ఫేక్ న్యూస్‌కు వాట్సప్ సరికొత్త పరిష్కారం

న్యూఢిల్లీ: వాట్సప్ వాడకం ప్రజల్లో ఎక్కువగా ఉంది. అయితే అందులో తప్పుడు వార్తల ప్రచారం ఒక పెద్ద సమస్యగా మారింది. భారత్‌లో ఎన్నికల నేపథ్యంలో దానిని అడ్డుకునేందుకు వాట్సప్ సంస్థ సరికొత్త పరిష్కారంతో ముందుకొచ్చింది. ‘చెక్‌ పాయింట్‌ టిప్‌లైన్‌’ పేరుతో కొత్త సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చింది. మనకు వచ్చే సందేశాలపై ఏమాత్రం అనుమానం ఉన్నా చెక్‌పాయింట్‌ టిప్‌లైన్‌ (+91 96430 00888)కు తెలియజేయవచ్చు. భారత్‌కు చెందిన మీడియా సంబంధిత నైపుణ్యతగల అంకుర సంస్థ ‘ప్రోటో’ ఆవిష్కరించిన టిప్‌లైన్‌ […]

ఫేక్ న్యూస్‌కు వాట్సప్ సరికొత్త పరిష్కారం
Follow us

| Edited By:

Updated on: Apr 03, 2019 | 6:22 PM

న్యూఢిల్లీ: వాట్సప్ వాడకం ప్రజల్లో ఎక్కువగా ఉంది. అయితే అందులో తప్పుడు వార్తల ప్రచారం ఒక పెద్ద సమస్యగా మారింది. భారత్‌లో ఎన్నికల నేపథ్యంలో దానిని అడ్డుకునేందుకు వాట్సప్ సంస్థ సరికొత్త పరిష్కారంతో ముందుకొచ్చింది. ‘చెక్‌ పాయింట్‌ టిప్‌లైన్‌’ పేరుతో కొత్త సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చింది.

మనకు వచ్చే సందేశాలపై ఏమాత్రం అనుమానం ఉన్నా చెక్‌పాయింట్‌ టిప్‌లైన్‌ (+91 96430 00888)కు తెలియజేయవచ్చు. భారత్‌కు చెందిన మీడియా సంబంధిత నైపుణ్యతగల అంకుర సంస్థ ‘ప్రోటో’ ఆవిష్కరించిన టిప్‌లైన్‌ సేవల ద్వారా ఎన్నికల సమయంలో వాట్సాప్‌లో చక్కర్లు కొట్టే అసత్య వార్తలను సులభంగా తెలుసుకోవచ్చు.

అనుమానాస్పద సందేశాలను టిప్‌లైన్‌ ద్వారా ఫిర్యాదు చేస్తే ప్రోటో దాన్ని పరిశీలించి నిజమో కాదో తేలుస్తుంది. ఎన్నికల నేపథ్యంలో ప్రభుత్వం వాట్సాప్‌ను హెచ్చరించడంతో ఫేక్‌ న్యూస్‌ అడ్డుకట్టకు చర్యలు ప్రారంభించింది. అసత్య వార్తల ప్రచారాన్ని అడ్డుకునేందుకు ఫేస్‌బుక్ కూడా చర్యలు ప్రారంభించింది.