ఇక ఆ ఫోన్లలో వాట్సాప్‌ సేవలు బంద్?

వాట్సాప్‌ సేవలు నిలిచిపోనున్నాయా..? షాకింగ్ న్యూస్..!  అంటే అవుననే చెబుతున్నారు. 2020 ఫిబ్రవరి 1వ తేదీయే వాట్సాప్‌కు చివరి రోజు.. కాకపోతే.. ఇది కేవలం కొన్ని ఫోన్లలో మాత్రమేనట.. కొన్ని యాపిల్‌ ఫోన్స్‌, మరికొన్ని యాండ్రాయిడ్‌ ఫోన్స్‌లోనూ ఫిబ్రవరి 1వ తేదీ నుంచి వాట్సాప్  పనిచేయదన్నమాట. వాట్సాప్ సేవలను ఆండ్రాయిడ్‌ 2.3.7 ఆపరేటింగ్‌ సిస్టమ్‌ (ఓఎస్‌)తో పాటు ఐవోఎస్‌ 7 వాడే ఐఫోన్లకు నిలిపివేస్తున్నట్టు మెసేజింగ్‌ దిగ్గజం వాట్సాప్‌ కీలక నిర్ణయాన్ని ప్రకటించింది. ఈ ఆపరేటింగ్ సిస్టమ్ […]

ఇక ఆ ఫోన్లలో వాట్సాప్‌ సేవలు బంద్?
Follow us

| Edited By:

Updated on: Sep 29, 2019 | 9:06 PM

వాట్సాప్‌ సేవలు నిలిచిపోనున్నాయా..? షాకింగ్ న్యూస్..!  అంటే అవుననే చెబుతున్నారు. 2020 ఫిబ్రవరి 1వ తేదీయే వాట్సాప్‌కు చివరి రోజు.. కాకపోతే.. ఇది కేవలం కొన్ని ఫోన్లలో మాత్రమేనట.. కొన్ని యాపిల్‌ ఫోన్స్‌, మరికొన్ని యాండ్రాయిడ్‌ ఫోన్స్‌లోనూ ఫిబ్రవరి 1వ తేదీ నుంచి వాట్సాప్  పనిచేయదన్నమాట. వాట్సాప్ సేవలను ఆండ్రాయిడ్‌ 2.3.7 ఆపరేటింగ్‌ సిస్టమ్‌ (ఓఎస్‌)తో పాటు ఐవోఎస్‌ 7 వాడే ఐఫోన్లకు నిలిపివేస్తున్నట్టు మెసేజింగ్‌ దిగ్గజం వాట్సాప్‌ కీలక నిర్ణయాన్ని ప్రకటించింది. ఈ ఆపరేటింగ్ సిస్టమ్ తో నడిచే స్మార్ట్ ఫోన్లకు 2020, ఫిబ్రవరి 1 నుంచి సేవలు ఆగుతాయని తెలిపింది. ఈ ఫోన్లలో కొత్త అకౌంట్లను తెరవలేరనీ, పాత అకౌంట్లను యాక్సెస్‌ చేయలేరని స్పష్టం చేసింది.డిసెంబర్ 31 తరువాత విండోస్ ఆపరేటింగ్ ఉన్న యూజర్లకు యాక్సెస్ ఉండబోదని పేర్కొంది. జూలై 1 నుంచే మైక్రోసాఫ్ట్‌ స్టోర్‌ నుంచి వాట్సాప్‌ ను తొలగిస్తున్నట్టు వెల్లడించింది. స్మార్ట్ ఫోన్ యూజర్లు ఆండ్రాయిడ్‌ 4.0.3, ఐఓఎస్‌ 8 కన్నా అప్‌ డేటెడ్‌ వెర్షన్లు వాడాలని తెలిపింది. ఆండ్రాయిడ్ ఫోన్ల కోసం సరికొత్త బీటా వెర్షన్‌ ను అందుబాటులో ఉంచామని, దీనిలో చాటింగ్‌ చేస్తూనే వీడియోలను చూడవచ్చని సంస్థ వెల్లడించింది.