Breaking News
  • స్పీకర్‌ తీరు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే విధంగా ఉంది. సభలో స్పీకర్‌ తీసుకునే నిర్ణయాలు సీఎం తీసుకుంటున్నారు. స్పీకర్‌ సస్పెండ్‌ చేయకుండానే మార్షల్స్‌ బయటకు ఎలా తీసుకెళ్తారు. -మీడియా పాయింట్‌లో చినరాజప్ప. సీఎం కూడా రౌడీలా వ్యవహరిస్తున్నారు-చినరాజప్ప. సీఎం ఆదేశాలతోనే మార్షల్స్‌ నన్ను బయటకు తీసుకొచ్చారు. సస్పెండ్‌ చేయకుండా నన్ను బయటకు తీసుకురావడం.. సభా నిబంధనలకు విరుద్ధం-మీడియా పాయింట్‌లో చినరాజప్ప.
  • ప్రకాశం: ఒంగోలులో అపస్మారకస్థితిలో పడిఉన్న మహిళ. ఘటనా స్థలంలో మహిళ లోదుస్తులు, కండోమ్స్‌ గుర్తింపు. మహిళపై అత్యాచారం జరిగినట్టు అనుమానం. పోలీసుల సహకారంతో మహిళను ఆస్పత్రికి తరలింపు. మహిళ నోట్లో బియ్యం కుక్కి హత్యచేసేందుకు దుండగుల యత్నం. మహిళ ఊపిరితిత్తుల్లో బియ్యం గింజలు గుర్తించిన వైద్యులు. మహిళ పరిస్థితి విషమం.
  • శాసన మండలిలో వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులపై చర్చ. 3 గంటలపాటు చర్చకు అనుమతించిన డిప్యూటీ చైర్మన్‌. పార్టీల వారీగా సమయం కేటాయించిన డిప్యూటీ చైర్మన్‌. టీడీపీకి 84 నిమిషాలు, వైసీపీకి 27 నిమిషాలు.. పీడీఎఫ్‌ 15 నిమిషాలు, బీజేపీకి 6 నిమిషాల సమయం కేటాయింపు.
  • శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌ నుంచి ఢిల్లీకి బయల్దేరిన పవన్‌కల్యాణ్‌. పవన్‌కల్యాణ్‌ వెంట నాదెండ్ల మనోహర్‌. రేపు మధ్యాహ్నం వరకు ఢిల్లీలో ఉండనున్న పవన్‌కల్యాణ్‌. పలువురు బీజేపీ పెద్దలను కలవనున్న పవన్‌కల్యాణ్.
  • తెలంగాణ భవన్‌ నుంచి ఎన్నికల సరళీని సమీక్షిస్తున్న మంత్రి తలసాని. నగర మేయర్‌ బొంతు రామ్మోహన్‌, జిల్లాల కోఆర్డినేటర్లు.

రెండు రాష్ట్రాల్లో చేదు నింపిన స్వీటు .. ఎందుకో తెలుసా?

When a sweet tweet turned sour, రెండు రాష్ట్రాల్లో చేదు నింపిన స్వీటు .. ఎందుకో తెలుసా?

ఒక్క స్వీటు ముక్క రెండు రాష్ట్రాలమధ్య చిచ్చుపెట్టింది. అదీ రెండు దక్షిణాది రాష్ట్రాలమధ్య. మైసూర్ పాక్.. ఈ పేరు విననివారంటూ ఎవరూ ఉండరేమో. కింగ్ ఆఫ్ స్వీట్స్ అని పిలిపించుకుంటున్న మైసూర్ పాక్ వివాదం ఇప్పడు పొలిటికల్ హాట్ టాపిక్‌గా మారింది. దక్షిణాదిన ఈ స్వీట్‌కి ఉన్న ఆదరణ ఎలాంటిదో అందరికీ తెలిసిందే. మైసూర్ పాక్ ఏ ప్రాంతానికి చెందిన పదార్ధం అని ఎవరినడిగినా ఏం చెబుతారు? మైసూర్ అంటూ కర్ణాటకలో ఉంది గనుక అది కర్ణాటకకు చెందిన పదార్ధమనే బదులిస్తారు. కానీ అది అక్కడివారిది కాదట. తమిళనాడుకు చెందిన పదార్ధమట. ఈ వివాదం ఎప్పటినుంచో నలుతూనే ఉంది. తాజాగా ఆనంద్ రంగనాధన్ అనే జర్నలిస్టు ఓ ట్వీట్ చేశారు. దీంతో మరోసారి ఇది చర్చనీయాంశంగా మారింది.

ఇటీవల కేంద్ర ఆర్షిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను జర్నలిస్ట్ ఆనంద్ రంగనాథన్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆమెతో దిగిన ఫోటో ట్వీట్టర్‌లో పోస్టుచేసి.. మైసూర్ పాక్‌కు భౌగోళిక గుర్తింపు (జీఐ) ట్యాగ్‌ను తమిళనాడుకు కేటాయించినందుకు కృతఙ్ఞతలు అంటూ కామెంట్ రాశారు. అయితే ఈ వార్తను తమిళ, కన్నడ మీడియా ఛానెళ్లు బ్రేకింగ్ న్యూస్ నడిపాయి. దీంతో రచ్చ మొదలైంది. వాస్తవానికి కేంద్రం ఇప్పటివరకు మైసూర్ పాక్ విషయంలో ఎలాంటి జీఐ ట్యాగ్ ఎవరికీ కేటాయించలేదు. ఆయన ట్వీట్‌ను అర్ధం చేసుకోవడంలోనే పొరబాటు జరిగినట్టు గుర్తించాయి.

