పోలవరం, అమరావతి నిర్మాణమే ప్రధాన అజెండాలుగా టీడీపీ.. ప్రచార బరిలో దిగగా… వైసీపీ మాత్రం ఆ రెండు అంశాల కంటే… నవరత్నాల పథకాలకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చి… ప్రచారం సాగించింది. ఇందుకు ప్రధాన కారణం… ఆ పార్టీ అధికారంలోకి వస్తే, పోలవరం పనులను నిలిపేస్తుందనీ, రాజధానిని అమరావతి నుంచీ మరో చోటికి తరలించేస్తుందనే వాదన అప్పట్లో వినిపించింది. దీనిపై టీడీపీ జోరుగా ప్రచారం చెయ్యడంతో… అప్పట్లో వైసీపీ నేతలు… ఆ వాదనను తప్పుపడుతూ […]

అసలు ఆంధ్రప్రదేశ్‌కి 'రాజధాని' ఎక్కడ..?
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Aug 21, 2019 | 4:21 PM

2019 అసెంబ్లీ ఎన్నికల్లో పోలవరం, అమరావతి నిర్మాణమే ప్రధాన అజెండాలుగా టీడీపీ.. ప్రచార బరిలో దిగగా… వైసీపీ మాత్రం ఆ రెండు అంశాల కంటే… నవరత్నాల పథకాలకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చి… ప్రచారం సాగించింది. ఇందుకు ప్రధాన కారణం… ఆ పార్టీ అధికారంలోకి వస్తే, పోలవరం పనులను నిలిపేస్తుందనీ, రాజధానిని అమరావతి నుంచీ మరో చోటికి తరలించేస్తుందనే వాదన అప్పట్లో వినిపించింది. దీనిపై టీడీపీ జోరుగా ప్రచారం చెయ్యడంతో… అప్పట్లో వైసీపీ నేతలు… ఆ వాదనను తప్పుపడుతూ కౌంటర్లు ఇచ్చారు. కానీ… ఇప్పుడు వైసీపీ అధికారంలోకి వచ్చాక… పోలవరం నిర్మాణాల్ని నిలిపేస్తూ… రివర్స్ టెండరింగ్‌ నిర్ణయం తీసుకోవడం ఒక అంశమైతే… తాజాగా.. రాజధాని అమరావతి విషయంలో మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన కామెంట్లు కలకలం రేపుతున్నాయి.

అమరావతి ప్రాంతంలో నిర్మాణ వ్యయం సాధారణ ప్రాంతాల్లో నిర్మాణ వ్యయం కంటే డబుల్ అవుతోందని మంత్రి బొత్స అన్నారు. దాని వలన ప్రజాధనం దుర్వినియోగమవుతోందని అభిప్రాయపడ్డారు. కృష్ణానది వరదలతో అమరావతిలో మునిగిపోయే ప్రాంతాలు ఉన్నాయని తెలిసిందన్న ఆయన… వరదల నుంచి రక్షణ పొందేందుకు కాల్వలు, జలాశయాలు నిర్మించాల్సి ఉంటుందని చెప్పారు. దీనివల్ల ప్రభుత్వంపై అదనపు భారం పడుతుందని అన్నారు. ఈ క్రమంలో రాజధానిపై ప్రభుత్వంలో చర్చ జరుగుతోందదని… త్వరలోనే ప్రకటన చేస్తామని తెలిపారు బొత్స.

Where is the capital of AP?

బొత్స వ్యాఖ్యల సారాంశం… రాజధానిని తరలించడమే అంటోంది టీడీపీ. ఇప్పటికే అమరావతిలో నిర్మాణాలు ఆగిపోయి, రియల్ ఎస్టేట్ పడిపోయిందన్న చంద్రబాబు.. బొత్స వ్యాఖ్యలతో పూర్తిగా చెడుతోందన్నారు.

ప్రస్తుతం మంత్రి బొత్స వాదనను బట్టీ చూస్తే… అమరావతి నిర్మాణం ప్రస్తుతానికి అటకెక్కినట్లే కనిపిస్తోందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఆల్రెడీ ఉమ్మడి రాజధానిగా మరో ఐదేళ్లు హైదరాబాద్ ఉంటుంది కాబట్టి… వైసీపీ ప్రభుత్వం… ఇప్పటికిప్పుడు రాజధానిని నిర్మించేందుకు సిద్ధంగా లేకపోయివుండొచ్చని అభిప్రాయపడుతున్నారు.

Where is the capital of AP?