ఫేక్ న్యూస్ కు చెక్ పెట్టేందుకు వాట్సప్ లో కొత్త ఫీచర్

ప్రముఖ ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ త‌న యూజ‌ర్ల‌కు త్వర‌లో మ‌రో కొత్త ఫీచ‌ర్‌ను అందుబాటులోకి తేనుంది. సెర్చ్ ఇమేజ్ పేరిట ల‌భ్యం కానున్న ఆ ఫీచ‌ర్ సహాయంతో యూజ‌ర్లు త‌మ‌కు వాట్సాప్ మెసేజ్‌ల‌లో వ‌చ్చే ఇమేజ్‌లు అస‌లువో, న‌కిలీవో చాలా సుల‌భంగా గుర్తించ‌వచ్చు. యూజ‌ర్లు త‌మ‌కు వ‌చ్చిన మెసేజ్‌పై ప్రెస్ చేసి ప‌ట్టుకుని అనంత‌రం వ‌చ్చే విండోలో సెర్చ్ ఇమేజ్ అనే ఆప్షన్‌ను ఎంచుకోవాలి. దీంతో ఆ ఇమేజ్ నేరుగా గూగుల్‌లో సెర్చ్ అవుతుంది. ఈ […]

ఫేక్ న్యూస్ కు చెక్ పెట్టేందుకు వాట్సప్ లో కొత్త ఫీచర్
Follow us

| Edited By:

Updated on: Mar 14, 2019 | 6:31 PM

ప్రముఖ ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ త‌న యూజ‌ర్ల‌కు త్వర‌లో మ‌రో కొత్త ఫీచ‌ర్‌ను అందుబాటులోకి తేనుంది. సెర్చ్ ఇమేజ్ పేరిట ల‌భ్యం కానున్న ఆ ఫీచ‌ర్ సహాయంతో యూజ‌ర్లు త‌మ‌కు వాట్సాప్ మెసేజ్‌ల‌లో వ‌చ్చే ఇమేజ్‌లు అస‌లువో, న‌కిలీవో చాలా సుల‌భంగా గుర్తించ‌వచ్చు. యూజ‌ర్లు త‌మ‌కు వ‌చ్చిన మెసేజ్‌పై ప్రెస్ చేసి ప‌ట్టుకుని అనంత‌రం వ‌చ్చే విండోలో సెర్చ్ ఇమేజ్ అనే ఆప్షన్‌ను ఎంచుకోవాలి. దీంతో ఆ ఇమేజ్ నేరుగా గూగుల్‌లో సెర్చ్ అవుతుంది. ఈ క్రమంలో ఆ ఇమేజ్ అస‌లుదో, న‌కిలీదో యూజ‌ర్లకు ఇట్టే తెలిసిపోతుంది.

సహజంగా వాట్సాప్ చాట్ ద్వారా మనం అవతలి వారికి ఫోటోలు పంపిస్తాం, అవతలి వారు మనకు కొన్ని ఫోటోలు పంపిస్తూ ఉంటారు. ఇలా ఒకరికొకరు ఇచ్చి పుచ్చుకునే ఫోటోలలో కొన్ని సందర్భాల్లో ఫేక్ న్యూస్ కూడా ఉండే ప్రమాదం ఉంటుంది. ఆ ఫోటో నిజమైనదో, నకిలీదో ఎలా తెలుసుకోవాలో అర్థం కాక చాలామంది దాన్ని గుడ్డిగా నమ్ముతూ ఉంటారు. ఈ నేపథ్యంలో వాట్సప్ దీనికి పరిష్కారంగా ఒక మంచి సదుపాయం తీసుకువచ్చింది.

ఈ మధ్య కాలంలో కనీసం నిర్ధారణ చేసుకోకుండా, వైరల్ కంటెంట్ ఇష్టం వచ్చినట్లు సర్క్యులేట్ చేసుకుంటున్న నేపథ్యంలో ఈ ఫీచర్ ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. అయితే ఈ సెర్చ్ ఇమేజ్ ఫీచ‌ర్‌ను వాట్సాప్ ప్రస్తుతం అంత‌ర్గతంగా ప‌రిశీలిస్తున్నది. కాగా వాట్సప్ బేటా వెర్షన్ వాడుతున్న వినియోగదారుల కోసం తాజాగా 2.19.73 వెర్షన్ అందుబాటులోకి వచ్చింది. త్వరలో అందరి వినియోగదారులకు ఈ ఫీచర్ అందుబాటులోకి రానుంది.