వశిష్ట వారధికి మోక్షమెప్పుడు..?

Vasistha Bridge in Godavari Districts, వశిష్ట వారధికి మోక్షమెప్పుడు..?
పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం, … తూర్పుగోదావరి జిల్లా కోనసీమ మధ్యలో గల వశిష్ట గోదావరిపై బ్రిడ్జి నిర్మాణం స్థానికుల చిరకాల స్వప్పంగా మారింది. ఏళ్లూ గడిచిపోయినా ఇక్కడసరైన రవాణా సౌకర్యం మాత్రం అందుబాటులో లేదు. లంక గ్రామాల ప్రజలు అవసరాల విద్య, వైద్యం అవసరం ఏదైనా..గోదావరి దాటాక తప్పదు. ఇవతలి ఒడ్డు నుంచి అవతలి ఒడ్డుకు చేరాలంటే..పడవలోప్రయాణించాలి…
లేదంటే..చూట్టూ   తిరిగి దాదాపు 30 కిలోమీటర్లు ప్రయాణిస్తే గానీ, నరసాపురం చేరే అవకాశం ఉంటుంది. దీంతో స్థానిక ప్రజలు, ప్రయాణికులు, విద్యార్థులు, కార్లు, బైకులు, ఆటోలతో సహా పడవలో ప్రయాణం చేసి అవతలి ఒడ్డుకు చేరుకుంటారు. దీనిని దృష్టిలో ఉంచుకుని..అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌ హయాంలోనే ఇక్కడ బ్రిడ్జి నిర్మాణం చేపట్టేందుకు శంకుస్థాన చేశారు. కానీ, ఆ బ్రిడ్జి నిర్మాణం పనులు మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా మారిపోయింది.
తూర్పు, పడమరలు కలవటం ఎంత కష్టమో..ఈ రెండు తీరాలను కలిపే వశిష్ట వారధి నిర్మాణం కూడా అంతే కష్టంగా మారిపోయిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రానికిఅనేక విధాలుగా ఆదాయాన్ని సమకూర్చిపెడుతున్నఉభయ గోదావరి జిల్లాల తీర ప్రాంతాలపై ప్రభుత్వాలు చిన్న చూపు చూస్తున్నాయని ఆరోపిస్తున్నారు. ప్రభుత్వాలు మారినా, పాలకులు మారినా,..లంక గ్రామాల ప్రజల కష్టాలు మాత్రం మారటం లేదని వాపోతున్నారు.
నరసాపురం, సకినేటి పల్లిమధ్య గోదావరిపై బ్రిడ్జి నిర్మాణం కోసం…అప్పట్లోనే శంకుస్థాపన చేశారు.. వశిష్ట వారధి నిర్మాణం తలపెట్టిన తర్వాత ముగ్గురు ముఖ్యమంత్రులు మారారు. మూడు సార్లు శిలాఫలకాలు నిర్మించారు. కానీ, అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ కార్యం శిలాఫలకాలకే పరిమితమైందంటూ పలువురు ప్రజాసంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. వశిష్ట వారధి కేవలం ఎన్నికల వాగ్ధానంగా మారిపోయిందని విమర్శిస్తున్నారు. మరోవైపు నావిగేషన్‌ నిబంధనల ప్రకారం సాయంత్రం 7 దాటితే రేవు కూడా మూసివేయటంతో..విద్యార్థులు, ప్రజలు, ప్రయాణికులు అనేక అవస్థలు పడాల్సి వస్తోందంటున్నారు. ఇప్పటికైన ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వాలు స్పందించి వశిష్ట వారధి నిర్మాణాన్ని చేపట్టి తమ రహదారి కష్టాలు తీర్చాలని వేడుకుంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *