Breaking News
  • విశాఖ: బ్లూఫ్రాగ్‌ టెక్నాలజీస్‌పై కొనసాగుతున్న సీఐడీ విచారణ. 8 సర్వర్లకు చెందిన డేటాను సేకరించిన అధికారులు. డేటాను విశ్లేషిస్తున్న సీఐడీ అధికారులు. ప్రభుత్వ ఇసుక పోర్టల్‌ను హ్యాక్‌ చేసి.. కృత్రిమ కొరత సృష్టించినట్టు బ్లూఫ్రాగ్‌పై అభియోగాలు.
  • హైదరాబాద్‌: అధికారులతో రైల్వే సేఫ్టీ కమిషనర్‌ భేటీ. కాచిగూడ రైలు ప్రమాదంపై చర్చ. ప్రకాశం జిల్లా: ఒంగోలులో మనబడి నాడు-నేడు కార్యక్రమం ప్రారంభం. కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం జగన్. వివిధ శాఖలు ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించిన జగన్‌.
  • ప.గో: యలమంచిలి మండలం కాజ గ్రామంలో రోడ్డుప్రమాదం. అదుపుతప్పి పంట కాలువలోకి దూసుకెళ్లిన కారు. దంపతులకు తీవ్రగాయాలు, ఆస్పత్రికి తరలింపు.
  • అనంతపురం: కల్యాణదుర్గంలో కాలువలోకి దూసుకెళ్లిన కాలేజ్‌ బస్సు. ప్రమాద సమయంలో బస్సులో 48 మంది విద్యార్థులు. విద్యార్థులకు తృటిలో తప్పిన ముప్పు. డ్రైవర్‌ నిర్లక్ష్యమే కారణమంటున్న విద్యార్థుల తల్లిదండ్రులు.
  • భూపాలపల్లిలో కొనసాగుతున్న బంద్‌. ఆర్టీసీ డ్రైవర్‌ నరేష్‌ ఆత్మహత్యకు నిరసనగా బంద్‌. డిపోల్లోనే నిలిచిపోయిన ఆర్టీసీ బస్సులు.
  • అమరావతి: మంగళగిరి జనసేన కార్యాలయంలో బాలల దినోత్సవం. పాల్గొన్న జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌. పిల్లలకు పుస్తకాలను పంపిణీ చేసిన పవన్‌కల్యాణ్‌.
  • హైదరాబాద్‌: కూకట్‌పల్లిలో నియోజకవర్గంలో మంత్రి కేటీఆర్‌ పర్యటన. పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన కేటీఆర్‌. కూకట్‌పల్లిలో ఇండోర్‌ స్టేడియం ప్రారంభం. మల్టీపర్పస్‌ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌ను.. పిల్లలతో కలిసి ప్రారంభించిన మంత్రి కేటీఆర్‌. డబుల్ బెడ్‌రూమ్ కాంప్లెక్స్‌ను ప్రారంభించిన కేటీఆర్. అధికారిక కార్యక్రమాల్లో ఫ్లెక్సీలపై కేటీఆర్‌ వార్నింగ్‌. ఫ్లెక్సీలు తొలగిస్తేనే కార్యక్రమానికి వస్తానన్న కేటీఆర్‌. కేటీఆర్‌ ఫ్లెక్సీలు తొలగించిన సిబ్బంది.

వాట్సాప్ న్యూ ఫీచర్… ఇకపై గ్రూపుల బెడద లేనట్లే.?

సోషల్ మీడియా మెసేజింగ్ యాప్ వాట్సాప్ తన యూజర్లకు మరో గుడ్ న్యూస్ అందించింది. వరుసగా కొత్త ఫీచర్లను వినియోగదారులకు అందుబాటులోకి తీసుకువస్తూ.. తమ బ్రాండ్‌ను పెంచుకుంటూపోతోంది. ఇటీవలే ఆండ్రాయిడ్ యూజర్లకు ఫింగర్ ప్రింట్ అన్‌లాక్ ఫీచర్‌ను విడుదల చేసిన వాట్సాప్.. ఇప్పుడు గ్రూప్ ప్రైవసీ సెట్టింగ్స్‌లో కొన్ని మార్పులు చేసి ప్రపంచవ్యాప్తంగా ఉన్న వినియోగదారులందరికీ అందుబాటులోకి తీసుకురానుంది. ఈ ఫీచర్‌తో మీకు గ్రూప్‌ల బాధ ఉండదు. ఇకపై ఎవరైనా మిమ్మల్ని గ్రూప్‌లో చేర్చుకోవాలని చూస్తే.. వారికి మీ పర్మిషన్ తప్పనిసరిగా ఉండాలి.

గతంలో ఇన్విటేషన్ అనే ఫీచర్‌ను తీసుకొచ్చిన వాట్సాప్.. ఇప్పుడు ఆ స్థానంలో గ్రూప్ ప్రైవసీ సెట్టింగ్స్‌లోనే పలు మార్పులు చేసింది. ఇన్విటేషన్ ఫీచర్ వల్ల ఎవరైనా మిమ్మల్ని గ్రూప్‌లో యాడ్ చేయాలని చూస్తే వారికి మీ అనుమతి తప్పనిసరి. గ్రూప్‌లో యాడ్ చేయాలంటే మిమ్మల్ని మొదటగా ఆహ్వానిస్తారు. మీరు ఓకే అన్నాక గ్రూప్‌లో యాడ్ అవ్వచ్చు. ఇక ఇప్పుడు కొత్తగా వచ్చిన సెట్టింగ్స్ వల్ల మీరూ.. ఏఏ గ్రూప్స్‌లో చేరాలనుకుంటున్నారో నిర్ణయం తీసుకోవచ్చు.

సెట్టింగ్స్ మార్చడానికి మొదటగా వాట్సాప్ ప్రైవసీ సెట్టింగ్స్ ఓపెన్ చేయండి.. ఆ తర్వాత అకౌంట్ ఓపెన్ చేసి.. అందులో ప్రైవసీ బటన్ క్లిక్ చేయండి. ప్రైవసీలో గ్రూప్స్ క్లిక్ చేస్తే మీకు.. Everyone, My contacts, My contacts except, Nobody అని నాలుగు ఆప్షన్స్ కనిపిస్తాయి. ఆ ఆప్షన్స్ బట్టి మీరు నచ్చిన విధంగా గ్రూప్స్‌లో యాడ్ కావచ్చు. దీని వల్ల యూజర్లకు ఎంతగానో ఉపయోగం ఉండటమే కాకుండా గ్రూప్స్ తలనొప్పి తగ్గుతుంది. కాగా, ప్రస్తుతం ఈ ఫీచర్ బీటా యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉండగా.. త్వరలోనే మిగతా యూజర్లకు అందుబాటులోకి రానుంది.