మైసూర్ పాక్ ఎక్కడిది?

ముందే చెప్పుకున్నాం కదా ! కర్ణాటక రాష్ట్రానికి చెందిన మైసూరులో మాహారాజా శ్రీ ముమ్మది కృష్ణరాజా వాడియార్ ఆదేశాలతో వంటలు వండే కాకాసుర మడప్ప అనే వ్యక్తి రాజా వారి కోరిక మేరకు ప్రత్యేక మైన వంటకాన్ని తయారు చేశాడు. అదే మైసూర్ పాక్. స్ధానికంగా జంబో అశోక్ రోడ్డులో స్వీట్ మార్ట్ ప్రారంభించడంతో ప్రజలకు ఈ స్వీట్‌ను తెలియజేయడంలో తమ ముత్తాత అంటూ ఆయన ముని మనవడు నటరాజ్ అనే వ్యక్తి చెబుతున్నాడు. ఈ దుకాణాన్ని 60 ఏళ్ల క్రితమే సయ్యజీరావు రోడ్‌కు మార్చామని చెప్పాడు. తమ వంశం మొత్తం ఈ సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్నామని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం తమది ఐదవ తరమని, మా పిల్లలు కూడ దీనిపై ఆసక్తి చూపిస్తున్నారని నటరాజ్ చెప్పాడు. సరదా కోసం ఇలాంటి ట్వీట్ చేయవద్దని, మైసూరుకు చెందిన ఈ స్వీట్‌కు తమిళనాడుకు ఎలా చెందుతుందని ప్రశ్నించాడు నటరాజ్.

తిరుపతి లడ్డూకు జీఐ ట్యాగ్..

ఇప్పటికే జీఐ ట్యాగ్ విషయంలో తిరుమల శ్రీవారికి ఎంతో ఇష్టమైన తిరుపతి లడ్డూకు జీఐ ట్యాగ్ లభించింది. తిరుపతి కొండపై తయారయ్యే లడ్డూ ప్రసాదంపై టీటీడీ దేవస్థానానికి సర్వహక్కులు వచ్చాయి. దీన్ని ఎవరూ కాపీ కొట్టకుండా, బయటి వ్యక్తులు ఎవరూ తయారు చేయకుండా ఉండేందుకు స్పష్టమైన హక్కులన్నీ దీనిద్వారా లభించినట్టయింది. బయటి వ్యక్తులు, దుకాణాలు ఎవరు దీన్ని తయారుచేసినా ఈ కాపీరైట్ హక్కు అడ్డుకుంటుంది. దీనికి లడ్డూకి సంబంధించి ఇదొక రక్షణ వంటిదే. అదే విధంగా బందరులడ్డూ కూడా జీఐ ట్యాగ్ పొందింది. మనకు ఆయా వస్తువులు పలు దుకాణాల్లో లభ్యమవుతున్నప్పటికీ ఒరిజినల్‌గా అది ఏ ప్రాంతానికి చెందిందో దాన్ని గుర్తించడమే ఈ జీఐ ట్యాగ్ ముఖ్య ఉద్దేశ్యం. కంచిపురం చీరలు, నాగపూర్ కమలాలు, అల్ఫాన్సో మామిడీ ఇలా ఎన్నో రకాల పదార్ధాలు, వస్తువులకు పేటెంట్లు, జీఐ ట్యాగ్‌లు వాటికి ప్రత్యేక గుర్తింపును ఇవ్వడంలో ప్రముఖ పాత్ర వహిస్తాయనడంలో సందేహం లేదు.

భౌగోళిక సూచికలు (జిఐ) అంటే ఏమిటి?

ఏదైనా ఒక ఉత్పత్తికి జియోగ్రాఫికల్ ఇండికేషన్ అనేది ప్రత్యేక గుర్తింపును సూచిస్తుంది. అసలైన పదార్ధం, లేక వస్తువుకు ఈ జీఐ ట్యాగ్ అనేది రక్షణ కల్పిస్తుంది. ఒక వస్తువు, లేక ఒక పదార్ధాన్ని ఎంతమందైనా తయారు చేసే వీలుంది. కానీ అది ఏదో ఒక ప్రాంతంలో ప్రసిద్ధి పొందడమో, అక్కడ తయారు చేయబడటమో జరుగుతూ ఉంటాయి. దీనినే ప్రామాణికంగా ఈ జీఐ ట్యాగ్ అనేది ఇస్తూ ఉంటారు. ఆ వస్తువు ఎక్కవ తయారు చేయబడుతుంది అనే విషయంలో భౌగోళిక ప్రాంతాన్ని జీఐ ట్యాగ్ ద్వారా నిర్ధారించవచ్చు.

భారత్‌లో ఎప్పటినుంచి..
వస్తువుల భౌగోళిక సూచికలు (రిజిస్ట్రేషన్ అండ్ ప్రొటెక్షన్ యాక్ట్), 1999 అనేది పాలకమండలి, ఇది కంట్రోలర్ జనరల్ ఆఫ్ పేటెంట్స్, డిజైన్స్ అండ్ ట్రేడ్ మార్క్స్ చేత నిర్వహించబడుతుంది, భౌగోళిక సూచికల రిజిస్ట్రార్ కూడా ఈ డిపార్ట్‌మెంట్ ఇస్తుంది. ఇది భౌగోళిక సూచికల వస్తువుల (రిజిస్ట్రేషన్ & ప్రొటెక్షన్) చట్టం, 1999, 15 సెప్టెంబర్ 2003 నుండి అమల్లోకి వచ్చింది.