10 లక్షల ఉద్యోగాలా ? ఎక్కడినుంచి తెస్తారు ? నితీష్ కుమార్

తాము అధికారంలోకి వస్తే 10 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామంటూ ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ బీహార్ ఓటర్లకు ఇచ్చిన హామీపై సీఎం, జేడీ-యూ అధినేత నితీష్ కుమార్ మండిపడ్డారు. ఓ ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న ఆయన..

10 లక్షల ఉద్యోగాలా ? ఎక్కడినుంచి తెస్తారు ? నితీష్ కుమార్
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Oct 21, 2020 | 12:37 PM

తాము అధికారంలోకి వస్తే 10 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామంటూ ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ బీహార్ ఓటర్లకు ఇచ్చిన హామీపై సీఎం, జేడీ-యూ అధినేత నితీష్ కుమార్ మండిపడ్డారు. ఓ ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న ఆయన.. ఇది సాధ్యమయ్యే పనేనా అని ప్రశ్నించారు. వారికి వేతనాలు చెల్లించడానికి సొమ్ము ఎక్కడినుంచి తెస్తారని, మీ స్కామ్ (లాలూ పశుగ్రాసం స్కామ్) సొమ్ము నుంచేనా ? అందుకే జైల్లో ఉన్నారు అని పరోక్షంగా లాలూ ప్రసాద్ ను ఉద్దేశించి అన్నారు. తేజస్వికి అనుభవం లేదని, అసలు ప్రపంచంలో ఎక్కడైనా పది లక్షల ఉద్యోగాలన్న మాట ఎక్కడైనా ఉందా అని నితీష్ వ్యాఖ్యానించారు. పది లక్షలే ఎందుకు ? ప్రతి వ్యక్తికీ జాబ్ ఇస్తే పోలా అని వ్యంగ్యంగా పేర్కొన్నారు.

అయితే తేజస్వి యాదవ్ ఆయనకు ఘాటుగా  కౌంటర్ ఇచ్చారు. తనకు  అనుభవం లేకపోతే  బీజేపీ నేతలు ఇరవై హెలీకాఫ్టర్లలో తనవెంట ఎందుకు పడతారని అన్నారు. నితీష్ కుమార్ శారీరకంగా, మానసికంగా అలసిపోయారని, అన్నారు. గతంలో నేను డిప్యూటీ సీఎం గా పని చేశా.. మీ (నితీష్) హయాంలో 60 స్కాములు జరగలేదా అని ప్రశ్నించారు. యాడ్స్ లో తన ముఖాన్ని మెరుగుపరుచుకునేందుకు నితీష్ 500 కోట్లు ఖర్చు పెట్టారని తేజస్వి యాదవ్ ఆరోపించారు.