Breaking News
  • సికింద్రాబాద్‌-మచిలీపట్నం మధ్య ప్రత్యేక రైళ్లు. డిసెంబర్‌ 1,8,15,22,29 తేదీల్లో నడవనున్న ప్రత్యేక రైళ్లు. మచిలీపట్నంలో మధ్యాహ్నం 2:25కి బయల్దేరి.. రాత్రి 10:10కి సికింద్రాబాద్‌కు చేరుకోనున్న ప్రత్యేక రైలు. అదేరోజు సికింద్రాబాద్‌ నుంచి రాత్రి 11:55కి బయల్దేరి.. మరుసటి రోజు ఉ.8:55కి మచిలీపట్నం చేరుకోనున్న ప్రత్యేక రైలు.
  • ఏపీకి నెంబర్లు కేటాయించిన కేంద్రం. అక్రమ మైనింగ్‌, అనధికార మద్యం అమ్మకాలపై.. ఫిర్యాదులకు నెంబర్లు కేటాయించిన కేంద్ర సర్కార్‌. అక్రమ మైనింగ్‌పై ఫిర్యాదు కోసం 14400 నెంబర్‌.. అనధికార మద్యంపై ఫిర్యాదుకు 14500 నెంబర్‌ కేటాయింపు.
  • మళ్లీ పెరిగిన బంగారం ధరలు. పెళ్లిళ్ల సీజన్‌ కొనుగోళ్లతో పెరిగిన పసిడి ధరలు. 10గ్రాముల 24క్యారెట్ల బంగారంపై రూ.225 పెంపు. రూ.38,715 పలుకుతున్న 10గ్రాముల బంగారం. రూ.440 పెరిగి రూ.45,480కి చేరిన కిలో వెండి ధర.
  • ఛండీగడ్‌: 2019 ప్రపంచ కబడ్డీ కప్‌కు పంజాబ్ ఆతిథ్యం. డిసెంబర్‌ 1 నుంచి 9 వరకు మ్యాచ్‌ల నిర్వహణ. సుల్తాన్‌పూర్‌ లోధిలోని గురునానక్‌ స్టేడియంలో ప్రారంభ వేడుక. ప్రపంచ కబడ్డీ టోర్నీలో పాల్గొననున్న భారత్, అమెరికా, శ్రీలంక.. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, కెన్యా, న్యూజిలాండ్‌, పాకిస్తాన్‌, కెనడా జట్లు.
  • ఓటర్ల జాబితా సవరణకు కొత్త షెడ్యూల్‌ విడుదల. జనవరి 1, 2020 అర్హత తేదీతో ఓటర్ల జాబితా సవరణ. ఓటర్ల వివరాల పరిశీలనకు ఈనెల 30 తుది గడువు. డిసెంబర్‌ 16న ఓటర్ల జాబితా ముసాయిదా ప్రచురణ. 2020, జనవరి 15న అభ్యంతరాలు, వినతుల స్వీకరణ.
  • టిక్‌టాక్‌కు పోటీగా త్వరలో ఇన్‌స్టాగ్రామ్‌ కొత్త ఫీచర్‌. రీల్స్‌ పేరిట ఓ కొత్త ఫీచర్‌ అందుబాటులోకి. ఇన్‌స్టాగ్రామ్‌లోని ఎక్స్‌ప్లోర్‌ సెక్షన్‌లో కొత్త ఫీచర్. కొత్త ఫీచర్‌లో టిక్‌టాక్ మాదిరిగా వీడియోలు క్రియేట్‌ చేసే సౌకర్యం.

ఓ మేక మరణం.. ఆ సంస్థకు 3 కోట్లు లాస్

ఓ మేక మరణం ఆ సంస్థకు భారీ నష్టాన్ని తెచ్చింది. ఎంత అంటే అక్షరాల రూ. 2.7 కోట్ల నష్టం తెచ్చిందట. ఇది వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా.. ఇది నిజమేనండోయ్. అన్ని కోట్ల నష్టం వాటిల్లింది మరే సంస్థకో కాదు.. భారతదేశంలోనే అతిపెద్ద సంస్థ అయిన కోల్ ఇండియాకి చెందిన మహానంది బొగ్గు క్షేత్రం (ఎంసీఎల్‌). ఈ ఘటన ఒడిషా రాష్ట్రంలో చోటుచేసుకుంది. సంబల్ పూర్‌ ప్రాంతంలోని మహానంది బొగ్గు క్షేత్రంలో.. నిషేధిత మైనింగ్ జోన్‌ పరిధిలో జరిగిన ఓ ప్రమాదంలో మేక చనిపోయింది. దీంతో సమీప గ్రామానికి చెందిన స్థానికులు ఆందోళనకు దిగారు. ఈ ఆందోళన కారణంగా ఎంసీఎల్‌ వద్ద దాదాపు మూడున్నర గంటల పాటు బొగ్గు రవాణా నిలిచిపోయింది. అకస్మాత్తుగా బొగ్గు రవాణా పనులు నిలిచిపోవడంతో కోట్లాది రూపాయలు నష్టం వచ్చింది. గ్రామస్థుల ఆందోళన విరమించకపోవడంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి పరిస్థితిని చక్కదిద్దారు. ఆందోళన విరమించిన తర్వాత బొగ్గు రవాణా పనులు తిరిగి ప్రారంభమయ్యాయి. అయితే ఈ ఆందోళన కారణంగా సంస్థకు 26.8 మిలిన్ల డాలర్లు నష్టం వాటిల్లిందని ఎంసీఎల్ సంస్థ ప్రతినిధి డికెన్‌ మెహ్రా వెల్లడించారు. అయితే ఈ ఆందోళనలకు దిగిన నిరసనకారులపై స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. స్థానిక ప్రజలు బొగ్గు, కట్టెలకోసం, అలాగే వారి పశువులను మేపేందుకు తమ పరిధిలోని నిషేధిత ప్రాంతాల్లోకి అక్రమంగా చొరబడతారనీ మెహ్రా తెలిపారు. మొత్తానికి ఓ మేక మరణం ఇన్ని కోట్ల నష్టాన్ని తెస్తుందని ఎవరూ ఊహించి ఉండరు.