వాట్సాప్ నోటిఫికేషన్స్ లో కొత్త ఫీచర్

వాట్సాప్ లో కొత్త ఫీచర్ వచ్చింది. నోటిఫికేషన్లను 8 గంటలు, వారం, నెల, ఏడాది వరకు మాత్రమే మ్యూట్ చేసే సదుపాయం ఇప్పటి వరకూ ఉండేదన్న సంగతి తెలిసిందే. ఇప్పుడా ఆప్షన్ల జాబితాలో శాశ్వతంగా మ్యూట్ చేసే అవకాశాన్ని కూడా కల్పించింది. అంటే, అవసరంలేని నోటిఫికేషన్లను ఎప్పటికీ మ్యూట్ చేసేయొచ్చన్నమాట. మళ్లీ మనం అన్ మ్యూట్ చేసేదాకా ఆ నోటిఫికేషన్లు మన జోలికి రావు. వాట్సాప్ లో ఈ సరికొత్త ఫీచర్ ను ‘ఆల్వేస్’ పేరిట అందుబాటులోకి […]

  • Venkata Narayana
  • Publish Date - 9:05 pm, Fri, 23 October 20

వాట్సాప్ లో కొత్త ఫీచర్ వచ్చింది. నోటిఫికేషన్లను 8 గంటలు, వారం, నెల, ఏడాది వరకు మాత్రమే మ్యూట్ చేసే సదుపాయం ఇప్పటి వరకూ ఉండేదన్న సంగతి తెలిసిందే. ఇప్పుడా ఆప్షన్ల జాబితాలో శాశ్వతంగా మ్యూట్ చేసే అవకాశాన్ని కూడా కల్పించింది. అంటే, అవసరంలేని నోటిఫికేషన్లను ఎప్పటికీ మ్యూట్ చేసేయొచ్చన్నమాట. మళ్లీ మనం అన్ మ్యూట్ చేసేదాకా ఆ నోటిఫికేషన్లు మన జోలికి రావు. వాట్సాప్ లో ఈ సరికొత్త ఫీచర్ ను ‘ఆల్వేస్’ పేరిట అందుబాటులోకి తీసుకువచ్చారు. ఇది వాట్సాప్ మొబైల్ లోనే కాకుండా, వాట్సాప్ వెబ్ లోనూ పొందుపరిచినట్టు సంస్థ వెల్లడించింది. మీ వాట్సాప్ లో ఈ ఫీచర్ కనిపించకపోతే, వాట్సాప్ ను లేటెస్ట్ వెర్షన్ కు అప్ డేట్ చేసుకోవాల్సి ఉంటుంది.