వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్.. ఇక నకిలీ మెసేజ్‌లకు చెక్

WhatsApp starts rolling out frequently forwarded messages feature, వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్.. ఇక నకిలీ మెసేజ్‌లకు చెక్

ముంబై: ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ మరో కొత్త ఫీచర్‌ను యూజర్లకు పరిచయం చేయనుంది. ఎప్పుడూ కొత్త కొత్త ఫీచర్లతో ప్రజలను మరింత దగ్గరవుతున్న ఈ యాప్ ఇప్పుడు ఫార్వర్డ్ మెసేజ్‌లపై దృష్టి సారించింది. ఎక్కువ సార్లు ఒక మెసేజ్ ఫార్వర్డ్ అయితే.. ఆ మెసేజ్‌‌ డబుల్ బాణం గుర్తుతో కనిపించేలా వాట్సాప్ కొత్త ఫీచర్‌ను తీసుకువస్తోంది. ‘ఫ్రీక్వెంట్లీ ఫార్వర్డెడ్’ అనే ఈ ఫీచర్‌ను తొలుత భారతదేశంలోనే అందుబాటులోకి తీసుకురానుంది. ప్రస్తుతం ఈ ఫీచర్ టెస్టింగ్ దశలో ఉందని ఆ సంస్థ తెలిపింది. ఏదైనా ఒక మెసేజ్‌ను ఐదు సార్ల కంటే ఎక్కువగా ఫార్వర్డ్ చేస్తే దానికి డబుల్ బాణం గుర్తు కనిపిస్తుంది.

అంతేకాకుండా లాంగ్ మెసేజ్‌లు పంపితే అవి యూజర్లు చదవడానికి వీలుగా వాట్సాప్ సంస్థ ఒక ఆప్షన్‌ను అందుబాటులోకి తీసుకురానుంది. ఇది మరింత యూజర్‌ ఫ్రెండ్లీగా మారుతుందని, ముఖ్యంగా గ్రూప్ చాట్‌లలో ఇది ఉపయోగపడుతుందని సంస్థ ఒక ప్రకటనలో పేర్కొంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *